సృష్టి స్వప్నం

కవీ
మళ్లీ కొత్తగా ఈ కుట్ర గొడవేంటీ?’’

కుట్ర కొత్త కాదు
గొడవ అంతకంటే కాదు
ఆదియందూ కుట్ర కలదు
అంతమందునూ కుట్ర కలదు

వెలుతురు పంచడానికి కిరణాలతో
ఆకాశం గొంతు చీల్చే సూర్యుడు
భూమి నుదిటిపైని చెమటతో సంగమానికి..
మేఘాన్ని కరిగించి చిప్పిల్లే చినుకు
పచ్చదనం రక్షణకు మట్టిని పెళ్లగించుకుని
చేతుల దోసిలి సాచే అడవీ-
స్వేచ్ఛను కలగంటూ పెంకును పగులగొట్టి
రెక్కలు విప్పే పిట్టా-
కొత్త ప్రపంచపు మహాద్వారాలను తడుతూ.
లేత పిడికిళ్లతో జనించే శిశువూ-

ఈ సకల చరాచర సృష్టి స్వప్నమే..
ఓ కుట్రపూరిత మెలకువ.

దేశ రాజు

దేశ రాజు: తూర్పు గోదావరి జిల్లా కపిలేశ్వరంలోపుట్టి పెరిగారు. బాల్యం, విద్యాభ్యాసం శ్రీకాకుళంలో. వృత్తి: జర్నలిజం. 'ఒకే ఒక్క సామూహిక స్వప్నావిష్కరణ' పేరుతో కవితా సంపుటి ప్రచురించారు. కవిత్వం, కథలతో పాటు, 'దేరా' పేరుతో పుస్తక సమీక్షలు రాస్తుంటారు.

3 comments

Categories

Your Header Sidebar area is currently empty. Hurry up and add some widgets.