దోషి?

ఇప్పటికి ఆరోసారి మునిస్వామికి ఫోన్ చేసిమొబైల్ ఎప్పుడూ స్విచ్ ఆఫ్ చేసే వుంటోంది. ఏం జరిగిందో తెలియడం లేదునా బర్త్ సర్టిఫికేటు, స్థలం తాలూకు ఈసీ  మునిసిపల్ ఆఫీస్ లో ఎట్లైనా సంపాదించమని చెప్పి అడుగుతూనే ఉన్నానురెండు మూడు సార్లు డబ్బు కూడా పంపించానుదాదాపు ఆరు వేలు దాకా పంపించాను నెల క్రితం ఫోన్ చేసి సీట్లో వాడు మళ్లీ మారిపోయాడు. కొత్తగా మళ్లీ డబ్బులు అడుగుతున్నాడు గురూఅంటే  ఇంకో రెండు వేలు కూడా పంపించాను. నాకు తెలిసి మునిస్వామి అలాంటి మోసకారి కాడుఏమై ఉంటుందో తెలియడం లేదు. మునిస్వామి  తో పరిచయం ఇప్పటిది కాదుకాలేజీలో చదువుతున్నప్పటినుంచి స్నేహితుడేఇద్దరమూ మధ్యతరగతి కుటుంబాల నుంచి వచ్చిన వాళ్ళమే

మునిస్వామి  ఐదున్నర అడుగుల ఎత్తులో లావుగా గడ్డం పెంచి తిరుగుతుండేవాడు. వాళ్ళ నాన్న ఒక హోటల్ యజమానికష్టపడే చదివించాడుకానీ మునిస్వామికి సినిమాల పిచ్చి బాగా ఎక్కువఎన్నో సార్లు చెప్పినా వినకుండా క్లాసులు ఎగ్గొట్టి మరీ సినిమాలు చూసే వాడు. ఎంజాయ్ చేయాల్సిన టైములో ఎంజాయ్ చేయాలి అనేవాడు. అనుకున్నట్లే డిగ్రీ తప్పి చిన్న వ్యాపారం లో సెటిల్ అయిపోయాడు. నాలుగేళ్ల క్రితం హైదరాబాదు లో ఒక పెళ్ళిలో కలిసి చాలా సంతోషించాడు. అప్పటి నుంచి ఇద్దరం కాంటాక్ట్ లో ఉన్నాం. అప్పటికీ ఇప్పటికీ ఏం పెద్ద మార్పు లేదుకొంచెం  వళ్ళు చేశాడంతే. ఆలస్యం గా పెళ్లి చేసుకున్నా డేమో ఒక పదేళ్ళ కొడుకు కూడా ఉన్నాడు.

సాధారణంగా ఎప్పుడు ఫోన్ లిఫ్ట్ చేయకుండా ఉండడు. ఈసారి ఇలా ఎందుకు జరుగుతోందో. అనుకుంటూ ఉండగానే రైలు గుంటూరు వచ్చేసింది. ముందసలు ఆఫీసుకెళ్లి ఏం జరిగిందో కనుక్కుందామనుకున్నాను. గుంటూరొచ్చి చాలా యేళ్ళు అయిందేమో చాలా మారిపోయింది. ఇక్కడ థియేటర్ ఉండాల్సిన చోట మునిసిపల్ ఆఫీసొచ్చింది. అందర్నీ కనుక్కుంటూ లోపల కౌంటర్ దగ్గరికి వెళ్ళి అడిగాను. మునిస్వామి చెప్పిన పేరు గల అతను అక్కడ ఎవరూ లేరు. వివరాలు కనుక్కుంటే అతను అక్కడి నుంచి బదిలీ అయి వెళ్లిపోయాడని తెలిసింది. కౌంటర్లో వున్నతను  నా సర్టిఫికెట్లు వివరాలడిగి సర్టిఫికెట్ ఇష్యూ అయింది అని చెప్పాడు. నకలు కాపీ కి మళ్ళీ డబ్బు కట్టమని అడిగాడు. సాయంత్రం వచ్చి తీసుకోమన్నాడు.

ఇక్కడ కలవాల్సిన వాళ్ళూ ఎవరూ లేరు కదా ఒకసారి మళ్ళీ మునిస్వామి కోసం ప్రయత్నం చేద్దామని అనుకున్నాను. మునిస్వామి వాళ్ళ ఇల్లు నాకు బాగా గుర్తు లేదు. పాత గుంటూరు శివాలయం దగ్గర అన్నట్లుగా గుర్తు. ఇప్పుడు అక్కడ ఉన్నాడో లేదో. ఎక్కడ ఉన్నాడో తెలియదు. నాకు తెలిసి అయితే కొత్త ఇల్లు ఏమీ కట్టుకో లేదని చెప్పాడు. ఓసారి ప్రయత్నిద్దామని ఆటో తీసుకుని అక్కడికి వెళ్లాను. చిన్నచిన్న సందులు. చిన్న చిన్న స్థలాల్లో కట్టుకున్న ఇళ్ళు. గజిబిజిగా ఉన్న లైన్లు. టీ షాపులు చిన్న బజ్జీ బళ్ళు ఇలాంటివన్నీ ఉన్నాయి. రోడ్లన్నీ తవ్వి నడవ వీలు లేకుండా ఉన్నాయి.

అక్కడున్న వారికి మునిస్వామి పేరు చెప్తే  వెంటనే వాళ్ళు ముందుకు పోయి కుడివైపు తిరగ మని చెప్పారుఇప్పుడు బాగా గుర్తొచ్చింది ఇంటికే నేను ఒకసారి వచ్చింది కానీ ఇప్పుడు చాలా మారిపోయింది వీధంతా కూడా. వాళ్ళు చెప్పిన ఇంటి దగ్గరకు వెళ్లి తలుపు కొట్టాను

, వస్తున్నా ఉండండిఅంటూ లోపలి నుంచి ఒక ఆడ గొంతు వినిపించింది. ఒక 40 – 45 ఏళ్ల ఆవిడ తలుపు తీసింది. బక్కపల్చగా అలంకారాలు లేకుండా నుదుట స్టిక్కర్ బొట్టు తో ఉంది. ‘మునిస్వామి…?’ అనడిగాను. ‘మీరెవరు?’ అని అడిగింది.  ‘నేను  మునిస్వామి స్నేహితుడిని. హైదరాబాదులో ఉంటాను. నా పేరు…’ అనగానే, ‘మీరు సుబ్రహ్మణ్యం గారేనా?’ అని అడిగింది ఆమె. ‘అవును నేనేఅన్నాను. ‘రాండి లోపల కూర్చోండిఅంటూ కుర్చీ ఒకటి ముందుకు లాగింది. ‘మంచినీళ్ళు ఇవ్వమంటారాఅంది. విసుగ్గావద్దుఅంటూనేమునిస్వామి ఎక్కడున్నాడు?’ అని అడిగాను. ‘చాలా రోజుల నుంచి ప్రయత్నం చేస్తున్నాను. చాలా డబ్బులు ఇచ్చాను. పని చేసి పెట్టమని అడిగితే ఇలా చేస్తాడా. ఊర్లో ఉన్నాడా అసలు?’ అని గట్టిగా మాట్లాడాను నేను. ఆమె కళ్ళలో సన్నగా నీళ్ళు తిరిగాయి.

ఆలస్యం అయింది, క్షమించండి.’ అంటూమునిస్వామి లేడు, చనిపోయాడు.’ అని చెప్పింది. నేను చాలా కంగు తిన్నాను.

అదేంటి నెల క్రితం మాట్లాడాడు కదా?’ అడిగాను నేను.

అవును, మధ్య ఒక యాక్సిడెంట్ లో గాయపడి నయం కాక పోయాడు.’ అని చెప్పింది. ‘యాక్సిడెంట్ ఎలా అయిందిఅని అడిగాను.

మునిసిపాలిటి వాళ్లు మూడునెలల క్రితం అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ కోసం తవ్వి వదిలేసిన గుంటల్లో ఒకరోజు రాత్రి బైక్ నడుపుతూ పడ్డాడు, గాయం తగ్గక అలా మంచంలోనే పోయాడు. ఫోను కూడా పాడైపోయిందిఅంది.

నాకు గుండెంతా ఒకసారి పిండేసినట్లుగా అయిపోయింది.

మీరు పంపిన డబ్బు మొదటిసారి కట్టి కాగితాలు తీసుకున్నాడు. ఆస్పత్రి చుట్టూ తిరిగితే మందులకు డబ్బు చాల్లేదుకాలు నయమయ్యాక మళ్ళీ మీ డబ్బు ఇచ్చేయచ్చని నేనే అలా అడగమన్నాను. ఇలా జరుగుతుందనుకోలేదు. క్షమించండి. మీ డబ్బెలాగైనా ఇచ్చేస్తాను.’ అని ఏడుస్తూ కాగితాల కవరు చేతిలో పెట్టింది.

కవరు మీద గొలుసుకట్టులా ఆమె కన్నీళ్ళ లాటి మునిస్వామి అక్షరాలు నన్ను పలకరిస్తూ నవ్వుతున్నై.

 

డాక్టర్ విజయ్ కోగంటి

విజయ్ కోగంటి పేరుతో 1993 నుండి కవితా వ్యాసంగం. అనేక దిన, వార, మాస, పత్రికలు, ఆన్ లైన్ పత్రికలలో ప్రచురణలు. 2012 లో ‘కూలుతున్న ఇల్లు’ కవితకు నవ్య-నాటా బహుమతి. తెలుగు, ఇంగ్లీషుల్లో కవిత, కథారచనతో పాటు అనువాదాలు, సమీక్షలు, సాహిత్య బోధన ప్రధాన వ్యాసంగాలు. ’ఇలా రువ్వుదామా రంగులు’ (2017) మొదటి కవితా సంపుటి. స్వయం ప్రతిపత్తి గల ప్రభుత్వ మహిళా కళాశాలలో ఆంగ్ల శాఖాధ్యక్షుడు
drvijaykoganti@gmail.com

M: 8801823244

4 comments

Categories

Your Header Sidebar area is currently empty. Hurry up and add some widgets.