ఒక విజ్ఞప్తి

అందరికీ తెలుసు, ఒప్పుకో బుద్ధి కాదు గాని. మన (తెలుగు) వాళ్ల ఇళ్లలో… చాల ఎక్కువ సెకండ్ జెనరేషన్ ఎడ్యుకేటెడ్ ఇళ్లలో.. పిల్లల ‘మాతృ’ లేదా ‘పితృ’ భాష తెలుగు కాదు. ఇంగ్లీషే. పిల్లలు ‘అమ్మా’, ‘సర్రే’, ‘కదు’, ‘లెదు’ అనే కొన్ని తెలుగు మాటలు పలికితే విని తెగ మురిసి పోతుంటాం మన మాతృభాషా సేవలో భాగంగా. (ఈ మాట అందరి గురించి కాదని, పిల్లల్ని తెలుగు బళ్లలోనే చదివించిన వాళ్లు కూడా లేకపోలేదని ఒక డిస్క్లెయిమర్).

ఇంతకూ చెప్పొచ్చిందేమంటే… చాల మంది తెలుగు వారి ఇళ్లలో తెలుగులో కాకుండా ఇంగ్లీషులో ఆలోచించే, ఫీలయ్యే, రాసే, పాడే, వినే పిల్లలున్నారు. నిజం చెప్పాలంటే ఇప్పుడు వాళ్ళే ఎక్కువ. ఇక ముందు మరీ ఎక్కువ

బాగా చిన్న పిల్లల నుంచి కాలేజ్ గోయింగ్ లేక కాలేజ్ లీవింగ్ పిల్లల్లో వాళ్ళే ఎక్కువ. అలాంటి పెద్దలు ఇప్పటికే చాలమంది వున్నారు. వాళ్ళు కూడా ‘రస్తా’లో కలిసి రావాలని, అందుకు వాళ్లను అమ్మనాన్నలు ప్రోత్సహించాల విజ్ఞప్తి. అలాంటి పిల్లలు, యువకులు, అలాంటి పెద్దలు, వృద్ధులు కూడా తమ ఇంగ్లీషు రచనల్ని… చిన్న కథలు, కవితలు, వ్యాసాలు…. ‘రస్తా’కు పంపించండి. బహుశా జూన్ నెల నుంచే… రచనల ఫ్లో మీద ఆధారపడి… ‘రస్తా’ లో ఇంగ్లీషు విభాగం మొదలెడదాం. ‘సర్రేనా’?!

దయచేసి, అలాంటి రచనలను వేరుగా rasthamag@gmail.com అనే ఇ మెయిల్ ఐడి కి పంపించండి.

గులాబీ గులాబీ పరిమళమే వీస్తుంది సుమండీ… దాన్ని రోజ్ అని అన్నప్పటికీ…

http://rasthamag.com/

రస్తా

Add comment

Categories

Your Header Sidebar area is currently empty. Hurry up and add some widgets.