అప్పటికి మిగిలేది…

కొన్నివేల సంవత్సరాల తర్వాత…
భూమి పొరల్లో కుప్పలు కుప్పలుగా శవాలు
ఏ అణ్వాయుధ పరిశోధనల మహా ఫలమో!
బొబ్బలు చూస్తే అతినీలలోహిత కిరణాలు శరీరాల్ని చీల్చినట్లున్నాయి!
మిగిలిన‍వి? ఎవరెస్టు కరిగి తనలో కలిపేసుకుందేమో!
విసుగొచ్చి ఏ మహాసముద్ర సునామీ చుట్టేసిందో!
ఈ దరిద్రాలన్నీ  చూడలేక ధరిత్రి గుండె బద్దలై సజీవ జనసమాధి చేసిందో?
ఏమో..!
అందులో నాలుగు శవాలు మాట్లాడుకుంటున్నాయి…
కాదు కాదు… పోట్లాడుకుంటున్నాయి..!
పచ్చని చెట్లను రంపాలతో కోసి భూమికి గర్భశోకాన్ని మిగిల్చింది నువ్వే!
తాకితే తెగిపోయే సాలెగూడు  ఓజోన్ కు పిచ్చివాడిలా రంధ్రాలు చేసింది నువ్వు!
గాలికి మొస్సమొర్రకుంట జేసి ఊపిరి తీసింది నువ్వు కాదా?
విష రసాయనాలతో నీళ్ళ పానం తీసింది నువ్వే..!
నువ్వు… నువ్వు… నువ్వే… నువ్వే..!
శవాల కొట్లాట
విధ్వంసం జరిగినన్ని రోజులు నాటకం చూసి తన దారిన తాను పోయిన
దానయ్య, శవ‍మో దయ్యమో
దుబ్బ దులుపుకుంటూ వస్తున్నడు!
శవాలు వాటి వాదనల హారన్ లు మోగించాయి
అప్పటికే చెవులకు చిల్లులు పడ్డ దానయ్య గుణుక్కుంటూ చెప్పాడు…
అనుభవించాల్సిందేనని..!

కాసుల ర‍వికుమార్‍

ప్రభుత్వ ఉపాధ్యాయుడు, కవి,రచయిత, లీడ్ వెల్ఫేర్ సొసైటీ ఫౌండర్; "ముగింపులేని వాక్యం" కవితా సంపుటి రచయిత; నర్సంపేట, వరంగల్ రూరల్ జిల్లా సెల్: 9908311580

3 comments

Categories

Your Header Sidebar area is currently empty. Hurry up and add some widgets.