జీవిత పరీచ్చ

అది నా డిగ్రీ పూర్తయిన సమత్సరం. సరా మామూలుగానే కరువుతో కటకటలాడిన కాలమది. డిగ్రీ పట్టా అయితే ఎట్లనోకట్ల సంపాయిచ్చి గానీ , ఇంగ అవతల పట్టుకోనీకి యా గట్టూ కాన్రాల్య. మా గరుగు సేన్లో సెనిక్కాయ పైరొచ్చినట్లు నా సదువంతా అరకొరగ మార్కులతోనే ఒడపకచ్చి. ...

వాయసగండం

పొద్దున్నే ఆఫీసుకెళ్ళటానికి పదినిమిషాలు టైముందని పేపరు తిరగేస్తూ ఉంటే నా సహోద్యోగి ఫోను చేసి, “ఒ క్కసారి లోకల్ న్యూస్ చూడు. పది నిమిషాలే.” అన్నాడు.  టివీ పెట్టి చూస్తే, పక్కవీధిలో ఒక ఇంటిలో ఏదో వింత జరుగుతోంది అని చెబుతున్నారు. ఆ...

దుఃఖంలో ఉన్నప్పుడు…

దుఃఖంలో ఉన్నప్పుడంతే! ఏమీ కనపడదు, ఏమీ వినపడదు, ఏమీ గుర్తుండదు. దుఃఖంలో ఉన్నప్పుడంతే! దగ్గర వాళ్ళు పరాయివాళ్ళయిపోతారు. పరాయి వాళ్ళు -దగ్గర వాళ్ళయిపోతారు. దూరమైన వాళ్ళు ఇంకా దూరమై పోతారు. దూరమై దూరమై దగ్గరైపోతారు. మనుషులు వదులు కావడం, మనుషులు పట్టు...

యుద్ధం చిదిమేసిన ప్రేమ:
‘ది క్రేన్స్ ఆర్ ఫ్లయింగ్’ (1957)

“యుద్ధం వ్యయంతో కూడిన వ్యవహారం. అది చెల్లించే వాట్లోకెల్లా గరిష్టమైనది మానవ మూల్యమే.” – రోజ్ కెంప్. ప్రపంచాన్నే జయించాలనుకున్న జాత్యహంకారి ఫాసిస్ట్ నాజీ హిట్లర్ దురాక్రమణకు అడ్డుకట్ట వేయడానికి సోవియట్ రష్యా సైనికులూ, పౌరులూ కలిపి రెండు కోట్ల డబ్భై...

రాజధానుల రగడ
ఇకనైనా ముగిసేనా!

ప్రస్తుతం జరుగుతున్న మూడు రాజధానుల రగడకు తెర పడే లోపు రాష్ట్రంలోని వివిధ సంక్షేమ పధకాల అమలూ,  సాధారణ పాలనా వ్యవస్థ ఎంత కుంటు పడాల్సి వుందో అని ఆందోళన కలుగుతుంది.  రాజధానిపై జగన్ కృత నిశ్చయంతో వున్నట్టే కనబడుతోంది కనుక దీనిపై రాద్దాంతంకన్న, రైతులకు...

కల

నాకో కల వచ్చింది ఒక తెల్ల పావురం నారింజ రంగులో మునకేసింది నల్లమలలో వానరం అడ్డం బొట్లు పెట్టుకుంది శేషాచలం కొండల్లో భల్లూకం నిలువు బొట్లు పెట్టుకుంది గేదెలన్నీ జన్యుమార్పిడితో ఆవులౌతున్నాయి ఇళ్లకింద ఏముందేమోనని తవ్వకాలు ప్రారంభించిన పురావస్తు శాఖ...

ప్రేమకు ఆవలి తీరం
చలం జీవితాత్మక నవల

జీవితాన్ని జీవితంగా మొట్టమొదటగా తెలుగు వాళ్లకు చూపించిన తెలుగు కథకుడు గుడిపాటి వెంకటచలం. నిజానికి చలం గారి ఇంటిపేరు కొమ్మూరి. వాళ్ల నాన్న పేరు కొమ్మూరి సాంబశివరావు. తన తల్లి తండ్రి అంటే తాతగారు గుడిపాటి వెంకట్రామయ్య కు మగ సంతానం లేకపోవడం వల్ల తన...

పంజరం 

స్టీల్ పంజరంలో ఉన్న మాట్లాడే చిలక, బంగారు పంజరంలో ఉన్న పక్కింటి చిలకని చూసి జెలసీ ఫీలయ్యింది. కాసేపటి తరువాత తుప్పుపట్టిన ఇనుప పంజరంలో ఉంటున్న వెనకింటి చిలకను చూడటంతో   “హమ్మయ్య” అనుకుంది. కొన్నాళ్ళకు తుప్పట్టిన పంజరం తలుపూడిపోవడంతో ...

ఒక నిద్రలు…

సారీ… నాకిప్పుడు కూడా నిద్రొస్తోంది… నాకు నిద్రపోవాలని వుంది. బడికి వెళ్ళకుండా బజ్జోవాలని వుంది. ప్లీజ్… ప్చ్… రోజూ యింతే! తలచుకుంటే నాకేడుపొస్తోంది. మాంచి నిద్రలో వుంటానా? అప్పుడే తెల్లవారిందని నిద్ర లేపేస్తారు. మామూలుగా...

మీ అవకాశాల అయస్కాంతం మీరే!

నిరంతరం అవకాశాలు మనకు ఎదురవుతూనే ఉంటాయి. కానీ అవి పరిష్కరించలేని సమస్యల ముసుగులో ఉంటాయి.                                                                                                                                             -జాన్ గార్డ్ నర్...

సర్పశిఖి

అతడు ఆ రాజప్రాసాదం నుంచీ బయటకే చూస్తున్నాడు. అన్నీ సగం కట్టి వదిలిన ఇళ్లు సగం తవ్వి వదలిన నేలలు. తలలు లేని వాళ్ళంతా వుత్త మొండేలతో కొడుతున్న జేజేలు. ఒళ్లు ఆనందంతో  గగుర్పొడుస్తోంది. గర్వంతో మీసం దువ్వి తలపై జుట్టు పైకెగదోయ బోయాడు. వెంటనే తనకు...

అల వైకుంఠపురములో… ?

.‘మీరు కథలు ఎలా రాసుకుంటారు?’ అని గతంలో ఒక ఇంటర్వ్యూలో రాజమౌళిని అడిగారు, (అఫ్ కోర్స్ ఆయన ప్రతి సినిమాకు కథనందించేది వారి తండ్రి విజయేంద్రప్రసాదే అయినా). దానికి సమాధానంగా రాజమౌళి ‘నాకు తెలిసి కొత్త కథలంటూ ఏమీ ఉండవండీ. పురాణాలు...

లాస్ట్ మినిట్

వన్ రూపీ కాయిన్, డబ్బా ఫోను మనకోసమే కనిపెట్టి వుంటరు. ఏమీ మాట్లాడలేక నీళ్ళల్లో ఇసిరేసిన రాళ్ల లెక్క అలలు అలలుగా తాకే మాటలకోసం కుప్పలు తెప్పలుగా రూపాయి బిళ్ళల ప్రేమ.  వొడవని ముచ్చట్లలో అన్నీ పెగలని మాటలే. నిశ్శబ్దం మనమధ్య రాయభారం నడిపినపుడు...

రచయితలకు సూచనలు

1. అదరూ దయచేసి యునికోడ్ లో టైప్ చేసిన రచనలనే పంపించండి. మీ రచన అచ్చుతప్పులు మీరే మరో సారి చూసుకోండి. మీ రచనకు బాగుంటాయని మీకనిపించే పిక్చర్లు, ఫోటోలు ఏవైనా వుంటే పంపండి. 2. ఫేస్ బుక్ తో సహా ఎక్కడా ప్రచురితం కాని రచనలనే ‘రస్తా’కు పంపించండి. ప్రత్యేక...