సాగర ఘోష

క్కడ కొన్ని బతుకు కెరటాలు వున్నట్టుండి విరిగి ఓటి నత్తగుల్లలౌతాయి!

కొన్ని సైకత చిత్రాలు నీట మునిగి చెదరిన రేణువులుగా మిగులుతాయి!

 

క్కడ కొన్ని దేహాలు ఉప్పులో నానబెట్టిన జల పుష్పాలౌతాయి!

కొన్ని రాత్రులు కడలి లోతుల్లో వెలుగు ముత్యాలకై చరించే నీటి గుర్రాలౌతాయి!

 

కొన్ని కలలు వలలు తెగి అలల అడుగున అనంత లోయల్లోకి కొట్టుకుపోతాయి!

కొన్ని ఆశలు తుపాను గాలికి చిక్కి ముక్కలైన చుక్కానులై అక్కడ పడి వుంటాయి!

 

పిరి తీగలు గేలం అంచుల్లోని బతుకు ఎర చుట్టూ ఆవిరి ఆకలి రాగాలు ఆలపిస్తాయి!

బతుకు నావలు దోవ తప్పి కనబడని బంధాలను వెతుక్కుంటూ అంతిమ యాత్ర చేస్తాయి!

 

వందల పసుపు కుంకుమల పూజలు, గంగమ్మకు అర్పించిన గాజులు జీవంలేని చేపపిల్లలై

బోసి నుదుళ్ల పై తేలుతాయి!

కొన్ని బంధాలను నట్టేట ముంచి గమ్యమెరుగని శూన్యం లోనికి పయనమవుతాయి!

 

క్కడ  అప్పుడపుడూ కొన్ని “గెలుపు నౌకలు” సాగర గర్భాన్ని శోధించి సాధించి

జీవ పిండాన్ని ఒడిలో నింపుకొని విజయతీరాలను చేరి సాగరుణ్ణి ఆరాధించి తరిస్తాయి!

 

ల్లప్పుడూ బతుకు పోరు తక్కెడలో చావూ రేవూ ఎక్కువో తక్కువో అయిపోయి తూగుతుంటాయి!

 

వేనవేల ఆటుపోట్లను అనుభవించిన “సముద్రం”తన రహస్యాల్ని గుండెల్లో దాచుకొని

గంగ పుత్రుల తలరాతలను నీటితోనే లిఖిస్తూ ఉంటుంది!

నలో కలుపుకొన్న ఆత్మల సాక్షిగా తీరాలకు తలబాదుకుంటూ సాగరం ఘోషిస్తూ ఉంటుంది!”

 

 

డి. నాగజ్యోతి శేఖర్..

 

 

 

 

 

 

డి.నాగజ్యోతి శేఖర్:  తూర్పుగోదావరి జిల్లా, మరమళ్లలో వుంటారు.టీచర్ గా పని చేస్తున్నారు.

విత్వం, కథలు, విద్యా సంబంధ వ్యాసాలు రాస్తుంటారు.

9492164193

డి. నాగజ్యోతి శేఖర్

డి.నాగజ్యోతి శేఖర్:  తూర్పుగోదావరి జిల్లా, మరమళ్లలో వుంటారు.టీచర్ గా పని చేస్తున్నారు.

కవిత్వం, కథలు, విద్యా సంబంధ వ్యాసాలు రాస్తుంటారు.

9492164193

6 comments

  • బాగుంది. సముద్రమ్మీద ఎవరు ఎంత రాసినా ఇంకా మిగిలే ఉందా అనేంత లోతైన అంశం. ప్రతీకలు, అభివ్యక్తి చాలా చక్కగా ఉన్నాయి. సరళత కూడ వన్నే తెచ్చింది. దేహాలు ఉప్పులో నానబెట్టిన జలపుష్పాలవడం…ఎంతో చక్కగా చెప్పారు. అభినందనలు

Categories

Your Header Sidebar area is currently empty. Hurry up and add some widgets.