డిప్రెషన్ ఒక సంక్లిష్టమైన జబ్బు

దేహాల గురించి సందేహాలు ఉంచుకోకుండా మనకు నమ్మకం వున్న క్వాలిఫైడ్ డాక్టరుతో మాట్లాడి ఆయన సలహా పాటించాలి తప్ప సొంత వైద్యానికి లేదా వినికిడి వైద్యానికి చెవుల్నీ దేహాల్నీ ఇచ్చేస్తే మేలు కన్న కీడు చాల ఎక్కువని… మే నెల రస్తాలో డాక్టరు గారు చెప్పారు. దానికి మంచి వుదాహరణలు కూడా ఇచ్చారు. మనకేమైనా సందేహాలుంటే ‘రస్తా’ పత్రికా ముఖంగా చెబుతామన్నారు. ఇప్పటికి వచ్చిన రెండు ప్రశ్నలకు … ఎవ్వరైనా అర్థం చేసుకోగల రీతిలో సైన్సు దారి తప్పకుండా వివరించారు. సందేహం వుండడం అదే ఒక బలహీనత అనుకోకుండా నిస్సందేహంగా డాక్టరు గారిని అడగండి. మీ ప్రశ్నల్ని <rastha.hrk@gmail.com>కు పంపించండి….. ఎడిటర్

 

  1. డాక్టర్ విరివింటి విరించి

    ప్రశ్న: Early morning వాకింగ్,లేదా గార్డినింగ్  చేస్తున్నప్పుడు మొత్తం శరీరపు ఏదో భాగంలో విపరీతంగా దద్దర్లు వచ్చేసి ఒక గంట తరువాత అవి మాయం అవుతున్నాయి కారణం ఏమిటంటారు, తెలియ చెయ్యగలరు.

  • మహ్మద్ మోయిన్, పాలకొల్లు

 

జవాబు: దీనిని కోలినెర్జిక్ రాష్ లేదా హీట్ హైవ్స్ అంటారు. శరీరం త్వరగా వేడెక్కడం వలన చర్మం చూపించే ఒక తాత్కాలిక రియాక్షన్ వంటిదిది. దురదను తగ్గించే సిట్రిజిన్ వంటి

యాంటీ హిస్టమిన్ మందులు కొంతవరకు ఉపశమనం కలిగిస్తాయి. కానీ ఎక్సర్సైజ్ చేయటానికి ముందూ అలాగే ఎక్సర్సైజ్ తరువాత వేడినీళ్ళతో స్నానం కాకుండా చల్లనీళ్ళతో చేయడం కొంత వరకు ఉపయోగ కరంగా ఉంటుంది. లేదా హీట్ హైవ్స్ మొదలవగానే శరీరం మీద ఐస్ తో రుద్దడం వంటివి చేయవచ్చు. స్పైసీ ఫుడ్‌ తినడం వలన కూడా ఈ రాష్ వచ్చే అవకాశం పెరుగుతుంది. ఎమోషనల్ స్ట్రెస్ కూడా ఒక కారణం. సింపుల్ గా చెప్పాలంటే ఎక్సర్సైజ్ చేసే ముందు ఈ ప్రికాషన్స్ తీసుకుని చూడండి. అప్పటికీ తగ్గకుంటే యాంటీ హిస్టమిన్ టాబ్లెట్లు వాడవచ్చు. అప్పటికీ తగ్గకుంటే డాక్టర్ ని సంప్రదించాల్సిందే. కొందరిలో వయసు పెరిగే కొద్దీ ఈ హీట్ హైవ్స్ తగ్గుముఖం పడుతుంటాయి.

2. ప్రశ్న: దిగులు (డిప్రెషన్) అనేది ఒక్కోసారి సరైన కారణం లేకుండానే నన్ను కుంగ దీయడం గమనించాను. ఆ మధ్య దీపికా పదుకునే అనే సుప్రసిద్ధ హిందీ నటి తను అలాంటి దురవస్థకు లోనవుతున్నట్టు టీవీలో వెల్లడించగా చూశాను. ఇది వైద్య పరంగా చికిత్సకు అనువైనదని, మానసిక… అని వెనుదీయ రాదని నాకు అర్థమయ్యింది. మందులు తీసుకున్నాక నాకు బాగుంది. దీని లోతుపాతులను వివరిస్తారా?

  • జె. సీతారాములు, హైదరాబాద్

 

జవాబు: హెలెన్ మేబర్గ్ అనే neuro scientist at Emori University,  “depression is an emotional pain without a context” అని నిర్వచిస్తారు. అంటే సందర్భం లేకుండానే కలిగే భావోద్వేగపు నొప్పి గా మనం అర్థం చేసుకోవచ్చు.

డిప్రెషన్ చాలా సంక్లిష్టమైన జబ్బు. Genetics, environment, stress వంటి ఎన్నో అంశాలు మనిషి డిప్రెషన్ లోకి పోవడానికి కారణాలుగా ఉంటాయి. కానీ కారణం ఏదైనా అన్నిటికి ఒక final common pathway ఒకటి ఉంటుందనుకుంటే అది సెరొటోనిన్. మెదడులో సెరొటోనిన్ అనే న్యూరోట్రాన్స్మిటర్ సరిగా పని చేయకపోవడం వలన డిప్రెషన్ కలుగుతుంది అనేది ఇప్పటిదాకా ఉన్న అవగాహన. దీనిని “కెమికల్ హైపోథీసిస్” అంటారు. మెదడులో సెరొటోనిన్ ని పెంచే మందులు ఇవ్వడం దీనికి పరిష్కారం. ఐతే ఈ మందులు కొందరిలో సరిగా పని చేయవు. కొన్ని స్టడీస్ సెరొటోనిన్ ని పెంచే మందులు కేవలం చక్కెర గుళికలవంటి ప్లాసిబో మాత్రమే తప్ప మరేమీ కాదు అని తేల్చేశాయి కూడా. వాటి వివరాలు మరెప్పుడైనా తెలుసుకుందాం.  

మెదడులో మన భావోద్వేగాలకు కారణమయ్యే హిప్పోకాంపస్, అమిగ్దలా వంటి భాగాలు ఉన్నాయి. అలాగే మనకు ఆలోచనలు కలిగించే సెరెబ్రల్ కార్టెక్స్ వంటి భాగాలూ ఉన్నాయి. ఐతే ఈ రెంటినీ సమన్వయం చేసే న్యూరాన్లు సెరొటోనిన్ అనే న్యూరో ట్రాన్స్మిటర్ తో ముడి పడి ఉన్నాయి. న్యూరాన్లు అంటే నరాల కణాలు. ఈ కణాలు ఒకదానితో ఒకటి మాట్లాడుకుంటాయి. సమాచారాన్ని అందించుకుంటాయి. ఆ సమాచారాన్ని ఒక కణం నుంచి ఇంకో కణానికి అందించేవే న్యూరో ట్రాన్స్మిటర్లు.

ఇపుడు ఒక అనుకోని సంఘటన జరిగిందనుకుందాం. దాని సంబంధమైన ఆలోచనలు సెరెబ్రల్ కార్టెక్స్ లో జనిస్తే..ఆ సంబంధమైన భావోద్వేగాలు  హిప్పోకాంపస్ లో ఉంటాయి. ఈ రెంటిని అనుసంధానం చేసే‌ వ్యవస్థ బాగా పనిచేయనపుడు మనిషి డిప్రెషన్ కి లోనౌతాడు అనేది ప్రస్తుత అవగాహన. నిజానికి ఇది ఇలా చెప్పినంత సరళంగా ఉండదు. ఈ వ్యవస్థలన్నీ ఒకదానితో ఒకటి చాలా సంక్లిష్టంగా ముడిపడి ఉంటాయి. ఒక ఆరోగ్యకరమైన వ్యక్తి తనకు తానుగా స్ట్రెస్ లోకి పోవాలి అనుకోడు. పరిస్థితులు ఆవిధంగా చేస్తాయి.  ఆరోగ్యకరమైన ఆలోచనలు మనిషిని మానసికంగా బలవంతుడిని చేస్తాయి. అనవసరమైన ఆలోచనలు మనిషిని బలహీనుడిగా మారుస్తాయి. ఐతే కొన్ని దేశాల్లో మెంటల్ వీక్ నెస్ ని personal weakness గా పరిగణించే ఆచారం వుంది. ఉదాహరణకు సౌత్ కొరియాలో anti depressent drugs చాలా తక్కువగా వాడతారు. కారణం ఏమంటే ఎంత డిప్రెషన్ లో ఉన్నాగానీ, సైకియాట్రిస్ట్ డాక్టరు దగ్గరికి పోవడానికి తటపటాయించడం అక్కడ ఆ దేశంలో ఎక్కువ. అందువలన డిప్రెషన్ తో కూడిన సూసైడ్స్ శాతం కూడా ఎక్కువగా ఉన్నది ఆ దేశంలోనే.

Genetics వంటి అంతర్గత కారణాలు స్ట్రెస్ వంటి బాహ్య కారణాలు డిప్రెషన్ కలగడానికి దోహదపడతాయి. మొదటి రకంలో చుట్టుపక్కల ఉన్న వారి ప్రవర్తన రోగి మీద ప్రభావం చూపకపోవచ్చు. కానీ రెండో రకంలో చుట్టూ పక్కల ఉన్న మనుషుల ప్రవర్తన కూడా ఈ రోగులను ప్రభావితం చేస్తుంది. అందుకే ఈ రెండవ రకం డిప్రెషన్ లో సుసైడల్ టెండెన్సీ ఎక్కువ. అటువంటి వారిని కుటుంబ సభ్యులే గుర్తించి, అర్థం చేసుకుని మసులుకోవలసి ఉంటుంది. ఏది ఏమైనా ప్రపంచ వ్యాప్తంగా ముప్పై కోట్ల ప్రజలు డిప్రెషన్ తో బాధ పడుతుండగా సంవత్సరానికి ఎనిమిది లక్షల మంది ఆత్మహత్య లు చేసుకుంటున్నారు. ఐనా ప్రపంచ వ్యాప్తంగా అతి తక్కువ మంది సైకియాట్రిస్ట్ లు పని చేస్తున్నారు…దానికి తోడు కొన్ని సమాజాలలో సైకియాట్రిస్ట్ దగ్గరికి పోవటం ఏదో అపరాధమనే భావన. పైగా కుటుంబ సభ్యులు డిప్రెషన్ కు గురైన వారిని గుర్తించక ఆడిపోసుకోవటం…ఇత్యాదివన్నీ పరిగణలోకి తీసుకుంటే డిప్రెషన్ ను చాలా సీరియస్ గా‌ తీసుకోవలసిన జబ్బుగా మనం గుర్తించాల్సిన అవసరం ఉందనిపిస్తుంది.

 

డాక్టర్ విరించి విరివింటి: ఎంబీబీఎస్ చదివిన తరువాత ఎమర్జెన్సీ మెడిసిన్ విభాగంలో ఐదేళ్ళకు పైగా పనిచేశారు. ఆ తరువాత క్లినికల్ కార్డియాలజీ లో పీజీ డిప్లొమా చేసి స్వంతంగా ప్రాక్టీసు చేస్తున్నారు. ముఖ్యంగా గ్రామీణ భారతంలో గుండె జబ్బులపై ప్రజల్లో అవగాహన పెంచే దిశగా అడుగులు వేస్తున్నారు. ఇక సాహిత్య కళా రంగాల్లో ఆసక్తి మీకు తెలియంది కాదు. కవిత్వం, కళలపై ఆయన ఆసక్తి అందరికీ తెలిసినదే. ‘రెండో ఆధ్యాయానికి ముందుమాట’ పేరుతో కవితా సంపుటి ప్రకటించారు. ‘పర్స్పెక్టివ్స్’ పేరుతో ఒక షార్ట్ ఫిల్మ్ నిర్మించారు.ఇప్పుడు ‘ఇక్కడి చెట్ల గాలి’ అనే మరో షార్ట్ ఫిల్మ్ రూపొందిస్తున్నారు.

డాక్టర్ విరించి విరివింటి

డాక్టర్ విరించి విరివింటి: ఎంబీబీఎస్ చదివిన తరువాత ఎమర్జెన్సీ మెడిసిన్ విభాగంలో ఐదేళ్ళకు పైగా పనిచేశారు. ఆ తరువాత క్లినికల్ కార్డియాలజీ లో పీజీ డిప్లొమా చేసి స్వంతంగా ప్రాక్టీసు చేస్తున్నారు. ముఖ్యంగా గ్రామీణ భారతంలో గుండె జబ్బులపై ప్రజల్లో అవగాహన పెంచే దిశగా అడుగులు వేస్తున్నారు. ఇక సాహిత్య కళా రంగాల్లో ఆసక్తి మీకు తెలియంది కాదు. కవిత్వం, కళలపై ఆయన ఆసక్తి అందరికీ తెలిసినదే. ‘రెండో ఆధ్యాయానికి ముందుమాట’ పేరుతో కవితా సంపుటి ప్రకటించారు.

‘పర్స్పెక్టివ్స్’ అనే షార్ట్ ఫిల్మ్ తో సినిమా దర్శకత్వం రంగంలో ప్రవేశించారు. తన 'ఇక్కడి చెట్ల గాలి'కి తెలంగాణ ఫిలిమ్ ఫెస్టివల్ అవార్డ్ లభించింది. 'షాడోస్', 'డర్టీ హ్యాండ్స్', "ఫ్యూచర్ షాక్' లఘు చిత్రాలు ఎడిటింగ్ దశలో వున్నాయి.

Add comment

Categories

Your Header Sidebar area is currently empty. Hurry up and add some widgets.