కాలమ్స్ లో కాస్త మార్పు

‘రస్తా’ను పక్ష పత్రిక చేసుకున్నాక అంతకు ముందు నెలన్నరగా మొదలెట్టిన కాలమ్స్ లో… కొన్నిటిని 1వ తారీఖు సంచికలో, మరి కొన్నిటిని 15 తారీఖు సంచికలో అందిస్తున్నాం. జులై నెలతోనే ఆ పని మొదలెట్టాం. చాల వుపయోగకరంగా వున్న పాఠక సందేహాలకు డాక్టర్ విరించి గారి సమాధానాలు, మనస్సుకు చక్కిలిగిలి పెట్టి లోలో నవ్వించే ఎన్నెలమ్మ కబుర్లు, సినిమా పాటల్ని విని వూరుకోకండి వాటిలో గొప సాహిత్యం వుందని విశదం చేస్తున్న మద్దుకూరి చంద్ర హాసాలు, నన్నెచోడు, నన్నయాది పూర్వ కవులు పండించిన కవనాల్లో సౌందర్యాలు విడమరిచి చూపిస్తున్న లెనిన్ వేముల సాహిత్యావలోకనాలు, లాటినమెరికా జన యోదుల పోరు కేకల్ని హో కా హే అని మమత చేస్తున్న పరిచయాలను, లతా పుత్ర మనోజ్ శాస్త్రానికి ఆధ్యాత్మికతకు మధ్య రేఖ మీద చేస్తున్న అక్షర విన్యాసాలు, రాఘవేంద్ర ప్రసాదు అందిస్తున్న రాజకీయ ఇంటర్వ్యూలను (కుదిరితే వచ్చే నెల చెరుకు సుధాకర ఇంటర్వ్యూ), దాదాపు రెగ్యులర్ గా ఫైర్ బ్రాండ్ దఌత స్వరం రవికుమార్ అందిస్తున్న వ్యాసాలు … వీటి కోసం 15 వ తారీఖు సంచిక కోసం వేచి వుండాలని విన్నపం. ఆ తరువాత ఇక అదే క్రమం.

రస్తా

Add comment

ఇటీవలి వ్యాఖ్యలు

Categories

Your Header Sidebar area is currently empty. Hurry up and add some widgets.