వ్యక్తి స్వేచ్ఛా గీతం: వాల్ట్ విట్మన్ ‘సాంగ్ ఆఫ్ మై సెల్ఫ్’

విత్వమెప్పుడూ  ఒక ఆశ్చర్యకరమైన ఆసక్తికరమైన సృజన. మాట, వాక్యం ఎప్పుడు ఎలా కవిత్వమౌతుందో తెలియదు. కవిత్వ రీతులెపుడూ ఏదో ఒక తరాన్ని అనుసరిస్తూనో, విడివడుతూనో, ప్రభావితం చేస్తూనో వుంటాయి. ప్రకృతి, సమాజం, మనుషులు, తాత్వికత, దైవ భక్తీ, ఒకోసారి దేశం మీద ప్రేమ కూడా కవులను ప్రభావితం చేస్తూ కొత్త పద్ధతుల్ని సృష్టించేందుకు అంతర్గతంగా పనిచేస్తుంటాయి.  అలా తనతోటి వారిని కలుపుకు పొమ్మని వ్యక్తిగత ఏకాంతాన్ని, స్వేచ్ఛను ఆనందించమని చెప్పిన మన కాలపు కవులలో అమెరికా దేశానికి చెందిన వాల్ట్ విట్మన్ ఒకరు.

1820 నుండి 30 మధ్య అధిగమనవాదం (transcendentalism) అమెరికా కవులను బాగా ప్రభావితం చేసింది. ప్రజలలో  వారి స్వభావంలోని మంచితనం పట్ల వారికి గల నమ్మకాన్ని వాదం గౌరవించింది. మనిషిలోని మంచితనాన్ని సమాజంలోని వ్యవస్థలు, సంస్థలు  కలుషితం చేశా నే ధోరణిని అధిగమనవాదులు నమ్మారు. గతాన్ని మరిచి మనుషులు వారిలోని అకలుషిత అంతర్ దృష్టిని ఆశ్రయించడం సాధ్యమేనని, ఇది సమాజాన్ని సమష్టిగా బాగుచేస్తుందని వీరి దృక్పధం. ఇంగ్లీష్ రొమాంటిక్ కవులు ప్రేమించినవ్యక్తీ స్వేచ్చ’ను వీరు బాగా నమ్మారు. వీరిలో ప్రముఖుడైన రాల్ఫ్ వాల్డో ఎమర్సన్, తన బానిసత్వ రద్దు వుద్యమం (Abolitionist Movement) మరియు అధిగమనవాదాలతో వాల్ట్ విట్మన్ ను ఎంతో ప్రభావితం చేశాడు.

అయితే 1830, 40 లో వచ్చిన బానిసత్వ రద్దు ఉద్యమం పట్ల  విట్మన్ విముఖత  చూపించాడు. దీనికి కారణం  ఉద్యమం  ప్యూరిటన్ భావజాలం మీద ఆధారపడి ఉండడమని కొందరు విమర్శకుల అభిప్రాయం. ఆఫ్రికన్ అమెరికన్ల పట్ల విట్మన్ అభిప్రాయాలు పరస్పర విరుద్ధంగా కూడా అనిపిస్తాయిబ్రూక్లిన్ లోను  బోస్టన్ లోను ఆయన చూసిన ఆఫ్రికన్ అమెరికన్లు, బానిసత్వ రద్దు వుద్యమ నేత జాన్ బ్రౌన్ మరణం తర్వాత వుద్యమ ఉద్దేశ్యాలలో వచ్చిన మార్పులు … ఆయనను  బానిసత్వ వ్యతిరేక ఉద్యమ వ్యతిరేకిగా, మద్దతుదారుగా  పరస్పర విరుద్ధ భావాలు కల వ్యక్తిగా నిలబెట్టాయి.   

తన ‘గడ్డి పోచలు’ (లీవ్స్ ఆఫ్ గ్రాస్) కవితా సంపుటిలో ఆయన కవిత్వం అమెరికాలోని సమస్త జాతుల ఐక్యతను ఆకాంక్షిస్తుందిమరింత ప్రత్యేకంగా,సాంగ్ ఆఫ్ మై సెల్ఫ్కవిత  విట్మన్ ను పరిపూర్ణ వ్యక్తిగా , విప్లవవాదిగా నిలబెట్టింది. వాల్ట్ విట్మన్ తనదైన రీతిలో అమెరికన్వ్యక్తి స్వేచ్ఛా వాదా’నికి, దాని అభివృద్ధికి దోహద పడ్డాడు.

1819 మే 31 న్యూయార్క్ లోని వెస్ట్ హిల్స్ లో జన్మించి, మంచి జర్నలిస్ట్ గా పేరొందిన వాల్ట్ విట్మన్… కవి, వ్యాసరచయిత. అమెరికన్ కవులలో ఛందోబద్ధం కాని స్వేచ్ఛా కవితకు  పితామహుడుఆయన రచించిన ‘గడ్డి పోచలు’ (లీవ్స్ ఆఫ్ గ్రాస్) మొదట కొంత  వివాదాస్పదమైనా తరువాత  కవుల, విమర్శకుల దృష్టిని ఆకర్షించి గొప్ప కావ్యంగా గణుతికెక్కింది. ఈ పుస్తకాన్ని ఆయన 1892లో  మరణించే వరకు పునరావలోకనం చేస్తూనే ఉన్నాడు.  

వాల్ట్ విట్మన్ ఛందోబద్ధ కవితా రూపాన్ని వదిలేసి, వచన కవిత్వానికి తెర తీశాడు.  విభిన్నమైన పదచిత్రాలను,  ప్రతీకలను వాల్ట్ విట్మన్ వాడాడు.  సాధారణమైన గడ్డి పోచలకు   కవిత్వంలో అమేయమైన స్థానం ఇచ్చాడు.  సెక్సువాలిటీ , మృత్యువు… జీవితంలోని అనేక పార్శ్వాలను అందంగా స్పృశించాడు.

వాల్ట్ విట్మన్ ఎంచుకున్న స్వేచ్ఛా కవిత (free verse) ఆయన వ్యక్తి స్వేచ్ఛకు మొదటి సూచిక. ఎమర్సన్ ఆశించిన కొత్త ఆవిష్కరణకు ఈ రూపం బాగా సరిపోయిందిఇంగ్లీష్ రొమాంటిక్ కవుల పద్ధతిలో  విప్లవాత్మకంగా ఉత్తమపురుషలోనేనునే తన కవిత్వ స్వరం చేసుకున్నాడు విట్మన్. అప్పటివరకు మూస పద్ధతులను అనుసరిస్తున్న కవులకు అది ఒక మేలుకొలుపైంది. ‘గడ్డి పోచలు’ ను కవిత్వ రూపానికీచెందనిసంపుటిగాకవిత్వానికి జరిగిన అవమానంగాఅశ్లీలంఅజ్ఞానంగాచాలామంది విమర్శకులు భావించారువాల్ట్ విట్మన్ ‘కవితను స్టాంజాలుగా విభజించి  ప్రాసలతో ముగిసే వాక్యాలతో  అలరించిన  సంప్రదాయ కవిత్వ పద్ధతులకుస్వస్తి పలికాడు.

వాల్ట్ విట్మన్ కవిత దీర్ఘ వాక్యాలతో పునరుక్తి అయ్యే మాటలు, శబ్దాలతో  ఒక గూడు అల్లుకుంటూ సాగిపోతుందివాల్ట్ విట్మన్ పై  తూర్పు దేశాల సాహిత్యపు ప్రభావం కూడా ఉందిమేయర్ వంటి కొందరు విమర్శకులు  ‘వాల్ట్ విట్మన్ కవిత్వంలో మహాగ్రంథ లక్షణాలు లేకున్నా, ఒక జీవం కల మనిషి లక్షణాలు ఉన్నాయి’  అని వ్యాఖ్యానించారు సంపుటిలో  400కు పైగా కవితలు ఉన్నాయి.  ‘సాంగ్ అఫ్ మై సెల్ఫ్’  ‘క్రాసింగ్ బ్రూక్లిన్ ఫెర్రీ’  ‘వెన్  లైలక్స్ లాస్ట్ ఇన్ డోర్ యార్డ్ బ్లూమ్డ్ ’  ‘ కెప్టెన్ మై కేప్టెన్’  వంటి  ప్రముఖ కవితలున్నాయి.

52 భాగాలు గల  ‘సాంగ్ అఫ్ మై సెల్ఫ్అనే దీర్ఘ కవితను ‘అన్ని ప్రదేశాల, అందరు జనుల ఆలోచనలే నా గీతంఅంటూ విశ్వజనీన వాక్యంతో ప్రారంభిస్తాడు.   ఇది ఒక మానవ ఇతిహాస గాథ లాంటి కవితతన ముందుమాటలోనే  ఒక విప్లవాత్మకమైన  అమెరికా  సామాజిక రాజకీయ దశ గురించి చెబుతూ  అమెరికా దేశానికి  ఒక కొత్త కవిత్వపు అవసరం గురించియూరోపియన్ కవిత్వపు భావజాలం నుంచి విడిపడాల్సిన అవసరం గురించి చెప్తాడుమనది కాని విధానాన్ని  ఎదిరించాల్సిన అవసరం ఉందని, అయితే అది కోపంతో కాదనితమ ఆత్మ విశ్వాసంతోనేనని, ‘తప్పుగా అనిపించేది ఏదైనా సరే  లెక్కపెట్టవద్దనిచెప్తాడు. అమెరికా ప్రజలందరూ  ‘వ్యక్తిగత ఆత్మగౌరవాన్ని ప్రేమించడం ద్వారా  సంఘటితమై అమెరికా దేశపు గౌరవాన్ని ఇనుమడింప చేయాలని వారి సంస్కృతికి ఉన్న ప్రత్యేకతను నిలబెట్టుకోవాల్సిన అవసరం ఉందని చెప్పాడుమానవులు తమకు ప్రకృతికి ఉన్న అవినాభావ సంబంధాన్ని గుర్తించాలంటూ జీవితం పట్ల ఉన్న తాత్విక దృష్టి గురించి వివరిస్తాడు. ‘ భూమీ, సముద్రమూ, పశుపక్ష్యాదులూ, పైని స్వర్గపు ఆకాశము, గ్రహాలూ, అడవులూ, కొండలూ నదులూ, ఇవేవీ చిన్న సంగతులు కావంటాడు

ప్రకృతి, మనిషి  ఎలా అల్లుకుపోతారో చెప్తూఆకులు నీ నుండి రాలి పడినంతగా చెట్లనుండి రాలి పడవనీ, చెట్లు భూమి నుండి రాలి పడవని’ (8) అంటాడు.

ఇంకా

జంతువులెంత అందంగా పరిపూర్ణంగా వున్నాయి! నా ఆత్మ ఎంత సమగ్రంగా వుంది!

భూమి ఎంత పరిపూర్ణమై వుంది. దానిపైనున్న అతి సూక్ష్మ విషయమూనూ!’

మనసు/ఆత్మను విముక్తి  చేయగల వ్యక్తివాదం  కేవలం  మనం నివసించే  చుట్టూ ఉన్న సమాజం తోటే కాక, భూమితో మనను చుట్టుముట్టి ఉండే ప్రకృతితో లోతైన, దగ్గరి సంబంధం కలిగి ఉండాలి అంటాడుగడ్డి పోచ కదా అని కొట్టిపారేయకు,నక్షత్ర సమూహాల ప్రయాణ కార్యాల కన్నా గడ్డి పోచ ఏమీ తక్కు కాదుఅని చెప్తాడు.

సాంగ్ అఫ్ మై సెల్ఫ్’  లోని ఆరవ భాగం లో  ఒక పిల్లవాడు  ‘ గడ్డి ఏమిటి?’  అని అడుగుతాడు.  మొదట సమాధానం చెప్పాలో తెలియక  తికమక పడిన కవి ఆలోచించి  ‘ గడ్డి ఒక  పిల్లవాడనిభగవంతుడి చేతిరుమాలుఅని అంటాడుఇది  ‘జీవన్మరణ చక్రం లో ఉండే  బతుకు కొనసాగింపని కూడా అంటాడు. ఇలాంటి వినూత్నమైన  తాత్విక ఆలోచనలే,   వ్యక్తీకరణలే వాల్ట్ విట్మన్ ను మహాకవిగా నిలబెట్టాయిఎవరూ పట్టించుకోని గడ్డిపరకలను  సామాన్య ప్రజలకు ప్రతీకలుగా నిలబెట్టి

నన్ను నేను ఈమట్టికి, దాని నుండి పెరిగే నేను ప్రేమించే గడ్డిలా పెరిగేందుకు వారసుడిని చేసుకుంటున్నాను.

నన్ను మళ్ళీ చూడాలనిపిస్తే నీ పాదరక్షల కిందే వెతుకుఅనిచెప్తాడు.

తనను తాను, తాను ప్రేమించే మట్టికి, గడ్డిపరకలకు  వారసుడిని చేసుకుని  అగ్ర వర్గాల ప్రజలకు  ‘సమాజంలోని మార్పుకు సాధారణ ప్రజలే ముఖ్యమని  ‘అగ్రవర్గాల దృక్పథం మార్చుకోవాలని సూచిస్తాడు.

మనిషిప్రకృతి మధ్య సంబంధం గురించి వివరిస్తూమానవుల మానసిక శ్రేయస్సు  ప్రకృతితో ముడిపడి ఉందనిప్రతి మనిషి  జీవితాన్ని పూర్తిగా ఆనందించాల్సిన అవసరం ఉందని చెప్తాడువాల్ట్ విట్మన్ ప్రతి కవితలోనూ ప్రకృతి, మానవుడు సృష్టించిన కృత్రిమ ప్రకృతి, ఏదో ఒక రూపంలోకొండలు, కోనలువాగులు, తటాకాలురెల్లుగడ్డి, ఆకాశం, నక్షత్రాలు, చెట్లుఆకులు, పూలు, గడ్డిపరకలు, రాళ్ళు, భవనాలు, రహదారులు, ఇళ్ళలో వుండే అనేక వస్తువులతో సహాఇలా అన్నీ  నవ్వుతూ పలకరిస్తాయి. ఒక తాత్త్విక స్థితిని కల్పిస్తాయి

‘The smoke of my own breath,
Echoes, ripples, buzz’d whispers, love-root, silk-thread, crotch and vine,
My respiration and inspiration, the beating of my heart, the passing of blood and air through my lungs,
The sniff of green leaves and dry leaves, and of the shore and dark-color’d sea-rocks, and of hay in the barn,</span
The sound of the belch’d words of my voice loos’d to the eddies of the wind,
A few light kisses, a few embraces, a reaching around of arms,
The play of shine and shade on the trees as the supple boughs wag,
The delight alone or in the rush of the streets, or along the fields and hill-sides,
The feeling of health, the full-noon trill, the song of me rising from bed and meeting the sun.’

మునుపెన్నడూ లేని విధంగా అమెరికన్ సాహిత్యంలో ఉత్తమ పురుష స్వరంలో అనేక రూపాలను అంటే – ఒక మానవతా స్వరాన్ని, ఆత్మను, ప్రకృతిని, భగవంతుడి స్వరాన్నిఅమెరికా దేశపు స్వరాన్ని,  ఒకేసారి ఇలా కలిపి చెప్తాడు.

‘ I celebrate myself’
(…)
‘ in all people I see myself , more more and not one barley corn less
and in good or bad I see myself I see them’ (40)

It is you talking as much as myself

I act as the tongue of you,
It was tied in your mouth

In mine it begins to be loosened’ (74)

I am large … I contain multitudes’ (74)

చూడండి ఎంత సాధారణమైన పోలికలతో అద్భుత కవిత్వాన్నిస్తాడో! ఏదో వూహా ప్రపంచంలోని పోలికలకై పరుగులెత్తడు. ‘నీ నోటిలో బందీ యైన నాలుక ఎలా ప్రవర్తిస్తుందో నేనూ అలానేఅంటాడు. అందరు కవులకూ అందే వూహ కాదు గదా ఇది.

ఇంత గొప్పగా వ్యక్తివాదాన్ని దేశాన్ని ప్రేమించిన కవి మనకు ఇంకొకరు కనిపించరు.   నూతనత్వాన్ని కోరుకున్నా వాల్ట్ విట్మన్ ఎప్పుడు కవితా రూపాన్ని విస్మరించలేదుకింగ్ జేమ్స్ రాసిన బైబిల్ ప్రభావంతో  దీర్ఘకవితా వాక్యాలను నిర్మించిన  వాల్ట్ విట్మన్  వాటిని తగిన చోట ఆపి  ఆశ్చర్యకరమైన అర్ధాలని సృష్టించాడు.

“Come my children
Come my boys and girls, and my women and intimates
Now the performer launches his move
… He has passed his prelude on the reeds within (66)

అలాగే తన కవిత్వంలో  శబ్దాలంకారాలని, అనఫోరా అనే సర్వనామ ప్రయోగాలనివిరోధాభాసాలని చాల విరివిగానే వాడాడు.

“Do I contradict myself?
Very well then… I contradict myself;
I am large… I contain multitudes “(77)

సమస్యల నుండి దూరం చేసుకోమనితమలోని శక్తుల్ని గుర్తించమనిఆత్మన్యూనతకు గురికావద్దనీ చెప్తాడుమనమేమిటో తెలిపేది మనను చుట్టిన అననుకూల పరిస్థితులు కావనిమనలో ప్రతి వ్యక్తిలో  పరిస్థితులకు లొంగనీయని శక్తి  మనలను నిర్వచిస్తుందని చెబుతాడు.

“The sickness of my folks – or of myself…or ill doing…
or loss or lack of money… or depression or exaltation,
they come to me days and nights and go from me again
they are not the Me myself (25)

తనను తాను ఉద్ధరించుకోలేని వాడి  పట్ల సానుభూతిని చూపిస్తాడు. సహాయపడే ప్రయత్నమూ చేస్తాడు.

వాల్ట్ విట్మన్ కవిత్వంలో ప్రతి మాట ఎంతో విలువైనదిగా కవితకు ఊపిరిలూదేదిగా ఉంటుందిధారాళమైన ఆలోచనకు దీటుగా మాటలు ఎక్కడా ఆగకుండా ప్రవహిస్తాయి.  మాటలనెన్నుకోవడంలో ఎక్కడా కష్టపడడు. అలవోకగా అందిపుచ్చుకుంటాడు. ఇంద్రియానుభూతులను ఎంత పలవరిస్తాడో  ప్రకృతితో మమేకమైన  ఆత్మానందాన్ని కూడా అంతే ఆరాధిస్తాడు. అందరూ అనుకునేలా కాక మృత్యువును గురించి తనదైన రీతిలో వ్యాఖ్యానిస్తాడు.

అతిచిన్న చివురూ
మృత్యువే లేదంటోంది
అంతా ముందుకో బయటకో నడిచేదే
అందరూ అనుకునేది కాదు చావడమంటే’…
(“Even the smallest sprout shows / there is really no death” … / “All goes onward and outward…/And to die is different from what anyone supposed”)

ఆశావాదం, ధైర్యాన్ని నూరిపోసే లక్షణం, చెడునూ లెక్క చేయని ఆత్మ విశ్వాసం, మనిషిగా ప్రకృతితో మమేకమై సంపూర్ణంగా జీవించాల్సిన అవసరాన్ని తెలిపే గుణం, స్వేచ్ఛ పట్ల, జీవితం పట్ల అచంచలమైన ప్రేమ విట్మన్ కవిత్వంలో అణువణువునా గోచరిస్తాయి. అందుకే కవి తరువాతి తరాలను ప్రభావితం చేస్తూ మహాకవిగా నిలిచిపోయాడు. అతని  పాట స్వేచ్ఛా గీతమై ఉత్తేజపరుస్తూనే వుంది.

డాక్టర్ విజయ్ కోగంటి

విజయ్ కోగంటి పేరుతో 1993 నుండి కవితా వ్యాసంగం. అనేక దిన, వార, మాస, పత్రికలు, ఆన్ లైన్ పత్రికలలో ప్రచురణలు. 2012 లో ‘కూలుతున్న ఇల్లు’ కవితకు నవ్య-నాటా బహుమతి. తెలుగు, ఇంగ్లీషుల్లో కవిత, కథారచనతో పాటు అనువాదాలు, సమీక్షలు, సాహిత్య బోధన ప్రధాన వ్యాసంగాలు. ’ఇలా రువ్వుదామా రంగులు’ (2017) మొదటి కవితా సంపుటి. స్వయం ప్రతిపత్తి గల ప్రభుత్వ మహిళా కళాశాలలో ఆంగ్ల శాఖాధ్యక్షుడు
drvijaykoganti@gmail.com

M: 8801823244

9 comments

  • Oka goppa kavi ni meeru parichayayam chesina teeru mahaa adbhutam. Mee vachana shailee koodaa hayi ni golipe vidham gas vundi. Congrats Vijay garu.

  • సినారే గారి విశ్వంభర లో ఇటువంటి భావజాలం కనిపిస్తుంది. విట్మన్ “నేను” ను అమెరికన్’స్ తో ఐడెంటిఫై చేసుకొంటే, సినారే ‘నేను’ ను ఇంకొంచెం ముందుకు పోయి ప్రపంచ మానవునితో ఐడెంటిఫై చేసుకొంటాడు. గుడ్ ఆర్టికల్ సర్. థాంక్యూ ఫర్ థిస్ ఆర్టికల్.

Categories

Your Header Sidebar area is currently empty. Hurry up and add some widgets.