నీ చేరువలో
నేను సముద్రాన్నై ఎగసిపడుతుంటాను
గుండెల్లో కలల అలలు.. ఎడతెరిపి లేకుండా!
ఒక్కో కలా ఒక్కో ముత్యమై
లోలోపల దాగుంటుంది…
నీ చెంతలేని క్షణాల్లో తవ్వుకుంటాను
ఆ అపారనిధిని!
నిశ్శబ్దం అనేది ఎరుగని
నా హృదయం
ఆల్చిప్పలను తాకి ప్రతిధ్వనిస్తుంది..
సాగరఘోషగా…
మళ్ళీ మళ్ళీ నీ పేరే నాలో వినవస్తుంది!
నీవు అంతులేని నా తీరానికావల
ఉదయిస్తూ
తూర్పు, పశ్చిమాల నడుమ దోగాడుతుంటావు
నా జీవితం పైకి
ఇంత వెలుగు విసిరి
నన్నూ ఒక కిరణాన్ని చేస్తావు
నువ్విచ్చే పగళ్ళూ
నీవు లేనప్పుడు వెలిగించుకున్న నెగళ్ళూ
నాకు నిన్నే చూపుతాయి
యమారా పంచుకున్న క్షణాలను
నాలోకి అమృతంలా ఒంపుతాయి
నా ప్రతి కెరటమూ నీకోసమే
వావ్, ప్రేమ గీతా సారాంశాలు రస్తాలో కూడా చదవడం ఆనందంగా ఉంది. ప్రేమామృత సముద్ర కవన మంతా ముత్యాల వేటే. మంచి ఫీల్ ఉన్న కవిత చదివించారు. థ్యాంక్యూ.
థాంక్యూ శ్రీరామ్ గారూ.. క్రెడిట్ మీదే రస్తాకు పంపామని ప్రోత్సహించినందుకు..
ఆ అమ్మాయి ఎవరో మిమ్మల్ని గీత వెల్లంకి ప్రేమ కవితల పాల కంకి అంటే భలే పట్టుకున్నదే అనుకున్నా .మీరు పాలకంకి కాదు .పసిడి పంట .ఎంత గొప్పగా రాశారు ?అభినందనలు
థాంక్ యూ సో మచ్ ఫర్ affectionate కామెంట్ సర్
చాల గొప్ప కవిత.
థాంక్ యూ బ్రదర్
నువ్విచ్చే పగళ్ళూ
నీవు లేనప్పుడు వెలిగించుకున్న నెగళ్ళూ
నాకు నిన్నే చూపుతాయి…ఎంత గొప్ప ఫీలింగ్…
చాల బాగుంది గీత గారు….