కవనాశ్రువులు

నా అక్షరాలు
దైవాంశ సంభూత భూతాలు ,
నా పదాలు
దింపుడు కళ్ళపు పిలుపులు,
నా వాక్యాలు
సజీవ శిలాజ సామ్రాజ్యాలు,
నా పంక్తులు
మృతామృత పిండాలు,
నా శబ్దాలంకారాలు
ఉత్కృష్ఠ శవాలంకారాలు,
నా స్వరాలు
సైకీ సహస్రాల సరాగాలు,
నా రాతలు
రోషాక్ సిరా మరకలు,
నా పలుకులు
లోగోసుల లోగొలుసులు,
నా వర్ణాలు
డేజా వూ ల వూజా బల్లలు,
వికల్పార్థకాలు, అర్థ వైకల్పికాలు…
స్వీయ శాసనాలు, నియమ విరోధాలు…
తల్లక్షణ తలపుల, అసంఖేయ ఆశల
ప్రేత గృహాలయాలు నా కవనాలు.
వూజా బోర్డు

లతా పుత్ర మనోజ్

లతా పుత్ర మనోజ్:  మనోజ్ బొగ్గుల. తల్లి లతమ్మ, తండ్రి కీ.శే భాస్కరన్న గార్ల ప్రథమ సంతానం.జనణం 1995 ఏప్రిల్ 6. సొంత ఊరు గద్వాల జిల్లా ఐజ..పెరిగింది వనపర్తి జిల్లా పెబ్బేరు..ఇప్పుడు ఉంటోంది కర్నూలు. కృతుంగ ప్రాంత బిడ్డ. వృత్తి  రిత్యా ఉపాధ్యాయుడు.అగ్గిపెట్టె నుండీ అంతరిక్షం దాకా అన్నీ  ఆసక్తే

2 comments

Categories

Your Header Sidebar area is currently empty. Hurry up and add some widgets.