విడి విడి ఊహలు

ఎక్కలేని చెట్టు ఆకాశం మీద
ఎక్కడో పచ్చగా, అంతెత్తున సూరీడ్ని
కొన్ని పసిడి కాంతుల్ని ఇస్తాడేమో
అడగాలనిపిస్తుంది

చుక్కల్ని మొయ్యలేక ఆకాశం
కొన్ని మనుషుల శరీరాల్లోకి తాపడం చేసినట్లుంది
స్వేద బిందువులివిగో
సూర్య వర ప్రసాదితాలు!

జాలర్లు
చేపల వలల్ని ఖాళీగా మొయ్యలేక
సముద్రంలో పారేస్తారు
అవి బరువెక్కి వాళ్ళ గుండెలు తేలికపరుస్తాయి
ఒక రోజు గడిచినా చాలు!

వానల్లేకపోతే చాతకాలౌతారు
వానలొస్తే పెంగ్విన్లు
చలికాలం గొంగళిపురుగులై హైబర్నేట్‌
అవుతారు …
వేసవిలో రెక్కలు విప్పిన సీతాకోకచిలుకలు ..
మనుషులు!

జలకన్యలు ఉండేవిట ఒకప్పుడు
నీళ్ళల్లో దర్జీలుండరుగా
అందుకే టాప్‌లెస్‌గా ఈదేవారు

తిమింగిలాల నడుమ
చిన్న చేపలెన్నో
కళ్ళు తెరుచుకునే ఈదినా
తప్పదు ముప్పు!

గీతా వెల్లంకి

గీతా వెల్లంకి హైదరబాద్ లో వుంటారు. ఆక్కడే పని చేస్తారు. ఉస్మానియ వర్సిటీలో చదువుకున్నారు.

6 comments

 • మీ కవనం లో చిక్కదనాన్ని తొలిసారి ఆస్వాదించిన ఫీలింగ్ కలిగింది. రొటీన్ గా మీ లవ్ పోయెట్రీ దాటి ఇలా ఎంత బాగా రాశారో చూస్తే హేపీ అనిపించింది.

  కళ్ళు తెరుచుకుని ఈదినా తప్పదు ముప్పు. బాగా ముగించారు. సెహబాసు గీత గారు.

  • థాంక్యూ శ్రీరామ్ గారూ.. మీ అందరి సహకారంతో కొత్త మెట్లు ఎక్కుతున్నా..

   • నిజమే…
    గీత గారు కొత్త వస్తువులతో ఈదే ప్రయత్నం చేస్తున్నారు.
    అభినందనలు………

 • కళ్లు తెరుచుకుని ఈదినా తప్పదు ముప్పు.. చాలా బాగా చెప్పారు నేటి పరిస్థితులను….విడి విడి ఊహాలతో కొత్తగా బాగుంది కవిత..అభినందనలు గీతగారు

 • స్వేద బిందువులు సూర్య వరప్రసాదితాలు..వాహ్..గీతా..కుడొస్.. మంచి కవిత..

ఇటీవలి వ్యాఖ్యలు

Categories

Your Header Sidebar area is currently empty. Hurry up and add some widgets.