వెయ్యి సంవత్సరాల ప్రార్థన

ప్రజలు ఎవరైనా అడిగినప్పుడు నేను చైనాలో రాకెట్ శాస్త్రజ్ఞుడిగా పని చేసి రిటైర్ అయ్యాను అంటాడు షి. ప్రజలు అందరూ అతడిని గొప్పగా చూస్తారు. రాకెట్ శాస్త్రజ్ఞుడు అనే పదం తను డెట్రాయిట్ లో ఉండగా ఒక మహిళ ఉపయోగించింది. తన చాలీచాలని ఉద్యోగాన్ని గురించి వివరిస్తునప్పుడు ఆమె ఆశ్చర్యంతో నవ్వుతూ అన్న పదం రాకెట్ శాస్త్రజ్ఞుడు.

అమెరికాలో తనను కలిసిన ప్రజలు తన వృత్తిని గురించి తెలుసుకొని తన పట్ల మరింత స్నేహంగా ఉండటం అతడికి చాలా నచ్చింది. ఆవకాశం ఉన్నప్పుదంతా తన వృత్తి గురించి పదేపదే చెపుతున్నాడు. ఈ మధ్య పాశ్చాత్య నగరంలోని తన కూతురి దగ్గరకు అయిదు రోజుల క్రితం చ్చాడు. ఈ అయిదు రోజుల్లో ఎంతోమంది పరిచయస్తులని సంపాదించుకున్నాడు. తోపుడు బండ్లలో పిల్లలను తీసుకెళుతూ తల్లులు తనవైపు చూసి చేతులు ఊపుతున్నారు. ప్రతి రోజు ఉదయం ఒక ముసలి జంట ఒకరి చెయ్యి మరొకరు పట్టుకొని నడుస్తూ తనని పలకరిస్తున్నారు. ఆ జంటలో సూటు వేసుకున్న భర్త తనతో మాట్లాడుతున్నాడు. స్కర్టులో ఉన్న ముసలావిడ తనను చూసి ఒక చిరునవ్వు నవ్వుతోంది.

తన నివాసానికి కొద్ది దూరంలో ఉన్న ఒక విశ్రాంతి గృహంలో ఉండే ఒక ముసలావిడ తనతో మాట్లాడటానికి వస్తుంది. ఆమెకు డెబ్భై ఏడు సంవత్సరాలు. తనకన్నా రెండేండ్లు పెద్దది. ఇరాన్ నుంచి వచ్చింది.వారిద్దరికీ ఆంగ్లం సరిగ్గా రాకపోయినప్పటికీ ఒకరిని ఒకరు అర్థం చేసుకోవడంలో సమస్యా లేదు. స్వల్ప కాలంలోనే వారిద్దరూ మంచి స్నేహితులైనారు.

“అమెరికా మంచి దేశం అంటుంది ఆమె. పాటలు పాడితే బాగా డబ్బులువస్తాయి”. అమెరికా నిజంగానే మంచి దేశం. షి కూతురు అక్కడ ఒక గ్రంధాలయంలో పని చేస్తూ తను 20 సంవత్సరాలలో సంపాదించిన దానికన్న ఎక్కువే ఒక నెలలో సంపాదిస్తుంది.

“నా కూతురు బాగా సంపాదిస్తోంది” అమెరికా అందరికీ చాలా మంచి దేశం. అమెరికా అంటే నాకూ చాలా ఇష్టం. నేను చైనాలో రాకెట్ శాస్త్రజ్ఞుడిని నిజమే. కానీ ఏమి లాభం?. కడు పేదవాడిని. రాకెట్ శాస్త్రజ్ఞుడు అంటే తెలుసా?. షి తన రెండు చేతులు గోపురంలా పైకి ఎత్తాడు.

నాకు చైనా అంటే ఇష్టం. చైనా అతి పురాతనమైన మంచి దేశం.” అంటుంది ఆమె. “ అమెరికా నవయవ్వన దేశం. యువకులతో నిండిన నవయవ్వన దేశం”.

“యువకులు ముసలి వాళ్ళ కన్నా ఎక్కువ సంతోషంగా ఉంటారు”. అంటాడు షి. అంతలోనే అలా ముగింపుకి రాకూడదు అనుకుంటాడు. తన మటుకు తానూ మునపటికన్నా సంతోషంగా ఉన్నాడు. తన ముందు ఉన్న ఆమె ప్రత్యేక కారణం లేకపాయినప్పటికి ప్రపంచంలోని అన్ని విషయాలను ప్రేమిస్తుంది. సంతోషంగా ఉంది.

వారి సంభాషణలలో కొన్ని సార్లు ఇంగ్లీషు లుప్తమవుతుంది. ఆమె తన ఆంగ్లంలోకి పర్షియా పదాలను దొర్లిస్తోంది. షి అతి కష్టం మీద మాటలో చైనా భాష వాడటం లేదు. అలాంటప్పుడు తను మూగబోతే ఆ సంభాషణను ఆమె కొనసాగిస్తోంది. తను మాత్రం చురుకుగా నవ్వుతూ తల వూపుతూ ఉంటాడు. ఆమె భాషలో ఒక పదం కూడా అర్థం కానప్పటికీ తనతో మాట్లాడటంలోని సంతోషాన్ని ఆమె మొహంలో గమనిస్తాడు. ఆమె మాట్లడుతునప్పుడు నూ అదే సంతోషాన్ని పొందుతాడు.

ఉదయాన్నే పార్కులో కూర్చొని ఆమె కోసం ఎదురు చూస్తూ ఉంటాడు. ఆమె పేరు తెలియదు కనక మేడం అని సంబోదిస్తాడు. ఆమె వయసుకి సంభంధంలేని, తన ఊహకు అందని, తన దేశ సంస్కృతికి చెందని రంగు రంగుల దుస్తుల్తో కనిపిస్తోంది. ఆమె దుస్తులఫై ఉన్న తెల్లని ఏనుగు, నీలం ఆకుపచ్చ కలిసిన నెమలి ఆమె శరీరంతో పాటు కదులుతూ ముచ్చట గొలుపుతాయి. దుస్తులలో ఆమె తన కూతురి చిన్ననాటి జ్ఞాపకాలను గుర్తు చేస్తుంది.

తన కూతురు చిన్న పిల్లగా ఉన్నపుడు రంగు రంగుల దుస్తులతో, నుదుటిఫై వేలాడే ప్లాస్టిక్ సీతాకోకచిలుకతో తన ముందు తిరగాడిన జ్ఞాకం తనను అబ్బురుపరుస్తుంది. బాల్యంలోని తన కూతురి చిన్ననాటి మురిపాలను ఆమెతో చెప్పాలి అనుకుంటాడు కాని అందుకు తన ఇంగ్లీష్ మాటలు చాలవు. ఫైగా గతం గురించి మాట్లాడటం తనకు ఇష్టం లేదు.

సాయంకాలాలు తన కూతురు ఇంటికి వచ్చేసరికి భోజనం సిద్ధంచేసి ఉంచుతాడు. కొద్ది సంవత్సరాల క్రితం తన భార్య చనిపోయాక వంట చేయటంలో శిక్షణ పొందాడు. తన కాలేజీ రోజులలో గణిత శాస్త్రం, భౌతిక శాస్త్రం చదివినంత శ్రద్ధగా పా శాస్త్రంలోని మెళుకువలు తెలుసుకున్నాడు. ”ప్రతి మనిషీ తన జ్ఞానంతో ఉపయోగిస్తున్నదానికన్న ఎక్కువ నైపుణ్యాలను పుట్టుకతోనే కలిగిఉంటాడు. భోజనం బల్ల వద్ద అన్నాడు. “ వంటలో నేను ఎప్పుడూ ఇంత నైపుణ్యం సంపాదిస్తానని అనుకోలేదు. కానీ చూడు, అనుకున్న దాని కన్నా ఎక్కువ నైపుణ్యమే వచ్చింది.”

“అవును నిజంగా బాగుంది” చెప్పింది కూతురు. కూతురి వంక ఓరకంట చూస్తూ “అలాగే జీవితం మనం ఊహించలేని ఆనందాలను మనకు ఇస్తుంది. వాటిని చూడటానికి మనల్ని మనం తర్ఫీదు చేసుకోవాలి.

కూతురు సమాధానం ఇవ్వలేదు. తన పాక శాస్త్రకళను మెచ్చుకున్నప్పటికీ, తినడం మాత్రం ఏదో మొక్కుబడిగా ఒక తంతులా పూర్తి చేసింది. ఆమె ఉండవల్సినంత ఉత్సాహంగా ఉండటంలేదని, ఆమె జీవితంలో ఉత్సాహం కనిపించటం లేదని షి భాదపడుతున్నాడు. ఆమె కారణాలు ఆమెకి ఉండొచ్చు. ఏడు సంవత్సరాల పెళ్లి పెటాకులు అయింది. కూతురూ అల్లుడూ విడిపోయాక అల్లుడు శాశ్వతంగా బీజింగుకి వెళ్ళిపోయాడు. వారి వైవాహిక జీవితం ఇలా ఎందుకు మారిపాయిందో షికి తెలియదు. ఏది ఏమైనప్పటికీ, అది తన కూతురి తప్పై ఉండదు.

తన కూతురు అందమైన దయగల మంచి పిల్ల. తల్లికి మరో రూపం. కూతురు తనకి తన విడాకుల విషయం చెప్పినప్పుడు ఓదార్చలేనంత బాధలో కృంగిపోయి ఉంటుందినీ, ఓదార్చటానికి తనను అమెరికా రమ్మంటుంది నీ, ఆశించాడు. కానిలా జరగలేదు. ప్రతి రోజూ ఫోనులో కూతురితో మాట్లాడుతూ ఒక నెల పెన్షన్ మొత్తాన్ని ఫోన్ బిల్లుకే కరగదీశాడు. చివరికి తన డెబ్భై ఐదవ జన్మ దినాన్నిమెరికాలో జరుపుకోవాలని అనుకుంటున్నాను, అమెరికా చూడాలి అనుకుంటున్నాను అని చెప్పినప్పుడు

కూతురు అంగీకరించింది. అది అబద్దమే కానీ అమెరికాకు రావటానికి ఒక మంచి సాకు దొరికింది. అమెరికా తనను ఒక రాకెట్ శాస్త్రజ్ఞుడుగా, ఆనందకరమై కొత్త వ్యక్తిగా, ప్రేమించే తండ్రిగా, సంభాషణ చతురుడిగా చూస్తోంది.

రాత్రి భోజనం తర్వాత షి కూతురు ఒక పుస్తకం పట్టుకొని పడక గదిలోకి వెళ్లిపోవడమో, బయటకు వెళ్ళిపోయి ఏ అర్ధరాత్రో తిరిగి రావడమో చేస్తూ ఉంది. రాత్రి సమయంలో తన కూతురి వెంట వస్తాను అనీ, కూతురితో కలిసి సినిమాలకి, పార్టీలకి వస్తానునీ, ఒంటరిగా వెళ్ళటం కన్నా ఒక స్త్రీకి అది మంచిదని, ముఖ్యంగా నిరంతర ఆలోచనాశీలిగా ఉండే తన కూతురిలాంటి వారికి అది అవసరం కూడ అని అడిగాడు షి, కాని ఆమె తన స్థిరమైన మర్యాదతో కూడిన గొంతితో దానిని త్రోసిపుచ్చింది.

ఆమె ఒంటరితనాన్ని గురించి మాట్లాడి ఆమె సంతోషంగా ఉండటం చూడాలి అనుకున్నాడు షి. తనకు తెలియని ఆమె జీవితం గురించి ఆమెని నిరంతరం అడుగుతూ ఉంటాడు. “ ఈ రోజు ఉద్యోగంలో పని ఎలా ఉందిబాగుంది” అంటుంది ఆమె అలిసిన గొంతుతో. షి నిరాశ పడకుండా ఆమె సహోద్యోగుల గురించి అడుగుతాడు. మగవాళ్ళ కన్నా ఆడవాళ్ళు ఎక్కువగా ఉన్నారా? వాళ్ళ వయస్సు ఎంత? పెళ్ళైన వారికి పిల్లలు ఉన్నారా? మధ్యాహ్నం భోజనంలో ఏమి ఉంటుంది. తను ఒంటరిగానే తింటుందా?. తను వాడే కంప్యూటర్ ఏది? పుస్తకాలు చదువుతుంది? స్కూలు సహవిద్యార్థుల సమాచారం ఏంటి? ఆమె భవిష్యత్తు ప్రణాళిక ఏమిటి?.ఇలా ప్రశ్నల పరంపర. విడాకుల వల్ల ఏర్పడిన అవమానంతో స్నేహితులని కలుస్తోందా లేదా? అని అనుమానం. ఇప్పుడు ఉన్న స్థితిని అర్థం చేసుకుని భవిష్యత్తుని రూపొందించుకోవాలి అని ఆశ. ఇరవై నుండి ముప్పై సంవత్సరాల వయసు ఉన్న ఆడవాళ్ళు అప్పుడే తోటలోనుంచి తెచ్చిన మామిడిపండ్లలా నిగనిగలాడుతూ ఉంటారు. కాలం గడిచే కొద్దీ రంగు మారిపొయి మెత్తబడి విలువని కోల్పోతారు.

షికి విలువలగురించి మాట్లాడటం ఇష్టం ఉండదు. ఐతే జీవన సార్ధకత గురించి మాటాక తప్పట్లేదు, తను మాట్లాడుతున్న కొద్దీ సహనం కోల్పోతున్నాడు. కూతురిలో ఏ మాత్రం మార్పు లేదు. రోజు రోజుకీ తినడం తగ్గిస్తూ ఇంకా మౌనంగా తయారు అవుతోంది. చివరికి ఒక రోజు తను తన జీవితాన్ని ఆనందించాల్సిన విధంగా ఆనందించడం లేదు అన్నపుడు ఆమె జవాబు “అది మీరు ఎలా నిర్ధారిస్తారు? నేను నా జీవితాన్ని సంతోషంగానే గడుపుతున్నాను.

అది అబద్ధం. సంతోషంగా ఉండే వ్యక్తులెవ్వరూ మౌనంగా ఉండరు”.

ఆమె తన భోజనం పాత్ర నుంచి పైకి చూసింది. “ నాన్నా మీరు ఎప్పుడు మౌనంగా ఉండేవారు. మీరు అప్పుడు సంతోషంగా లేరా?.”

తన కూతురు అంత సూటిగా ప్రశ్నిస్తుంది అని తను అనుకోలేదు. సమాధానం ఇవ్వకుండా మౌనంగా ఉన్నాడు. మంచి నడవడిక కలవారు మాటల ద్వార ఇతరులను నొప్పించినప్పుడు అది అర్థం ఐన వెంటనే క్షమాపణ అడగాలి. కాని కూతురు అలాగే తన వైపు చూస్తూ పాత రోజులని గుర్తుకు తెచ్చింది. తన చిన్నతనంలో నిరంతరం నాన్నతోనే ఉంటూ అనేక ప్రశ్నలు అడుగుతూ సమాధానాల కోసం పట్టుబడుతున్నట్లు ఉండేది. కళ్ళు షి పెళ్లి సమయంలో ఏదో సమాధానం కోసం సూటిగా చూసిన తన భార్య కళ్ళను గుర్తుకు తెచ్చేవి.

“అవుననుకో, కానీ నేను ఎప్పుడూ సంతోషంగానే ఉన్నాను”.

అదే నాన్నా మనం మౌనంగా ఉంటూ కూడా సంతోషంగా ఉండొచ్చు కదా?.

“నీ సంతోషాన్ని నాతో ఎందుకు పంచుకోవు? నీ పని గురించి నాతో చెప్పు”.

“ మీ పని గురించి నాతో ఎప్పుడైనా చెప్పారా?”.

“ నేను ఒక రాకెట్ శాస్త్రజ్ఞుడిని. నా పని ఒక రహస్యం.

“మీరు మాతో విషయం గురించీ మాట్లాడలేదు. కూతురి సమాధానం.

షి ఏదో చెప్పాలి అనుకున్నాడు కానీ మాటలు రాలేదు. కొన్ని క్షణాల తరువాత “ ఇప్పుడు బాగా మాట్లడుతున్నా కదా? నాలో మార్పులేదా?”. వుంది”. చెప్పింది కూతురు. “అదే నువ్వు చేయాల్సింది. మాట్లాడుతూ ఉండు. ఆమె గబగబా తన భోజనం ముగించుకొని షి భోజనం ముగించేలోపే బయటకు వెళ్ళిపోయింది.

మరు రోజు ఉదయం షి మేడంతో చెప్పాడు. “నాకూతురు ఆనందంగా లేదు”. మేడం అంది “కూతురు ఉండటం ఆనందమైన విషయం” “ఆమె పెళ్లి రద్దు అయింది.

మేడం తల ఊపింది. ర్షియన్ భాషలో మాట్లాడటం ప్రారంభించింది. వివాహం రద్దు కావటం అంటే ఈమెకు తెలుసా? అనుకున్నాడు షి. ప్రపంచాన్ని ఇంత పిచ్చిగా ప్రేమిస్తున్న ఈమెకు అపసవ్యమైనది ఏదీ జరగకుండా భర్తో పిల్లలో గట్టి కవచంలా నిలిచి ఉంటారు. ఆమె మాట్లాడుతున్నపుడు ఆమె మొహంలో ప్రకాశాన్ని చూసి షి ఈర్ష్య పడతాడు. ఆమె కన్నా నలభై సంవత్సరాలు చిన్నదైన తన కూతురు ఆమెలాగా ఆనందంగా లేకపోవటం తనకు బాధను కలిగిస్తుంది. రోజు మేడం నారింజ రంగు గౌనులో ఉంది. గౌను నిండా యెగిరి దుమికే కోతి బొమ్మలు ఉన్నాయి. అలాంటి బట్టతోనే ఆమె తన జుట్టుని ముడి వేసుకొని ఉంది. నిరాశ్రయురాలయిన యువతి ఆమె. అయితే ఎం? ఆనందంగా ఉంది.

తనకు తెలిసిన ఇటీవలి కాలపు ఇరాన్ చరిత్ర చూస్తే నిజంగానే మేడం అదృష్టవంతురాలు. విషయానికి వస్తే తను కూడా అదృష్టవంతుడే. ఒక్కటో రెండో చిన్నాచితకా లోపాలు ఉంటే ఉండొచ్చు. రెండు విభిన్న ప్రపంచాలనుంచి వచ్చిన ఇద్దరు వ్యక్తులు ఆకురాలు నులివేసవిలో అలా కూర్చొని మాట్లాడుకోవటం అదృష్టం కాక పోతే మరేమిటి.

“ఒక పడవలో ఒరితో కలిసి ఒక నదిని దాటటానికి మూడు వందల సంవత్సరాల ప్రార్థన కావాలి అని చైనాలో ప్రజలు అంటుంటారు. అని చైనా భాషలో చెప్పి దాన్ని ఇంగ్లీషులో చెప్పాలి అనుకున్నాడు. అయినా భాషల హద్దు ఏమిటి? ఆవిడ తనను అర్థం చేసుకుంటుంది. అనువాదం ఉన్నా లేపోయినా భావాలనూ, బాధను అర్థం చేసుకునే మనిషి దొరకటానికి ఎంత కాలం

ప్రార్థన చేసి ఉండాలో అన్నాడు మేడంతో.

మేడం అంగీకారంగా ఒక చిరునవ్వు నవ్వింది.

ప్రతి బంధానికీ ఏదో ఒక కారణం ఉంటుంది. భార్యా భర్తా, పిల్లలూ, స్నేహితులూ శత్రువులూ, కొత్తవారూ. ఒకే తలగడ మీద నీకు ఇష్టమైన వ్యక్తితో తల పెట్టి పడుకోవటానికి మూడు వేల సంవత్సరాలు ప్రార్థన చేసి ఉండాలి. ఒక తండ్రికీ కూతురికీ హుశా ఒక వెయ్యి సంవత్సరాలు. అంత సులభంగా తండ్రి కూతుర్ల సంబంధంలోకి ఎవరు రారు. కానీ ఈ కూతురు! ఈమెకిదంతా అర్థం కాదు. నేను ఒక వ్యర్థ ప్రసంగాన్ని అనుకుంటూ ఉండాలి. ఈమె ఇప్పుడు నేను నోరు మూసుకొని ఉండాలి అనుకుంటుంది. ఎందుకంటే నన్ను అలాగే చూసింది. ఆరోజుల్లో నేను ఒక రాకెట్ శాస్త్రజ్ఞుడిని కనుక నా కూతురితోనూ, వాళ్ళ అమ్మతోనూ ఎక్కువ మాట్లడలేకపోవటం తను అర్థం చేసుకోలేదు. తన ఉద్యోగం అంతా ఒక గోప్యమైన వ్యవహారం. పగలంతా పని చేసి సాయంత్రం బయటకి వచ్చేటప్పుడు బయట ఉన్న సెక్యూరిటీ గార్డ్స్ మమ్మలి మా బట్టలను కూడా తనిఖీ చేసి నోటు పుస్తకాలనూ, మా జేబుల్లో ఉన్న చిత్తు కాగితాలను కూడా తీసుకునేవారు. మేము చేస్తున్న పని గురించి చివరికి జీవిత భాగస్వామితో కూడా చెప్పకుండా ఉండేట్లు శిక్షణ ఇస్తారు అక్కడ.

మేడం తన రెండు చేతులు తన హృదయాలపైన ఉంచుకొని ఇదంతా వింటోంది. తన భార్య చనిపోయిన ర్వా తన వయసుగల స్త్రీతో సన్నిహితంగా కూర్చోవటం ఇంతవరకు లేదు. అంతెందుకు భార్య బ్రతికి ఉన్నపుడు కూడా ఎప్పుడూ లేదు. తన భార్యతో కూడా ఎప్పుడూ ఇంత ఎక్కువగా మాట్లాడింది లేదు. హృదయం భారంగా తోచి కళ్ళు మూసుకున్నాడు. కూతురు చిన్నపిల్లగా ఉన్నపుడు తనతో సన్నిహితంగా లేని లోటు తీర్చేందుకు తను సగం ప్రపంచాన్ని చుట్టి కూతురి దగ్గరకు వచ్చాడు. అయితే కూతురు ఏమి చేసింది? తన మాటల పట్ల కొంచెం కూడా శ్రద్ధ చూపటంలేదు. ఐతే విచిత్రం తన భాష కూడా తెలియని సుదూర ప్రాంతం నుంచి వచ్చిన ఒక కొత్త వ్యక్తి అయిన ఈ మేడం ఎంతో అవగాహనతో తన మాటలు వింటోంది. రెండు బొటన వేళ్ళతో షి తన కళ్ళను రుద్దుకున్నాడు. వయస్సులో తను అనారోగ్యకరమైన భావోద్వేగాలకు లోను కాకూదేమో? దీర్ఘంగా గాలి పీల్చి చిన్నగా నవ్వాడు. “ఏమో తనకూ తన కూతురికీ మధ్య సంబంధం లేకపోవటానికి కూడా కారణం ఉంటుందేమో? తన కూతురు తనకు వేయి సంవత్సరాల అన్య మనస్క ప్రార్థన ఫలితమేమో?

మేడం చిన్నగా తలవూపింది. ఆమె తనను అర్థం చేసుకుంటుంది. తనకు తెలుసు. అయితే ఈ చిన్న చిన్న విషాద విషయాలతో ఈమెని ఇబ్బంది పెట్టలచుకోలేదు. తన జ్ఞాపకాల దుమ్ముని వదిలించుకోవటానికి అన్నట్టు రెండు చేతులను గట్టిగా రుద్దుకొని తనకి సాధ్యమైన మంచి ఇంగ్లీషులో అన్నాడు.” పాత కథలు ఆసక్తిని కలిగించవు.

“నాకు కథలు అంటే ఇష్టం” అంటూ మేడం మాట్లాడటం ప్రారంబించింది. తను వింటున్నాడు. ఆమె అప్పుడప్పుడు నవ్వుతోంది. ఆమె గట్టిగా నవ్వినప్పుడు ఆమె గౌను మీద ఉన్న కోతి బొమ్మలు అలా అలా ఎగురుతున్నాయి. ఆమె మాట్లాడటం ఆపిన తర్వాత అతడు ఇలా అన్నాడు. “ మనం అదృష్టవంతులం అమెరికాలో మనం ఏదైనా మాట్లాడవచ్చు. “అమెరికా మంచి దేశం. నాకు అమెరికా అంటే చాలా ఇష్టం.

సాయంత్రం షి తన కూతురితో చెప్పాడు పార్కులో నేను ఇరానీ మహిళను కలిసాను. నువ్వు ఎప్పుడైనా ఆమెను చూశావా?”. “లేదు”. “నువ్వు ఒక్కసారి ఆమెను కలవాలి. ఆమె ఎంత ఆశావాహ దృక్పథంతో ఉంటుందో తెలుసా? నీ స్థితికి ఆమె చక్కని మార్గదర్శి అవతుంది.

“నా స్థితి ఏమిటి? భోజనం వైపు నుంచి చూపు మళ్ళించకుండా తండ్రిని అడిగింది. “నువ్వే చెప్పాలి అన్నాడు షి. కూతురి నుంచి ఏ స్పందన రాకపోయే సరికి తనే కల్పించుకొని అన్నాడు నువ్వు ఇప్పుడు ఒక విషాద ఘట్టంలో ఉన్నావు”. “ఆమె నా జీవితంలో వెలుగుని తెస్తుంది అని మీరు ఏలా చెప్పగలరు.?”

షి జవాబుచెప్పాలనుకున్నాడు కానీ సమాధానం తోచలేదు. వేరు వేరు భాషలలో తనకు మేడంకు మధ్య జరిగిన సంభాషణ చెప్తే తనను ఒక వింత ముసలివాడు అనుకుంటుందేమో. ఒక సమయంలో సుజావుగా అనిపించిన విషయాలు ఇంకొక సమయంలో అత్యంత వ్యర్ధం కావచ్చు. నిరాశ పడ్డాడు. తనతో భాషను పంచుకునే వ్యక్తితో తను మధుర క్షణాలను పంచుకోగలడా? కొంచెం విరామం తర్వాత కూతురితో అన్నాడు. ఒక మంచి స్త్రీ ఇతరులు మాట్లాడే విధంగా ప్రవర్తించాలి. ప్రత్యక్ష ప్రశ్నల ద్వారా అవతలివారిని ఇబ్బంది పెట్టకూడదు.

నేను ఒక విడిపోయిన దానిని. మీ అంచనా ప్రకారం నేను ఒక మంచి స్త్రీని కాదు. కూతురు తనతో వెటకారంగా మాట్లాడుతుంది అనుకున్నాడు షి. ” మీ అమ్మ ఒక మంచి స్త్రీకి ఉదాహరణ”. మిమ్ముల్ని మాట్లాడేలా చేయగలిగిందా? అడుగుతూ ఆమె చూసిన చూపులు బాణంలా తన కళ్ళకు గుచుకున్నాయి. “ మీ అమ్మ ఎప్పుడు ఇలా కయ్యానికి కాలు దువ్వేదికాదు”. “నాన్నా! నేను మౌనంగా ఉంటే మాట్లాడు అంటారు. నేను మాట్లాడితే ఇలా వంకలు పెడతారు.

“మాట్లాడటం అంటే ప్రశ్నలే కాదు. మాట్లాడటం అంటే అవతలి వారి గురించి నీవు ఏమి అనుకుంటున్నావో వారికి చెప్పడం. వారు ఏం అనుకుంటున్నారో తెలుసుకోవటం. “నాన్నా, మీరు ఎప్పుడు మాటల వైద్యులు అయ్యారు?”.

“నేను ఇక్కడికి నీకు సహాయం చేయటానికి వచ్చాను. నాకుేతనైనది చేయటానికి ప్రయత్నిస్తున్నాను. నీ వివాహం ఇలా ఎందుకైందో నాకు తెలియాలి. జరిగిన పొరపాటు ఏమిటో తెలుసుకొని మరోసారిలా జరగకుండా ఒక సరైన వ్యక్తిని చూడాలి. నువ్వు నా కూతురివి. నువ్వు మరల మరల విఫలం కాకూడదు. సంతోషంగా ఉండాలి.

“నాన్నా, నేను ఇంత కాలం అడగలేదు కానీ మీరు ఇంకా ఎన్ని రోజులు అమెరికాలో ఉంటారు?” “నువ్వు మాములుగా తయారు అయ్యేవరకు. “కూర్చున్న కుర్చిలోంచి విసురుగా లేచి కుర్చీని ప్రక్కకు త్రోసింది. కీచుమని కుర్చీ నేలను గీరిన శబ్దం.

“ ఇప్పుడు కుటుంబం అంటే మనమిద్దరమే. షి ఇంకా ఏదో చెప్పబోయే ముందే కూతురు పడక గదిలోకి దూరి తలుపు వేసుకుంది. షి భోజనం బల్ల వైపు చూస్తూ ఉండిపోయాడు. కూతురేమీ ముట్టుకోలేదు. ఆమె ఎంతో ఇష్టంగా తింటూ తండ్రిని ఎంతో మెచ్చుకునేపదార్థాలన్నీ అలాగే బల్లమీద మిగిలే ఉన్నాయి. ఒక్క క్షణం తన వంట గురించి ఆమె పొగడ్తలన్నీ బూటమేమో అనిపించింది. వంట చేయటం అంటే ప్రార్థించటం అని ఆమెకు తెలియదు. భహుశా తన ప్రార్థనలో ఏదో లోపం ఉందేమో తెలియదు.

తల్లులయితే ఆడపిల్లలను సంతోషంగా ఉంచగలరేమో. మరు రోజు ఉదయం మేడంతో అన్నాడు షి. ఇప్పుడు ఆమెతో చైనా భాషలో మాట్లాడుతుంటే మనస్సుకు స్వాంతన కలుగుంతుంది.వాళ్ళిద్దరూ ఒకరికొకరు అన్యోన్యంగా ఉన్నారు. నాకూ వాళ్ళంటే చాల ఇష్టం. నాకు ఉద్యోగ ధర్మం వల్ల లా జరిగింది. పగలంతా రాకెట్ శాస్త్రజ్ఞుడిగా పని చేసేవాడిని. రాత్రులు దాని గురించే ఆలోచించేవాడిని. అదంతా రహస్యం కాబట్టి ఎవరితో మాట్లాడకూడదు. నా భార్య నన్ను బాగా అర్థం చేసుకోగల స్త్రీ. నా పనిని తను అర్థం చేసుకొనేది. నా పనికీ, ఆలోచనలకీ అడ్డు తగిలేది కాదు. తన కూతురిని కూడా నా ఏకాంతాన్ని భంగం చేయనిచ్చేది కాదు. ఐతే నా కూతురికి ఇదంతా అంత మంచిది కాదని నాకు తెలుసు. నేను నా ఆఫీస్ పనిని అక్కడే వదిలి వస్తూ ఉండవలసింది. కాని నాకు అప్పుడు అది అర్థం చేసకునే వయస్సు లేదు. ఇప్పుడు నా కూతురు నాతో ఏమీ మాట్లాడదు.

నిజంగా అది తన తప్పే. తన కాలంలో తనలాంటి అతికొద్ది మందిని ఒక గొప్ప పని కోసం దేశం ఎంచుకుంది. కుటుంబంకన్న ముఖ్యమైన దేశం తనపై ఉంచిన భాద్యతను పూర్తి చేయవలసిన అవసరం తనపై ఉండేది. అది గర్వకారణం నా విషాదమే. ఐతే విషాదం కన్నా ఎక్కువ గర్వకారణం. ఇవన్నీ కలిసి తనకూ తన కూతురికీ మధ్య సంభాషణను దూరం చేసాయి. ఆ రాత్రి భోజనం బల్ల దగ్గర షి కూతురు షి కోసం ఒక చైనా భాష మాట్లాడే టూరిస్ట్ కంపెనీని చూశాననీ వారు తూర్పు పడమర తీరాలకు యాత్రలు వేస్తారు అనీ చెప్పింది. “ మీరు ఇక్కడికి అమెరికా చూడటానికి వచ్చారు. చలి కాలం రాకముందే తూర్పు పడమరలకు ఒక సారి వెళ్లి వస్తే బాగుంటుంది అని అనుకుంటున్నా.

“ఎక్కువ ఖర్చు అవుతుందా? “నేను ఇస్తాను నాన్నా. మీ పుట్టిన రోజు కోసం మీరు కోరుకున్నది ఇదే కదా.” తన కూతురికి తన కోరిక తెలుసు దాన్ని తీర్చాలి అని ఆమె అనుకుంటోంది. కాని ఆమెకు అర్థం కానిది ఒకటి ఉంది. తను చూడాలనుకుంటున్నఅమెరికా ఇది కాదు. తన కూతురు సంతోషంగా ఉండే అమెరికా. తరిగిన కాయలనూ చేపలనూ గిన్నెలోవేస్తూ అన్నాడు .” నువ్వు బాగా తినాలి.

“రేపు వాళ్ళను పిలిచి యాత్రలు బుక్ చేస్తాను” ఆమె చెప్పింది. వయస్సులో నేను ప్రయాణం చేయడంకన్నా ఇక్కడ ఉండటమే నాకు మంచిదేమో.”

“ఇక్కడ చూడటానికి ఏమి లేదు.” “ ఎందుకులేదు, నేను చూడాలి అనుకున్నది ఈ అమెరికానే . నువ్వుమీ బాధ పడకు. నాకు ఇక్కడ స్నేహితులున్నారు. నేను నిన్ను ఎక్కువగా బాధించను.

కూతురు జవాబు చెప్పేలోపే ఫోన్ మ్రోగింది. ఫోన్ తీసుకుని మాములుగానే పడక గదిలోకి వెళ్లి పోయింది. తలుపు వేస్తుందేమో అని ఎదురు చూసాడు. ఆమె ఎప్పుడూ తన ఎదురుగా ఫోనులో మాట్లాడదు. కొన్ని సాయంత్రాలు సన్నని గొంతుతో సుదీర్ఘ సంభాషణలో ఉన్నపుడు ఆమె మాటలకోసం తన చెవులు రిక్కించాల్సి వచ్చేది. అయితే ఇప్పుడు ఆ తలుపు మూయలేదు.

ఆమె ఇంగ్లీషులో మాట్లాడుతోంది. గొంతుామూలు కన్నా కీచుగా వినిపిస్తున్నది.డిడిగా మాట్లాడుతూ నవ్వుతోంది. ఆమె మాటలు అర్థం కావటంలేదు. ఆమె ప్రవర్తన కూడా. పదునైన గొంతుతో గట్టిగా సిగ్గులేకుండా తన చెవులకు కష్టంగా వినిపించాయి ఆమె మాటలు. ఒక్క క్షణం ఆమె తన కూతురు కాదేమో అని అనిపించింది. ఒక కొత్త వ్యక్తిని నగ్నంగా చూస్తున్నట్లనిపించింది.

ఆమె గదిలోనుంచి బయటకి రాగానే ఆమె వైపు తీక్షణంగా చూశాడు. ఫోను పక్కపెట్టి ఏమీ మాట్లాడకుండా బల్ల ముందు కూర్చుంది. ఒక్క క్షణం ఆమె వంక చూసి అడిగాడు. “ఫోనులో ఎవరు?” “ఒ ఫ్రెండ్ “స్నేహితుడా? స్నేహితురాలా?” “స్నేహితుడే” ఇంకా చెపుతుందని షి ఎదురు చూసాడు. ఆమె చెప్పేలా కనిపించలేదు. కాసేపు ఆగి అడిగాడు. “ అతడు ప్రత్యేక స్నేహితుడా?” “అవును ప్రత్యేక స్నేహితుడే, “ఎలా?”, నాన్నా, ఈ సమాధానం మీకు కొంచెం భాదను కొంచెం ఊరటను కలిగిస్తుందేమో. అవును అతడు నాకు చాలా ప్రత్యేకం స్నేహితుడికన్నా ఎక్కువ. ప్రేమికుడు. నా జీవితం మీరు అనుకున్నంత కష్టంగా ఏమీ లేదు అని ఇప్పుడు మీకు తెలుస్తోందా?

“అతడు అమెరికనా?” “ ఇప్పుడు అమెరికనే, రుమేనియా నుంచి వచ్చాడు. కనీసం ఒక కమ్యూనిస్ట్ దేశంలో పెరిగాడు అనుకున్నాడు షి.” నీకతడు బాగా తెలుసా? నిన్ను బాగా అర్థం చేసుకుంటాడా? నువ్వు ఎక్కడినుంచి వచ్చావో, నీ సంస్కృతి ఏమిటో? ఇంకో సారి పొరపాటు చేయకూడదు. జాగ్రతగా ఉండాలి.

“ మేమిద్దరం ఒకరికొకరు చాల కాలం నుంచి తెలుసు. చాల కాలం అంటే? ఒక నెల చాలా కాలం కాదు కదా? అంతకంటే ఎక్కువ నాన్నా”. “ మహా ఐతే ఒకటిన్ననెల. చూడూ నువ్వు ఇప్పుడు బాధలో ఉన్నావు వదిలేయబడి బాధలలో ఉన్న స్త్రీ తొందరపాటు నిర్ణయం తీసుకోకూడదు. తొందర పాటులో తప్పులు జరుగుతాయి.

కూతురు తనవైపు చూసింది. “ నా వైవాహిక జీవితం మీరు అనుకునట్లు లేదు. నన్ను ఎవరూ వదిలి వెళ్ళలేదు. షి తన కూతురి వంక చూసాడు. ఆమె కళ్ళలో స్వచ్చత, కంఠంలో స్థిరత్వం కనపడ్డాయి. కూతురు ఏమైనా వివరాలు చెబుతుందేమో అని ఎదురు చూశాడు. అందరు మనుషుల లాగానే షి కూతురూ తన మాటల ప్రవాహాన్ని ఆపలేదు. “ మేము విడిపోయింది ఇతని కోసమే.

“కానీ ఎందుకు? వైవాహిక జీవితంలో కూడా తప్పులు జరగచ్చు నాన్నా”. “ భార్య భర్తల ఒక రాత్రి అనుబంధం వందేళ్ళు వారిని పరస్పరం ప్రేమిచుకునేలా చేస్తుంది. ఏడేళ్లకు నీ ర్తను ఎందుకు అలా చేసావు? నీ అక్రమ సంబంధం కాక ఇంకా ఏదైనా సమస్య కూడా ఉందా? అన్నాడు షి. నిబద్ధత లేని ఒక స్త్రీ తన కూతురు కావటం.……

ఇప్పుడు దాని గురించి చర్చ అవసరం. “ ఒక తండ్రిగా అది తెలుసుకునే హక్కు నాకుంది. బల్ల మీద గట్టిగా ఒక గుద్దు గుద్దాడు. “ నా సమస్యంతా నేను అతనితో సరిగ్గా మాట్లాడకపోవటమే. అతనెప్పుడు నా మౌనాన్ని చూసి తన నుంచి నేను ఏదో దాస్తున్నాననుకునే వాడు. నీ ప్రేమికుడిని అతని నుంచి దాయలేదా?”

షి కూతురు ఆ ప్రశ్నను పట్టించుకోకుండా “అతడు మాట్లాడాలి అని కోరిన కొద్దీ నాలో మరింత మౌనంగా ఒంటరిగా ఉండాలానే భావన పెరిగింది.ీరన్నట్లు నాకు మాట్లాడటం సరిగ్గా రాదు. అది అబద్ధం! ఫోనులో ఇప్పుడు నువ్వు సిగ్గులేకుండా

బరితెగించి నవ్వుతూ తుళ్ళుతూ మాట్లాడటం నేను చూశాను.”

తండ్రి మాటలకు కూతురు నిర్ఘాంతపోయింది. కొన్ని క్షణాల మౌనం తర్వాత చిన్నగా “నాన్నా అది వేరే. ఇప్పుడు మేము ఇంగ్లీషులో మాట్లాడుకున్నాము. ఇది నాకు సులభం. చైనా భాషలో మాట్లాడటం నాకు తెలెయదు.

“ఇది ఒక అర్థంలేని తప్పించుకోవాలనే ప్రయత్నం. “నాన్నా నీ భావాలను వ్యక్తం చేయలేని భాషలో నువ్వు పుట్టి పెరిగినప్పుడు, ఇంకొక కొత్త భాషలో మాట్లాడటం మనసులోని భావాలను వ్యక్తం చేయటం ఆ కొత్త భాషలో సులభం అవతుంది. ఆ భాష నిన్ను ఒక కొత్త వ్యక్తిగా యారు చేస్తుంది.

“నీ విచ్చలవిడి తనానికి మీ అమ్మనూ న్నూ నిందిస్తున్నావా?” “నేను లా మాట్లాడటం లేదు.”

“నువ్వు చెప్పేది అది కాక మరి ఏమిటి? నిన్ను మేము చైనా సంస్కృతిలో సరిగ్గా పెంకపోవటం వల్ల నువ్వు కొత్త భాషను ఎంచుకొని కొత్త ప్రేమికుడి కోసం భర్తతో సరిగ్గా మాట్లాడలేదంటావా?”

“నాన్నా, మీ ఇద్దరి సంసారంలో అమ్మ ఎప్పుడు మాట్లాడలేదు. మీరూ మాట్లాడలేదు. మీ వైవాహిక జీవితంలో ఒక సమస్య ఉంది అని మీకు తెలుసు. అందుకే మీరిద్దరూ మౌనంగా ఉన్నారు. “మా ఇద్దరి మధ్య ఎలాంటి సమస్య లేదు. మాది అన్యోన్యమైన జంట, “ అది అబద్దం. “అది అబద్దం కాదు, నేను పనిలో పడి మిమ్మలను సరిగ్గా పట్టించుకోలేదు. నువ్వు నా పనిలో గోప్యతను అర్థం చేసుకోవాలి.

షి కూతురు జాలి గొలిపే కళ్ళతో తండ్రిని చూస్తు అంది. “నాన్నా, అది కూడా అబద్దమని మీకు తెలుసు మీరు రాకెట్ శాస్త్రజ్ఞుడు కాదు. ఇది అమ్మకు తెలుసు. నాకు తెలుసు మన చుట్టూ ఉన్న వారికీ తెలుసు. షి కొంత సేపు తన కూతురివైపు అలా చూస్తుండిపోయాడు. చివరికి “నువ్వు ఎమంటున్నావో నాకు అర్థం కావటం లేదు. “నాకు తెలుసు నాన్నా, మీరు ఏ పని చేస్తున్నారో దాని గురించి మీరు ఎప్పుడూ మాట్లాడలేదు. అయితే మీ చుట్టూ ప్రక్కల ఉన్నవాళ్ళు అందరూ దాని గురించి మాట్లాడుకునేవాళ్ళు.

షి తడబడ్డాడు మాటలకోసం తడుముకున్నాడు. శబ్దం లేకుండా పెదవులు కదులుతున్నాయి. కూతురు చెప్పింది. నన్ను క్షమించండి నాన్నా. మిమ్మలను బాధపెట్టడం నా ఉద్దేశం కాదు.

షి దీర్ఘ శ్వాసలతో తన గాంభీర్యాన్ని ప్రదర్శించటానికి ప్రయత్నించాడు. తన జీవిత కాలంలో ఇలాంటి ఎన్నో విపత్తు సమయాలో తను ప్రశాతంగానే ఉన్నాడు. “నువ్వున్నట్లు నువ్వు నన్ను గాయపరచలేదు. నువ్వు సత్యాన్ని గురించి మాత్రమే మాట్లాడావు, అంటూ పైకి లేచి తన గదిలోకి పోతుండగా కూతురు నెమ్మదిగా అంది, మీ సందర్శనకు రేపు ఏర్పాట్లు పూర్తి చేస్తాను.

పార్కులో కూర్చున షి మేడంకు వీడ్కోలు చెప్పటం కోసం వేచిఉన్నాడు. తన అమెరికా సందర్శన తరువాత శాన్ఫ్రాన్సిస్కో నుంచి తన దేశానికి టికెట్ బుక్ చేయమని కూతురికి చెప్పాడు. అతను బయదేరడానికి ఇంకా వారం రోజులు ఉంది. అయితే మేడంను కలిసి వీడుకోలు చెప్పేందుకూ, తమ మధ్య ఇంత కాలం నడిచిన అబద్దాలపై వివరణ ఇవ్వడానికీ ధైర్యం కూడగట్టుకున్నాడు. నిజానికి అతడు రాకెట్ శాస్త్రజ్ఞుడు కాదు. అతడు అందులో శిక్షణ పొందాడు. తన మొత్తం ముప్పై సంవత్సరా ఉద్యోగంలో మూడు ఏండ్లు మాత్రమే రాకెట్ శాస్త్రజ్ఞుడుగా పని చేశాడు. ఒక యువ రాకెట్ శాస్త్రజ్ఞుడు గర్వించదగ్గ జ్ఞాపకం ఎవరితోనైనా పంచుకోవాలి అనిపించే అనుభవం అది.

నలభైరెందేండ్ల క్రింద ఇరవై అయిదు సంవత్సరాల వొక అమ్మాయి. కంప్యూటర్లు లేని ఆరోజులలో హాజరు కాలాన్ని లెక్కించేందుకు కార్డు పద్ధతి ఉన్న కాలంలో కార్డులపై గుర్తు వేసే ఒక అమ్మాయి. పేరు యిలాన్ గట్టిగా అన్నాడు. ఒక బుట్ట నిండా రాలిన ఆకులతో మేడం తన వైపు వస్తోంది. అందులో ఒక ఆకు తీసి షికి ఇచ్చింది. “ఎంత అందంగా ఉందో!.

షి ఆ ఆకుని పరిశీలిస్తూ వున్నాడు. ఆకులోనినెనూ, ఆకు పై పసుపు నారింజ రంగులలో ఉన్న చారలనూ, తను ఎప్పుడూ చూడని ఆకులలోని సూక్ష్మ భాగాలను చూస్తున్నాడు. తనకు అలవాటు పడిన రంగులనూ, మెత్తటి అంచులనూ గుర్తుకు తెచ్చుకోవడానికి ప్రయత్నిస్తున్నాడు. కళ్ళ ముందు ఏదో శుక్లపు పొఅడ్డు పడినట్లుగా ప్రతి వస్తువూ ప్రకాశవంతంగా సూటిగా ఉన్నప్పటికీ ఆకర్షనీయంగా వుంది. “మీకు ఒక్కటి చెప్పాలని ఉంది. అన్నాడు షి. ఆమె ఒక ఒక అందమైన చిరునవ్వుతో చెప్పండి అన్నట్లు చూసింది. షి ఇంగ్లీషులో నేను రాకెట్ శాస్త్రజ్నుడిని కాదు అన్నాడు.

మేడం ఏమిటన్నట్లు తల ఊపింది. షి ఒక్క క్షణం ఆమె వంక తల తిప్పి నేను ఒక స్త్రీ వల్ల రాకెట్ శాస్త్రజ్నుడిగా కొనసాగలేక పోయాను”. అన్నాడు. “మేము చేసిందల్లా మాట్లడుకోవటమే. మాట్లాడుకోవటంలో తప్పు లేదు. అని మీరు అనుకుంటారు . కానీ ఒక వివాహిత పురుషుడు, అవివాహిత స్త్రీ మాట్లాడుకోవటం అంగీకార యోగ్యం కానిది. అది మా కాలంలోని విషాదం. అవును మా కాలంలో అది విషాదం అనుకునేవాళ్ళం. కాలం నాటి యువత అనుకునే పిచ్చి కాదు. మాట్లాడకుండా ఉండటం మా శిక్షణలో భాగమైనప్పటికీ మేము మాట్లాడానే కోరికతో ఉండేవాళ్ళం. సాధారణ ప్రదేశాలలో మాట్లాడుకోవటానికి అలవాటు పడ్డాము. మా సంభాషణలు ఐదు నిమిషాల విరామంతో మొదలై భోజన విరామం అంతా మాటలతో గడిపేవాళ్ళం. మా మాటలన్నీ మేము చేస్తున్న పని వల్ల సృష్టించబడుతున్న ఘనరిత్రలోభాగం అయి ఉండేది. మా కమ్యూనిస్ట్ మాతృభూమి కోసం మొదటి రాకెట్ నిర్మాణానికి అత్యంత ఆరాటంతో పని చేస్తున్న యువ శాస్త్రజ్ఞుల తపన అది.

“ఒక సారి మాటలు మొదలు అయ్యాక అవి అలా కొనసాగుతూ కొనసాగుతూ,…….. ఆ మాటలు ఇంట్లో భార్యతో పంచుకునే మాటలకన్నా ప్రత్యేకం. ఎందుకంటే అక్కడ దాపరికాలు లేవు. మాట్లాడడం ఒక మోటు గుర్రం మీద సవారి లాగ హుషారునిచ్చేది. మేము మా సొంత జీవితాల గురించి మాట్లడుకున్నప్పటికీ ఆ సంభాషణ ఎక్కడ అంతం అవుతుందో ఎవరికి తెలియదు.లా ఉండేది మా మాటల వరుస. కాని చాల మంది అనుకున్నట్లు మా ఇద్దరి మధ్య ఏమీ లేదు. మేము ఇద్దరమూ ఒకరినొకరు ప్రేమించుకోలేదు, అన్నాడు షి. ఒక క్షణం తన మాటలకు తడబడ్డాడు. తను ఏ రకం ప్రేమ గురించి మాట్లాడుతున్నాడు. నిజంగా వాళ్ళు ప్రేమలో పడ్డారు. అయితే ప్రపంచం అనుమానించినట్లు కాదు. వారి మధ్య ఒక గౌరవప్రదమైన దూరం ఉండేది. వారి మధ్య కనీసం కర స్పర్శ కూడా లేదు. ఐతే వారి సరళ సంభాషణలూ, వారి హృదయ స్పర్శలూ, అది కూడా

ప్రేమే కదా? అదే కదా తన కూతురి పెళ్లిని కూడా విచ్చిన్నం చేసింది, ఒక పరపురుషుడితో సంభాషణల కారణంగానే తన కూతురు వైవాహిక జీవితానికి దూరం అయింది. షి బెంచి పై ఒక వైపు జరిగాడు. అక్టోబర్ నెల చల్లని గాలిలో సైతం అతనికి చమటలు పడుతున్నాయి. వారిద్దరి మధ్య సంబంధం ఆపాదించబడినప్పటికీ వారు నిర్దోషుమనే ధృడంగా నమ్మారు. ఆమెను ఒక సుదూర ప్రాంతానికి బదిలీ చేసినప్పుడు ఆమెతో పాటు బాధ పడ్డాడు. ఆమె ఒక చక్కని కాలమాపని. అయితే ఒక కాలమాపనిని తయారు చేయటం సులభమైననే. తను తమ ఇద్దరి మధ్య ఉన్న సంభందాన్ని ఒప్పుకుని ఆత్మవిమర్శ చేసుకుంటే రాకెట్ శాస్త్రజ్ఞుడిగా కొనసాగవచ్చు అని చెప్పారు. తను తప్పు చేయలేదు అని బలంగా నమ్మాడు కనుక అతడు అందుకు నిరాకరించాడు. నేను నా రాకెట్ శాస్త్రజ్ఞుడి అవతారాన్ని నా ముప్పై రెండు సంవత్సరాల వయసులో చాలించాను. ఆ తరువాత నన్ను ఎప్పుడు ఏ రకమైన పరిశోధలోను వినియోగించుకోలేదు. అయితే ఇది అంతా గోప్యం కనుక నా భార్యకు కూడా ఈ విషయం తెలియదు. క్రితం రాత్రి వరకు తను కూడా ఇదే అనుకున్నాడు. అంతటి శిక్షణ పొందిన తనను అదే కార్యాలయంలో అతి తక్కువ అర్హత గల ఉద్యోగంలో నియమించారు. చైర్మన్ మావో జన్మ దినోత్సవాలకూ, ఇతర సంబరాలకూ కార్యాలయాలను అలంకరించటం, ఒక పరిశోధన సమూహం నుంచి మరొక పరిశోధన సమూహానికి కాగితాలను, ఫైల్ లను అందించటం, సాయంకాలం వాటన్నిటినీ సేకరించి ఇద్దరు సెక్యూరిటీ గార్డుల సమక్షంలో బీరువాలో ఉంచి తాళం వేయటం. వంటి పనులు అతడు చేసేవాడు. తనను తానొక రాకెట్ శాస్త్రజ్ఞుడిగా కుటుంబం ముందు చిత్రించేందుకూ, తన గౌరవాన్ని కాపాడుకునేందుకూ తను మౌనాన్ని ఆశ్రయించాడు. తన భార్య కళ్ళలో తల ఎత్తిన ప్రశ్నలకు సమాధానాలు ఇవ్వకుండా ఉండేందుకు ప్రశ్నలు మాయం అయ్యే దాక తను తల తిప్పుకుంటూనే వున్నాడు. కూతురు పెరిగి పెద్దదవుతోంది. తన భార్య లాగే నెమ్మదిగా, అర్థం చేసుకోగల హృదయంతో ఒక మంచి పిల్లగా, మంచి స్త్రీగా పెరుగుతోంది.

యూనిఫారాలతో, బెల్టులలో ఖాళీ తూటాల సంచులతో, నిరంతరం పైకి చూసే తుపాకి గొట్టాలతో, తనతో పాటు పనిచేసిన ముప్పై రెండు మంది గార్డులు మాత్రం వాస్తవం. తనకు ఇంకొక దారిలేదు. తను తీసుకున్న నిర్ణయం తన భార్యకూ ఇంకొక మహిళకూ ఉన్న గౌరవాన్నినిలబెట్టడంగాక మరి మిటి? తన ప్రేమ సంబంధాన్ని ఒప్పుకొని తన భార్య మనస్సు గాయపరచి స్వార్థపరుడైన రాకెట్ శాస్త్రజ్ఞుడిలా ఎలా ఉండగలడు? తన తుచ్చ వాంఛతో ఇంకొక మహిళతో గడపటానికి సిద్ధమై తన ఉద్యోగాన్ని, భార్యను, రెండు సంవత్సరాల కూతురిని ఎలా వొదులుకోగలడు? “మన త్యాగమే మన జీవితాన్ని అర్థవంతం చేస్తుంది, అని తను శిక్షణలో నేర్చుకున్న విషయాన్ని షి చెపుతూనే ఉంటాడు. తల గట్టిగా ఊపాడు. జ్ఞాపకాల గురించి ఎక్కువ ఆలోచించటం ఆరోగ్యకరం కాదు. ఒక మంచి మనిషి ఎల్లప్పుడు వర్ధమానంలో జీవించాలి.

తనకు ఆప్తురాలైన మేడం ఒక బంగారం వర్ణం ఆకుతో సూర్యకాంతిని చూస్తూ తన పక్కన కూర్చుంది…..

 

——–oOo———-

అనువాదం: చంద్రశేఖర్ కర్నూలు. 9866608190

 

యున్ లీ: బీజింగ్ లో పెరిగి అమెరికాలో స్థిరపడ్డ రచయిత. కాలిఫోర్నియా డేవిస్ యూనివర్సిటీ లో అధ్యాపకురాలు గా పనిచేస్తున్న లీ కథా సాహిత్యంలో సుప్రసిద్దురాలు. ఈ కథ ఆమె రాసిన A THOUSAND YEARS OF GOOD PRAYERS కథకు అనువాదం. తక్కువ పాత్రలతో చిన్న కథలో ఎన్నో సంక్లిష్టమైన విషయాలు ఈ కథద్వారా చదువరుల ముందుకు తీసుకు వచ్చారు. ఈ కథ ఎన్నో అవార్డులనూ ప్రసంశలనూ అందుకుంది.

చంద్రశేఖర్

తన గురించి తానే రచయిత చంద్రశేఖర్: నేను కర్నూలులో ఉంటాను. నాన్న గారి వల్ల ఆంధ్ర సాహిత్యంపై మక్కువతో నేను చదివిన పద్య కావ్యం "విజయవిలాసం". అందరి లాగే నా చదువుల మధు మాసాన్ని "చందమామ" "బాలమిత్ర" "బొమ్మరిల్లు" లతో ప్రారంభించడానికి కారణం మా పెద్దమ్మ "కృష్ణవేణమ్మ". "రాబిన్సన్ క్రూసో" సంక్షిప్త నవలతో మొదలైన ఇంగ్లీషు పఠనం ‘ఫాదర్స్ అండ్ సన్స్’ నుండి ‘డిస్గ్రేస్’, ‘డ్రీమ్స్ ఇన్ ది టైమ్స్ ఆఫ్ వార్’ అలా కొనసాగుతూ..... నేనంటే ఒక కూర్చబడ్డ పలు సమాజ శకలాలు తప్ప మరేమీ కాదనే ఎరుకతో జీవిస్తున్నాను. ‘Illusion and Reality’ సాహిత్యాన్ని అర్థం చేసుకోడానికి నాకున్న దిక్సూచి.
 Mob: 9866608190

2 comments

Categories

Your Header Sidebar area is currently empty. Hurry up and add some widgets.