నీ మాటే భగవద్గీత

యద్యదాచరతి శ్రేష్ఠ: తత్తదే వేతరో జన:

సయత్ప్రమాణం కురుతే లోకస్తదనువర్తతే!

గీతాచార్యుడు చెప్పినఅక్షర సత్యం అంతరార్ధం ఏమిటో చూద్దాం. శ్రేష్ఠులైనవారు అంటే సమాజంలో ఉన్నత స్థానంలో ఉన్నవారు, నాయకత్వం వహించేవారు చేసే పనులను ప్రమాణంగా తీసుకుని లోకమంతా అదే ఆచరిస్తుంది. అనుసరిస్తుంది. అనుకరిస్తుంది.శ్లోకం అడ్వర్-టైజింగ్ రంగానికి అతికినట్టు సరిపోతుంది. 2000 లో అనుకుంటాను. మహారాష్ట్రలోని ఒక చిన్న పట్నంలో కాడ్బరీస్ చాక్లెట్లన్నీ ఫ్రిజ్ లోనే పురుగులుపట్టి పాడయిపోయాయి. ఒక వినియోగదారుడుసంఘటనను వెలుగులోకి తెచ్చి ప్రచారం కల్పించడంతో జనం క్యాడ్బరీ చాక్లెట్ కొనడం మానేశారు. దానితో అమ్మకాలు దారుణంగా పడిపోయాయి. బ్రిటిష్ వారి కాలం నుంచి భారత దేశంలో తెలిసిన, భారతీయులు రుచి చూసిన చారిత్రాత్మక చాక్లెట్ అది మరి! మార్కెటింగ్ మేధావులంతా, అడ్వర్టైజింగ్ పితామహులతో కలసి దాని అమ్మకాలు పెంచడానికి బుర్రలు బద్దలుకొట్టుకున్నారు. చివరికి అమితాబ్ బచ్చన్ని పట్టుకునిప్రకటన సృష్టించారు. పప్పూ పాస్ హోగయాఅంటూ అన్ని ప్రచార మాధ్యమాల్లోనూ, టీవీతో సహా ఊదరగొట్టారు. మొత్తానికి మళ్ళీ మార్కెట్లో చాక్లెట్ లేచి నిలబడింది. అదే ఇంటింటి మిఠాయని ప్రచారం చేశారు. అమితాబే ఎందుకు? సమాజంలో శ్రేష్ఠుడు కనుక; ఆయన చెబితే అందరూ వింటారు కనుక! ముఖ్యంగా మధ్య తరగతికిమార్కెటింగ్మత్తు త్వరగా ఎక్కుతుంది కనుక!

రంగంలోనైనా నాయకుడన్నవాడు ముందుండి నడిపించాలి. సంయమనం, సమన్వయం, సహకారం మౌలిక లక్షణాలుగా తన బృందాన్ని నడిపించాలి. ఇది రాజకీయ రంగం, కార్పొరేట్ రంగం అన్నిటికీ వర్తిస్తుంది. నాయకుడి నడతను బట్టే జనత నడక ఉంటుంది. నాయకుడు ఒక లక్ష్యం లేకుండా దూసుకెళుతుంటే ఎక్కడో ఒక చోట మూసుకు పోయే అవరోధం తప్పదు. చలనచిత్ర రంగంలో సమున్నత స్థానాన్ని సాధించి, ఇంటింటి పేరైన అమితాబ్ బచ్చన్ చెప్పింది నలుగురూ వింటారన్నది ఒక మార్కెటింగ్ ఆలోచన. ప్రజల్లోకి ఒక ఉత్పత్తిని తీసుకెళ్ళడానికి, నిలబెట్టడానికి చేసిన సఫల యత్నం. ఇప్పుడు ప్రజల్ని కూడా ఒక ఓటుగా, ఒక ఉత్పత్తిగా, వినియోగ వస్తువుగా చూడటం మార్కెటింగ్ వ్యవస్థలో గమనిస్తూనే ఉన్నాం. మనిషిని ఒక వ్యక్తిత్వ వికాస స్ఫూర్తిగా వేరు చేసి చూపేది కమ్యూనికేషన్. కమ్యూనికేషన్ వ్యక్తిత్వ వికాసంలో  కీలకపాత్ర వహిస్తుంది. మాట మనిషిని పట్టిస్తుంది. మాట మనిషికి ఉత్తేజాన్నిస్తుంది. మాట మనిషికి నీరసాన్నిస్తుంది. వికసించిన వ్యక్తిత్వానికి మాట్లాడే తీరుతెన్నులే ఉదాహరణగా నిలుస్తాయి. అందుకే ఒక ఉత్పత్తిని నిలబెట్టాలన్నా, ఒక మనిషిని నిలబెట్టాలన్నా, ఒక కుటుంబాన్ని, ఒక సమాజాన్ని, ఒక రాష్ట్రాన్ని, ఒక దేశాన్ని నిలబెట్టాలన్నా వ్యూహాత్మకంగా మాటలతో మనుషుల్ని మార్చింగ్ చేయించగలిగిన నాయకత్వం ఎంతో అవసరం. అది లేని నాడు ఎంతటి నాయకులైనా ఒకళ్ళ మీద ఒకళ్ళు బురద జల్లుకోవడమే నాయకత్వంగా చలామణి అవుతుంది. అందుకే ‘If you use communication as a skill; it will thrill; otherwise it will kill’ అంటారు. కమ్యూనికేషన్ స్కిల్స్ అందరికీ ఉంటాయి. కానీ అది నువ్వు స్కిల్ లా వాడుతున్నావా, నీ మాటలతో అందరినీ కిల్ చేస్తున్నావా అన్న విషయంలోనే ఎంతో తేడా ఉంటుంది. నాయకుడైనవాడు నాలుకను నియంత్రణలో ఉంచుకోవాలి. సూక్ష్మంగా చెప్పాలంటేనోరు మంచిదైతే ఊరు మంచిదవుతుంది‘. సామెత మన జాతి జీవనాడి. నిత్య జీవితంలో ఒక మంచి మాట అవసరాన్ని, మాటను మన చెప్పుచేతల్లో ఉంచుకోవాల్సిన ఆవశ్యకతను బహుశా ప్రపంచంలో సమాజం కూడా ఇంత స్పష్టంగా నిర్వచించుకుని ఉండదు. కమ్యూనికేషన్ స్కిల్స్ అభ్యాసం చేయాలనుకునే వారికిది వేదవాక్కు. నాలుక సమాజ మార్గదర్శనానికి, సమరానికి కూడా విత్తనం వేయగలదు. ఉత్తేజానికి, నిస్తేజానికి నాయకుడి మాటే ఇంధనమై మనుషుల్ని నడిపిస్తుంది. రాజకీయ రంగంలో మహాత్మ గాంధీ, సాఫ్ట్ వేర్ రంగంలో ఇన్ఫోసిస్ వ్యవస్థాపకుడు నారాయణ మూర్తి, అంతర్జాల వాణిజ్యంలో ఆలీబాబా వ్యవస్థాపకుడు జాక్ మావీరంతా తమ తమ రంగాల్ని ప్రభావితం చేసిన శ్రేష్ఠులు. నారాయణ మూర్తి, జాక్ మా  మాట్లాడితే షేర్ మార్కెట్ అతలాకుతలమవుతుంది. వారి మాట మార్కెట్ ను శాసిస్తుంది.

మానవ వనరులను నిర్వహించేవారు కూడా మాటను మచ్చిక చేసుకోవాలి. మానవ వనరులను ఒక కంపెనీకి ఉపయోగపడే విధంగా మానవ ఆస్తులుగా రూపుదిద్దాలంటే మాటే మార్గదర్శనం చేస్తుంది. ‘Communication is the key to transform human resources into human assets’. ఒక మామూలు మనిషిని అరివీర భయంకర సైనికుడిగా తయారు చేయాలన్నా, నీరసించిపోయే నిర్వీర్య మానవుడిగా చేయాలన్నా మాటే మల్టీ విటమిన్ లా పని చేస్తుంది. అందుకే నాయకుడైనవాడు మాటను వ్యూహాత్మకంగా, ఉత్తేజభరితంగా, ఉత్తమంగా, ఉన్నతోన్నతంగా, ఎదుటివారు తన మాటలను గుడ్డిగా అనుసరిస్తారన్న స్పృహతో ఉపయోగించాలి. ఇటువంటి స్పృహ ఇంట్లో మొదలవుతుంది. అందుకే వీటినికుటుంబ నైపుణ్యాలు’ (Familial Skills) అని కూడా అంటారు. ఇంటి పెద్ద ఇష్టమొచ్చినట్టు మాట్లాడితే కుటుంబ సభ్యులంతా అలాగే మాట్లాడతారు. ఒక కార్పొరేటర్ చిన్న సమస్యను తీర్చలేక ఇష్టమొచ్చినట్టు మాట్లాడితే, వార్డు మొత్తం అలాగే మాట్లాడుతుంది. ఒక ఎమ్మెల్యే నోరు పారేసుకుంటే, ఆయన మీద నియోజకవర్గమంతా నోరు పారేసుకుంటుంది. ఇప్పుడైతే సామాజిక మాధ్యమాల్లో కూడా ఉతికి ఆరేస్తున్నారు. దీనివల్ల ప్రజల్లోను, నాయకుల్లోను అయోమయం తప్ప సాధించేదేమీ లేదు. మాట వాగ్దానంలా ఉండకూడదు. అంటే మర్చిపోయేందుకు వీలుగా ఉండకూడదు. మాట నేలమీద నిబ్బరంగా నిలబడాలి. అలా నిలబడేలా మాట్లాడేవాడే నిజమైన నాయకుడు. ఒక పోట్లాటను తప్పించాలన్నా, ఒక తక్షణ చమత్కారం నాయకుడి నైజానికి అద్దం పడుతుంది. అటువంటి మాట మహత్తు ఏమిటో ఒక ఉదాహరణ చూద్దాం.

ఒకసారి విన్స్టన్ చర్చిల్ తో లేడీ ఆస్టర్ మాట్లాడుతూచర్చిల్! నేను నీ భార్యనైతే నీ కాఫీలో విషం కలిపేస్తానుఅంది. చర్చిల్ నిదానంగానువ్వే నా భార్యవైతే నేనది తాగేస్తానుఅన్నాడు. మరో సందర్భంలో చర్చిల్ పార్లమెంట్ లో మాట్లాడుతూ ‘Half of the parliament members are fools’ అన్నాడు. పార్లమెంటు సభ్యులంతా నిరసిస్తూ తీవ్ర కలకలం రేపారు. వెంటనే చర్చిల్ కూల్  గా ‘Half of the parliament members are not fools’ అని తన statement ను సవరించాడు. రెచ్చిపోయిన పార్లమెంటేరియన్లంతా మాటతో చల్లబడ్డారు. చర్చిల్ తన మాటను వెనక్కు తీసుకున్నారని భ్రమించారు. ఒక ఘర్షణను నివారించాలన్నా నాయకుడికి  తక్షణ చమత్కార సంభాషణా చాతుర్యం ఎంతైనా అవసరం. వ్యక్తిత్వ నిర్మాణంలో, వ్యక్తిత్వ వికాసంలో, నాయకుడిగా రూపుదిద్దుకునే ప్రయత్నంలో మాటకు ఇంతటి ప్రాధాన్యత ఉంది. మన వ్యక్తిత్వం వికసించిందని నిరూపించుకోవాలన్న తహతహ, తపన ఉంటే ముందు మాటను సరిగా ఉపయోగించడం అభ్యసించాలి. సాధన చేయాలి. మాటకు రెచ్చగొట్టే తత్వాన్ని కాకుండా, చిచ్చికొట్టే తత్వాన్ని ఉగ్గు పాలతో తాగించాలి. అప్పుడే కుటుంబం, సమాజం, రాష్ట్రం, దేశం, ప్రపంచం శాంతి సంతోషాలతో వర్ధిల్లుతాయి. అటువంటి మాటల ప్రపంచానికి అంతాజైకొడతారు. Change your world of Words. Change your World!

* * *

చల్లా రామ ఫణి

చల్లా రామ ఫణి - వృత్తిరీత్యా కార్పొరేట్ ట్రైనర్. ప్రవృత్తి రీత్యా కవి, రచయిత. కొన్నాళ్ళు గుమస్తాగా, కొన్నాళ్ళు పాత్రికేయుడుగా, ఓ సంవత్సరం పైగా మారిషస్ లో తెలుగు వారికి తెలుగు బోధన, ఫార్మా రంగంలో మానవ వనరుల శాఖలోనే గత రెండు దశాబ్దాలుగా ఉద్యోగం. ప్రస్తుతం కార్పొరేట్ ట్రైనర్ గా స్థిరపడ్డట్టే అనిపిస్తోంది. తొలి కవితల సంకలనం 'త్రిశంకు నరకం' కు ఆంధ్ర మహిళా సభ వారి 'దేవులపల్లి కృష్ణశాస్త్రి పురస్కారం' అందింది. డెలాయిట్ మానవ వనరుల శాఖ డైరెక్టర్ ఎస్.వి.నాథన్ ముందుమాటతో అంగ్లంలో ‘Access Success… Infinite’ అనే వ్యాసాల సంకలనం 2017లో వెలువడింది. అమెజాన్ లో ఈ పుస్తకం అందరికీ అందుబాటులో ఉంది.

Add comment

Categories

Your Header Sidebar area is currently empty. Hurry up and add some widgets.