దేవరకొండ సుబ్రహ్మణ్యం, ఉప్పల సుధాకర్

1.

అయ్యా,

ఇప్పుడు తెలుగు సాహిత్యంలో ఒకర్నొకరు పొగుడుకోవడమెక్కువయిందని తరచూ వినే మాట. అలాగే వారు రాసినది ఎవరయిన విమర్శిస్తే కూడా కోపం వచ్చే పరిస్తితి .

నాకు మధ్య చాగంటి తులసి గారు అభిమానంగా చాసో గారి ఉత్తరాల సంకలనంనీ ఉత్తరం అందింది… ” అనే పుస్తకం పంపించారు. అది చదువుతున్నప్పుడు, రాంషా గారు చాసో గారికి 1951 లో రాసిన కింది ఉత్తరం కనిపించింది. అప్పటి పరిస్థితికి ఇప్పటికీ ఉన్న తేడాని బాగా చూపించింది.

రాంషా గారంటారు :

“Dear friend,

మీ ఉత్తరం, తిట్టడమూ (…..) ముఖ్యవృత్తి కనుక నన్ను మీ ఉత్తరం గాయపరచలేదు. అందులో బాధపడే విశేషమేమీ లేదు. ” గాంధీజీ…..” కధ మీద మీ విమర్శతో ఏకీభవిస్తున్నాను. నన్ను పొగడేవాళ్లను చూస్తే నాకసహ్యమే. నేను ఎవళ్ళనీ పొగడను; హర్షిస్తాను కానీ . ఎందుకంటే, పొగడడం పొగడ్తను ఆశించడమే.

కధల్లో మీరు చూపించిన లోపాలన్నీ నేను ఎరిగున్నవే, మరికొన్ని పెద్ద లోపాలు మీరు చూపించవలసిందని కోరుతున్నాను.

విశేషాలు వ్రాయండి 

రాంషా”

ఇప్పటి తెలుగు సాహిత్యకారులే కాక సాహిత్యాభిమానులు కూడా ఉత్తరాల సంకలనం తప్పక చదవాలి. అందులో అందరు సాహిత్యకారులు, అప్పటిఎప్పటి ప్రముఖులు, ఎంత ఆప్యాయంగా, నిర్మాహమోటంగా రాసుకునేవారో , చదువుతుంటే ఆశ్చర్య మేస్తుంది.

ప్రస్తుతానికింతే సంగతులు , చిత్తగించవలెను, భవదీయుడు

  • దేవరకొండ సుబ్రహ్మణ్యం, గురుగ్రామ్ – హరియాణ

‘మా తిరుపతి కొండ కధలు’ పుస్తకం గురించి.

ఇవి ఆస్తికత్వం గురించి గాని, భక్తి గురించి గాని కాదు…..

ఆ కొండ మీద ఉండే వాళ్ళ ను ఖాళీ చేయించే టప్పుడు వాళ్ళు ఎక్కడికి వెళ్లి ఉంటారు, ఏమై ఉంటారు, వాళ్ళ జీవనోపాధి, ఇళ్ళు, మనుగడ, వాళ్ళ జీవితం తో ముడివేసుకున్న జ్ఞాపకాలు ఏమై ఉంటాయి. ఇలా చాలా ప్రశ్నలు, అనుమానాలు వచ్చాయి నాకు, వీటిని కూడా రాసే వాళ్ళు ఉంటారు అని, కథలుగా చెబుతారు అని ఎప్పుడూ అనుకోలేదు. ఇదిగో ఇన్ని రోజులకు exact గా అదే జరిగింది. తిరుమల కొండతో తనకు ముడివేసి ఉన్న బాల్య అనుభవాలు అనుభూతులు ఈ కధలు.

కధలు అంటే ఫిక్షన్. ఎందుకో నాకు చాలా కాలం ఫిక్షన్ ఇష్టం ఉండేది కాదు. కానీ కధలు సరిగా రాయ గలిగితే కధలు బావుంటాయి. కధల్లో జీవితం ఉంటుంది. జీవం ఉంటుంది. అందుకే అవి కదిలిస్తాయి. వెంటాడతాయి. అదిగో అలాంటి జీవం ఉన్న కధలు ఇవి.

వీటిలో కొన్ని పతికల్లో లో వచ్చేటప్పుడు చదివా. కానీ విడవకుండా చదవాలి అనే కోరిక ఇప్పటికి తీరింది.. ఒక్క రోజులో కొరియర్ ద్వారా వచ్చింది. కరుణాకర్ గారికి కృతజ్ఞతలు. ఈ కధల పరిచయం నేను రాయబోవటం లేదు. ఎందుకంటే కె వి రమణాచారి గారు ముందు మాటలో ఆ పని చేశారు. మచ్చుకి ఒక కథ…. తల్లితండ్రులకు విడాకులు మంజూరు అయ్యే స్టేజిలో వాళ్ళు తిరిగి కలుసుకోవడం, దానికి జరిగిన నేపథ్యం రచయిత బాగా రాసారు. చిన్న చిన్న పదాలే ,చిన్న పేరాలే, కానీ మనసు తడవడం, ఆ మనసును కదిలించటం ఖాయం. ఆఖరి వాక్యం తో తప్పకుండా ఓ హేన్రి గుర్తుకు వస్తాడు. బాపు రమణ లలోని రమణ గారి బాల్య కధలు ( ఇడ్లి నాకు చట్నీ మా అమ్మకు) ., నామిని మిట్టూరోడి కధలు, ఖదీర్ బాబు దర్గా మిట్ట కధల వరవడి లొనే  ఇవి కూడా జీవం ఉన్న కధలు జీవితపు కధలు . ఈ ట్రెండ్ ఇంకా పాపులర్ అవుతుంది అనుకుంటా….

  • సుధాకర్ ఉప్పల  28/07/2018. 

రస్తా

1 comment

  • ధన్యవాదాలు హెచ్ ఆర్ కె గారు, నా లేఖ ప్రచురితమైంది.

Categories

Your Header Sidebar area is currently empty. Hurry up and add some widgets.