ఆఁ..!

బాగున్నావా?”

“హూఁ! భగవంతుడి దయ, బాగానే ఉన్నాం. నువ్వెల్లాగున్నావు?”

అంతా బాగే

“చాన్నాళ్ళకి గుర్తుకొచ్చానే”

అలా ఏం కాదు.టైం కుదరక

“ఇంకా”

ఇంకేం లేదు

“అదేంటీ ఇన్నాళ్ళకి పలకరించి ఏంలేదంటావు”

గుర్తొచ్చావు. వీలు కుదిరింది హాయ్ అన్నానంతే

ఎందుకు గుర్తుకొచ్చానో?”

“ఏమో !”

అదెలాగా కారణం లేకుండా నన్నెందుకు తలచుకుంటావు? అసలే తీరికుండదుగా  నీకు

నిజమే. మధ్యన  ప్రేమహత్యా వార్తలు వింటుంటే తెగ గుర్తుకొచ్చావ్లే

కాసేపు మౌనం తరవాత

“మనది పిరికితనమనిపిస్తుందా?”

ఛా ! అలా అని కాదు. కాలం, అప్పటి పరిస్థితులు వేరు. ఇంతటి అవగాహన అప్పుడెక్కడిదీ?”

తెగిస్తే ఏమయ్యేదో?”

ఏమో! తలచుకుంటేనే భయమేస్తుంది

ఎందుకు

“మీవోళ్ళో మావోళ్ళో ఏ అరటి తోటలోనో నరికేసి, ఏటి గట్టున ఇసక పాతరేస్తే ఎన్నేళ్లయినా బయటి ప్రపంచానికి అసలు తెలిసేది కాదు”

అవున్నిజమే. పోలీసులుదాకా  కూడా పొయ్యేదే  కాదు కేసు. కొన్నాళ్ళకి అందరూ మర్చేపోయేటోళ్లు

హా…. ! పక్కా అలాగే జరిగేది”                              

మరి తప్పించుకొనుంటే….  అప్పుడేలాగుండేదో?”

ఏమో! వెదికి మరీ……”

అవును అంతటి సమర్దులే అప్పట్లో మనోళ్లు

హూ..!”

మళ్ళీ కాసేపు మౌనం.

అవసానదశలో మా నాన్న నన్నోసారి అడిగారు. నీ ప్రేమను  కాదని వేరే  పెళ్లి చేసాను కదా.. ఇప్పుడు నీకేమనిపిస్తుంది? సంతోషంగా ఉన్నావా లేక ఇంకా నన్ను మనసులో తిట్టుకుంటానే  ఉన్నావా? అని

అవునా..! మరి నువ్వేమన్నావు?”

“……”

చెప్పవేం

“ఏం చెప్పనూ?”

మీ నాన్నకు ఏం సమాధానమిచ్చావు అని

ఏదో చెప్పాలే

అదే…  అదేంటో చెప్పరాదూ

ఉహూ..! చెప్పరాదు

?”

అదంతేలేగానీ అదే ప్రశ్న మీ నాన్న నిన్నడిగితే నువ్వేం చెప్తావో?”

“……”

“మాట్లాడవేంటీ?”

నిజమే చెప్తా

అదే ఏమనీ?”

నీ చెవిటి మెషిన్ అదాటున నా కాలికింద పడలేదు నాన్నా, నా  సంసార సాగరంలోని కల్లోలం నీకినపడ కూడదని నేనే తొక్కి నలిపేసాననీ…”

“……..”

ఇప్పుడన్నా చెప్పూ నువ్వేమి జవాబిచ్చావో

కన్న తండ్రివి  కదా నాన్నా నీకు  కానొస్తలేదా? కన్న బిడ్డ గుండె లోతుల్ని చూపించే కళ్లజోడెక్కడన్నా దొరికితే  కొని తగిలించుకొని  చూడమన్నా”                                         “హూ …”

మళ్ళీ ఎన్నాళ్ళకో నా గుండె గూటికి పండుగొచ్చేది?”

చూద్దాం. మళ్ళెప్పుడో, ఎక్కడో ఏదైనా  క్రౌంచ పక్షి  నేలకొరిగితే మన నోళ్లు తెరుచుకుంటాయెమోలే.”  

అనిల్ ప్రసాద్ లింగం

''తనను తాను సాహితీ అభిమానిగా చెప్పుకోడానికే ఎక్కువ ఇష్టపడే అనిల్ ప్రసాద్ లింగం, ఆ ఆలోచనామృతంలోంచి పుట్టేవే తన రచనలని చెప్తారు. 15 కథల వయసున్న ఈ రచయిత, మనిషి అంతరంగంలో దాగిన కంటికి కనిపించని భావావేశాల్ని, వైవిధ్యమైన భావోద్వేగాల్నీ, మానవ సంబంధాలలోని విచిత్ర పార్శ్వాలనీ - 'అద్వైతం' పేరున తన కథలలో అక్షరీకరించే ప్రయత్నం చేస్తారు.

11 comments


Type Comments in Indian languages (Press Ctrl+g to toggle between English and Telugu OR just Click on the letter)

 • కథ బావుంది .
  Story with lot of Social value.
  కథగానే బావుంటుంది .
  ఎందుకంటే యవ్వనంలో ప్రేమని కాదన్న జంట విడి విడి పెళ్లిళ్లు చేసుకొని ఏ రిగ్రెట్సూ లేకుండా ఉన్నవాళ్లు కోకొల్లలు .
  వాళ్ళది స్వచ్ఛమైన ప్రేమకాదు అని ప్రేమికులంటే , వీళ్లది వ్యామోహం మాత్రమే అని వాళ్లంటారు .

  రెండింటికీ ఉదాహరణలూ ప్రత్యుదాహరణాలూ ఉన్నాయి . ఒకే మనిషి లో మారే నమ్మకాలూ తక్కువకాదు.

  Story is worth-thinking

  • మీ అభిప్రాయాన్ని తెలియచేసినందుకు ధన్యవాదములు మేడం !

Categories

Your Header Sidebar area is currently empty. Hurry up and add some widgets.