స్నేహితుడు

నీపై నిప్పుల వర్షం కురుస్తున్నప్పుడు
జలపాతాన్ని గొడుగులా ఎత్తేవాడు

నీవు ఆశయం కోసం ఒంటరివైనప్పుడు
నమ్మకంతో నిన్నలుముకొని సమూహమయ్యేవాడు

నువ్వు కత్తుల వంతెన దాటాల్సి వచ్చినప్పుడు
విచ్చుకత్తుల్ని పువ్వొత్తుల్లా మార్చేటోడు

నువ్వు అగాధంలోకి నెట్టబడినప్పుడు
నిన్ను రోదసికెగిసే రాకెట్ ని చేసేటోడు

– ఎడమ శ్రీనివాసరెడ్డి

ఎడమ శ్రీనివాస రెడ్డి కాకతీయ ప్రభుత్వ కళాశాలలో రసాయన శాస్త్ర అధ్యాపకులు, గతంలో టీచర్ ఎడ్యుకేటర్ గా కూడా పనిచేశారు. స్వాతి వార పత్రిక  కథల పోటీలో (1985) బహుమతితో రచనా వ్యాసంగం ప్రారంభం. పది లోపు కథలు, డజన్ కవితలు, రసాయన శాస్త్రం, విద్యారంగ విషయాలపై వందకు పైగా వ్యాసాలను ప్రచురించారు.  రెండు పుస్తకాలు ప్రచురించారు. విద్యా రంగ సమస్యలపై పని చేస్తున్న సొసైటీ ఫర్ చేంజ్ ఇన్ ఎడ్యుకేషన్ స్టీరింగ్ కమిటీ సభ్యులు. షాడో ఎడ్యుకేషన్, విద్యా ప్రైవేటీకరణ, టీచర్ ఎడ్యుకేషన్, కంపారిటివ్ ఎడ్యుకేషన్ ఆయనకు ఆసక్తి వున్న విషయాలు.

ఎడమ శ్రీనివాసరెడ్డి

ఎడమ శ్రీనివాస రెడ్డి కాకతీయ ప్రభుత్వ కళాశాలలో రసాయన శాస్త్ర అధ్యాపకులు, గతంలో టీచర్ ఎడ్యుకేటర్ గా కూడా పనిచేశారు. ‘స్వాతి’ వార పత్రిక  కథల పోటీలో (1985) బహుమతితో రచనా వ్యాసంగం ప్రారంభం. పది లోపు కథలు, డజన్ కవితలు, రసాయన శాస్త్రం, విద్యారంగ విషయాలపై వందకు పైగా వ్యాసాలను ప్రచురించారు.  రెండు పుస్తకాలు ప్రచురించారు. విద్యా రంగ సమస్యలపై పని చేస్తున్న ‘సొసైటీ ఫర్ చేంజ్ ఇన్ ఎడ్యుకేషన్’ స్టీరింగ్ కమిటీ సభ్యులు. షాడో ఎడ్యుకేషన్, విద్యా ప్రైవేటీకరణ, టీచర్ ఎడ్యుకేషన్, కంపారిటివ్ ఎడ్యుకేషన్ ఆయనకు ఆసక్తి వున్న విషయాలు.

Add comment

ఇటీవలి వ్యాఖ్యలు

Categories

Your Header Sidebar area is currently empty. Hurry up and add some widgets.