పాఠం చెప్పలేనని నేనెలా అనగలను?

నెల రోజులుగా నీరసంగా ఉన్న నీలి కళ్ళ అబ్బాయిలో

నిన్ననే ఉత్సాహం తొంగి చూసింది

పోయిన వారమే నల్ల అమ్మాయిలో

కొత్త వెలుగులు నాట్యం చేసాయి

నిత్యం చిర చిర లాడే చిన్నోడు

ఇప్పుడే నవ్వాడు

అమ్మ నాన్న లేని అమ్మడి విచార వదనంలో

వెలుగు రేఖలు

పెదాలను నేడే ముద్దాడాయి

ఎప్పుడూ ఆఖరున ఉండే ఆకతాయి

రేపు ముందుకొస్తాడేమో!

ఒంటరి తుంటరి

భావి సమూహం కాబోతున్నదేమో!

ప్రతి విద్యార్థి ఒక సవాలే !

ప్రతి సవాలు బాధించే భారమే !

అది తాత్కాలికం.

భారం అంతా

నేను నేర్చుకునే సందర్భమే!

ప్రతి సందర్భం

ప్రేమను పంచే అవకాశమే!

ప్రతి అవకాశం

ప్రేమను పొందే ఆధారమే!

ఆధారాన్ని పాఠం నాకిచ్చినపుడు

పాఠం చెప్పలేనని నేనెలా అనగలను?

అదే నా జీవితం కావాలని కోరుకోవడం తప్ప!

పనిలోనే జీవించాలనే తాపత్రయం తప్ప!

 

Anne Morrow Lindburg

Anne Morrow Lindburg, ‘Why do I Teach ‘ కి స్వేచ్ఛానువాదం 

సెప్టెంబరు 5; ఉపాధ్యాయ దినోత్సవ శుభాకాంక్షలు

 

ఎడమ శ్రీనివాసరెడ్డి

ఎడమ శ్రీనివాస రెడ్డి కాకతీయ ప్రభుత్వ కళాశాలలో రసాయన శాస్త్ర అధ్యాపకులు, గతంలో టీచర్ ఎడ్యుకేటర్ గా కూడా పనిచేశారు. ‘స్వాతి’ వార పత్రిక  కథల పోటీలో (1985) బహుమతితో రచనా వ్యాసంగం ప్రారంభం. పది లోపు కథలు, డజన్ కవితలు, రసాయన శాస్త్రం, విద్యారంగ విషయాలపై వందకు పైగా వ్యాసాలను ప్రచురించారు.  రెండు పుస్తకాలు ప్రచురించారు. విద్యా రంగ సమస్యలపై పని చేస్తున్న ‘సొసైటీ ఫర్ చేంజ్ ఇన్ ఎడ్యుకేషన్’ స్టీరింగ్ కమిటీ సభ్యులు. షాడో ఎడ్యుకేషన్, విద్యా ప్రైవేటీకరణ, టీచర్ ఎడ్యుకేషన్, కంపారిటివ్ ఎడ్యుకేషన్ ఆయనకు ఆసక్తి వున్న విషయాలు.

2 comments


Type Comments in Indian languages (Press Ctrl+g to toggle between English and Telugu OR just Click on the letter)

Categories

Your Header Sidebar area is currently empty. Hurry up and add some widgets.