క్రియేటివిటీకి పెట్టింది పేరు ఆ ఊరు

నాకు థాయిలాండ్ కొత్తేమీ కాదు. ఇప్పటికే చాలా మార్లు వెళ్ళాను. గతం లో నా ప్రయాణం ఎక్కువగా బాంగ్ కాక్, పట్టాయా, ఫుకెట్ నగారాలకుండేది. చియాంగ్ మై కి పోవడం మాత్రం మొదటి సారి. మిగతా చోట్ల కు  పోతుంటే రొటీన్ గా ఉండేదేమో. చియాంగ్ మై కి మొదటి సారి కావడం తో కాస్త ఉత్సాహాంగానే వుంది. థాయిలాండ్ అంటే మన దేశం లో చాలా మందికి స్ఫురణకొచ్చేవి మసాజ్ లు, సెక్స్ టూరిజం, షాపింగ్ మాల్స్ తదితరాలు. దానికి కారణం ట్రావెల్ ఏజెన్సీలు…  పట్టాయా, బాంగ్ కాక్ లలో లభించే లీజర్ లైఫ్ గడపటానికో, గ్లోబల్ స్పేసేస్ గా భావించే షాపింగ్  మాల్స్ చూడటానికే ప్రధానంగా యాత్రలు నిర్వహిస్తుండడం. అలాగని థాయిలాండ్ సాంస్కృతిక  చరిత్ర లేని దేశం కాదు . థాయిలాండ్ కు ఎంతో సంస్కృతి, చరిత్ర వున్నాయి. ఆ దేశ సాంస్కృతిక జీవితం చూడడానికి వందలాది బౌద్ధ ఆలయాలను, వారి వ్యవసాయ  విధానాలను పరిచయం చేసే నగరాలకు పోయేవారు అరుదు. ఒకప్పుడు బాంగ్ కాక్ లో కూడా మంచి సాంస్కృతిక జీవితం ఉండేది క్రమక్రమంగా అది షాపింగ్ మాల్స్ కు, సెక్స్ ఎకానమీకి వరల్డ్ సెంటర్ గా మారిపోవడంతో దాని అసలు చరిత్ర వెనుకకు వెళ్ళిపోయింది. ఇక పట్టాయా గురించి చెప్పాల్సిన పనే లేదు. జనం దృష్టిలో అది ప్రపంచ సెక్స్ రాజధాని.

ఇలాంటి పోకడలకు ఇంకా పెద్దగా  దరిచేరని థాయిలాండ్ లోని చిన్న పట్టణం  చియాంగ్ మై.

థాయిలాండ్ ఉత్తర ప్రాంతంలో లావోస్, మయన్మార్ లకు సరిహద్దున వున్న పట్టణం చియాంగ్ మై. థాయిలాండ్ కు ట్రావెల్ ఏజెన్సీల ద్వారా యాత్రలకు వెళ్లే చాలా మంది భారతీయులకు  ఆ నగరం గురించి పెద్దగా తెలియదు. కానీ కొన్ని సంవత్సరాల క్రితం Trip Advisor ప్రకటించిన ప్రపంచ 25 ఉత్తమ టూరిస్ట్ ప్రాంతాల్లో చియాంగ్ మై కూడా స్థానం  దక్కించుకుంది. అంతే కాదు. యునెస్కో 2017 లో చియాంగ్ మై ని క్రియేటివ్ సిటీ గా గుర్తించింది, 2015 లో చియాంగ్ మై ని  హెరిటేజ్ సిటీ గా గుర్తించడానికి ఇచ్చిన వినతి పత్రం ఇంకా పరిశీలనలో వుంది. ఆ చిన్న నగరంలోని ప్రతి అణువునా సృజనాత్మకత (క్రియేటివిటీ) ఉట్టిపడుతుంది. ఆ నగరం చుట్టుపక్కల ప్రాంతాలకు  ఎంతో చరిత్ర ఉంది.

మేము  చియాంగ్ మై పోయినప్పుడు అక్కడ మాకు కనిపించిన భారతీయుల సంఖ్య పదికి మించలేదు. (తమాషా ఏమిటంటే, కొంత మంది మమ్మల్ని మీది మలేసియా నా అని అడిగారు) బాంగ్ కాక్, పట్టాయా నగరాలతో పోల్చితే ఆ సంఖ్య చాలా చాల తక్కువ (గణాంకాల ప్రకారం ప్రతి సంవత్సరం పదిహేను లక్షల పైనే మన దేశం నుండి థాయిలాండ్ పోతున్నారు). మాకు కనిపించిన వారిలో చాలా మంది చైనీస్, యూరోపియన్స్. మొత్తం టూరిస్టులలో అరవై  శాతం దాకా మాకు చైనా, పశ్చిమ దేశాల వాళ్ళే కనిపించారు. టూరిజం ప్యాకేజీ ద్వారా వచ్చిన వాళ్లలో ఎక్కువ మంది చైనా వాళ్ళైతే పశ్చిమ దేశాల నుంచి వచ్చినవాళ్లు అందరు స్వతంత్ర పర్యాటకులు. ఏ ట్రావెల్ ఏజెన్సీ ద్వారా వచ్చినవారు కాదు. బాంగ్ కాక్, పట్టాయాలలో కనిపించే బికినీ దృశాలు మాకు చియాంగ్ మైలో కనిపించ లేదనే చెప్పాలి.

బాంగ్ కాక్ నుంచి చియాంగ్ మై పోవడానికి రైలు, బస్సు, విమానం ఏదైనా ఎంచుకోవచ్చు . విమానం ఐతే ఒక గంట టైం తీసుకొంటుంది. బస్సులో పోవాలనుకోనే వారికి… బాంగ్ కాక్ బడ్జెట్ ఎయిర్ పోర్ట్ డోన్ మ్యూయాంగ్ ఎయిర్ పోర్ట్ కు దగ్గరలో వున్నా మొ చిట్ బస్సు స్టేషన్ నుంచి బస్సు లు అందుబాటులో ఉంటాయి. మేము పోయేటప్పుడు విమానంలో పోయి, తిరుగు ప్రయాణం  బస్సు లో వచ్చాము. మేము రివ్యూస్ చూసి మంచి రేటింగ్ వున్న బస్సు సర్వీస్ ను ఎంపిక చేసుకున్నాం. రివ్యూస్ లో చెప్పినట్లు బస్సు సర్వీస్ చాలా బాగా వుంది. చాలినంత లెగ్ స్పేస్. ప్రతి సీట్ కు టీవీ, ఛార్జింగ్ ఉంచారు . ఎయిర్ హోస్టెస్ లాంటి డ్రెస్ లో వున్న ఓ యువతి మా కండక్టర్.  ఫ్లైట్ లో లాగే బస్సు బయలుదేరగానే సాఫ్ట్ డ్రింక్స్, కేక్ ఆఫర్ చేశారు. అలాగే నాలుగు గంటల తరువాత దారిలోని ఓ నగరం లో హోటల్ లో భోజనం ఏర్పాటు చేశారు. బస్సు ప్రయాణం దాదాపుగా పది గంటలు సాగింది. దారి మధ్యలో రెండు మార్లు పోలీసులు ఎవరైనా అనుమానాస్పద వ్యక్తులున్నారేమో నని చెక్ చేశారు మిగతా బస్సులతో పాటు. దారి పొడుగునా చాలా చోట్ల రోడ్  కు ఇరువైపులా రాజు గారి పెద్ద సైజు కట్ ఔట్స్ మాకు దర్శనమిచ్చాయి. నా పక్క సీట్ లో అతనిని రాజు గారంటే ఎందుకంత ప్రేమని అడిగాను, దానికతను రాజు గారంటే చాలా మందికి ప్రేమున్నా లేకున్నా భారత దేశం లో కోర్టులను విమర్శించడం ఎలా నేరమో అలాగే థాయిలాండ్ లో రాజు గారిని విమర్శించడం నేరమని అందుకే ఇక్కడ బహిరంగంగా ఎవ్వరు రాజు గారిని విమర్శించరని చెప్పారు.

ఆ నగరాన్ని చూసిన తరువాత చియాంగ్ మై కి క్రియేటివ్ సిటీ అవార్డు రావడం మాకు ఆశ్చర్యమనిపించలేదు.  అక్కడ ప్రతి ఇల్లు ఎంతో కొంత సృజనాత్మకతను కలిగి ఉన్నట్లు మాకనిపించింది. మేము దిగిన చిన్న హోటల్  రస్టిక్ గెస్ట్ హౌస్ చాలా చిన్నదయినా చాలా ప్రత్యేకంగా అనిపించింది. థాయిలాండ్ లో లభించే చేతి వస్తువులు ఈ వూరి నుంచి వచ్చినవే. చియాంగ్ మై నుంచి చేతి తయారీ వస్తువులు ప్రపంచం మొత్తం ఎగుమతి అవుతున్నాయి.

చియాంగ్ మై చుట్టుపక్కల చూడ దగ్గ ప్రాంతాలు చాలానే వున్నాయనిపించింది.. వందలాది బౌద్ధ ఆలయాలకు ఆ ప్రాంతం ప్రసిద్ధి. మేము పోయినప్పుడు చిరు జల్లు  కురుస్తుడడంతో ఎక్కువ సంఖ్యలో ఆలయాలను చూడలేక పోయాం. అన్నీ చూడటానికి ఒక వారం పట్టవచ్చు. మేము అక్కడ వుండదలచుకొన్నది మూడు రోజులే. లోకల్ టూర్ ప్యాకేజీలో అన్ని ప్రాంతాలను చూడాలంటే మాకు పదివేల రూపాయలకు పైనే ఖర్చువుతుంది. అప్పుడు తగిలాడు మాకు  థోంగ్డీ (Thongdee). అతను మాకు యాదృచ్ఛికంగానే పరిచయమయ్యాడు. తన ఆటో లోనే మొత్తం తిప్పుతానని రోజుకు వెయ్యి రూపాయలడిగాడు. అతను మాకు చూపిన ప్రదేశాలు ఎక్కడ టూరిస్టులను బురిడీ కొట్టిస్తారో ఇచ్చిన సూచనలను చూస్తే అతనడిగింది చాలా న్యాయబద్ధమైన మొత్తం. అతని మూడు సీట్ల ఆటో (థాయిలాండ్ లో దాన్ని  “టుక్ టుక్ ” అంటారు) లో అన్ని ప్రాంతాలు చూశాం. స్నేక్ పార్క్, లయన్ పార్క్, ఎలిఫెంట్ పార్క్ (మా ఆవిడ లక్ష్మి దీన్ని బాగా ఎంజాయ్ చేసింది ). అన్ని చూశాం కానీ సదుపాయాల విషయంలో (ప్యాకేజీ టూర్ లో లాగా ఏ సి లేకపోవడం లాంటివి) కొంచం సర్డుకపోవలసి వచ్చింది. చాలా చోట్ల థోంగ్డీ నిజాయితీకి మేము ముగ్ధులమయ్యాం. అతనే చివరి రోజు మమ్మల్ని బస్సు ఎక్కించి వీడ్కోలు చెప్పాడు. మళ్లీ వస్తే తన సర్వీస్ నే వాడుకోవాలను కోరాడు. తను చెప్పకపోతే, మేము చెప్పేవాళ్లం ఆ మాట.

– జియెల్ నర్సింహా రెడ్డి

తన గురించి తానే  జియెల్ నర్సింహా రెడ్డి: ఆరేళ్ల క్రితం మేము ( నేను, నా భార్య లక్ష్మి ) తక్కువలో తక్కువ గా ప్రపంచం మొత్తంగా చూడటానికి ఎంత ఖర్చువుతుందో బేరీజు వేశాం. ఐదు లక్షలయితే అమెరికా ఖండం తో సహా  యాభయ్ దేశాలను చూడవచ్చని భావించాం. మనకు తెలిసిన మరో కుటుంబం కలిస్తే బడ్జెట్ మరింత తగ్గించవచ్చని అనిపించింది. అయినా, మేమొక్కరమే వెళ్లాలనుకున్నాం. మొదట సింగపూర్, కాంబోడియా, థాయిలాండ్ లతో మొదలైంది మా ప్రయాణం. ఖర్చు మేమనుకున్నంత కన్న చాలా తక్కువే అయ్యింది. ( మా సలహాలతో ఇలా ప్రయాణాలు చేసిన  మిత్రులు కొందరు మరింత తక్కువ ఖర్చుతోనే విదేశీ ప్రయాణాలు చేశారు. ఇప్పటికి మేము ఆసియా, యూరోప్, ఆఫ్రికాలలో ఇరవై పైగా దేశాలు చూశాం. ఇంకా చూస్తాం. ఈ ప్రయాణాల కథ అందరూ వింటానికి బాగుంటుందని నేను గమనించి, ఇక్కడ వరుసగా… మా యాత్రానందాన్ని మీతో పంచుకుంటున్నాం.

జియెల్ నర్సింహా రెడ్డి

తన గురించి తానే  జియెల్ నర్సింహా రెడ్డి: ఆరేళ్ల క్రితం మేము ( నేను, నా భార్య లక్ష్మి ) తక్కువలో తక్కువ గా ప్రపంచం మొత్తంగా చూడటానికి ఎంత ఖర్చువుతుందో బేరీజు వేశాం. ఐదు లక్షలయితే అమెరికా ఖండం తో సహా  యాభయ్ దేశాలను చూడవచ్చని భావించాం. మొదట సింగపూర్, కాంబోడియా, థాయిలాండ్ లతో మొదలైంది మా ప్రయాణం. ఖర్చు మేమనుకున్నంత కన్న చాలా తక్కువే అయ్యింది. ఇప్పటికి మేము ఆసియా, యూరోప్, ఆఫ్రికాలలో ఇరవై పైగా దేశాలు చూశాం. ఇంకా చూస్తాం. ఈ ప్రయాణాల కథ అందరూ వింటానికి బాగుంటుందని ... మా యాత్రానందాన్ని మీతో పంచుకుంటున్నాం.

6 comments

  • Good planning for world tour and reporting of the observations. Useful for many to tour with minimum possible budget. I think I need to discuss with you for the tours. Good Luck to you…In fact you introduced this Rastha mag to me which I don’t know before. Good Luck for your next trips to other part of the world……..Sree

  • జి.యల్. నర్సింహారెడ్డి గారు, చియాంగ్ మై లాంటి క్రియేటివ్ నగరాన్ని గురించి తెలియజేసినందుకు ధన్యవాదాలు. ఇదే విధంగా ఇతర విదేశీ ప్రయాణాల గురించి, తక్కువ ఖర్చుతో యాత్రలు ఎలా చేయవచ్చో మీ అనుభవాలను పాఠకులందరితో పంచుకుంటారని ఆశిస్తున్నాను.
    – విశ్వనాధ శ్రీ నగేష్ కుమార్.

  • Heartfelt thanks to you for describing your trip to Thailand depicting the importance of not so popular destinations at least for indian travellers like చిఆంగ్ మై. Appreciate the way you have remembered and mentioned Mr Thongdee. Wishing many more exciting travelogues from you GLN.

  • Very interesting and useful information about the places. Good that having information at hand will keep tourists explore the places and spend time in budget. Thanks for sharing

  • creativity ఉన్న ఊరు అన్నారు. ఫోటోలు పెట్టవలసింది. బావుండేది ఇంకా.

    • Nenu chaalo photos pampudamanukonna kaani rendu photos ku minchi pampadaaniki ledandi.adi patrika vaari nibandhana.

Categories

Your Header Sidebar area is currently empty. Hurry up and add some widgets.