పూర్తి ‘మంచి’ పూర్తి ‘చెడ్డ’ సాధ్యమేనా?

అరవింద కుమార్, అనంతపురం  (ఉత్తరంలో)
ఏమండీ, మనం ఒక విషయాన్ని ‘ఇది మంచీ, అది చెడ్డా’ అని కచ్చితంగా తేల్చగలమా? ‘ఇది నలుపూ – అది తెలుపూ’ అనవచ్చు గానీ, వాటి మధ్య ఆ ‘నలుపు’ రక రకాల స్తాయిల్లో వుంటుంది. అలాగే, ‘తెలుపు’ కూడా, ఒక చోట 10 శాతంగా, ఇంకో చోట 20 శాతంగా, ఇట్లా తక్కువ ఎక్కువలుగా ఉంటుంది కదా? అటువంటప్పుడు, ‘ఈ సిద్ధాంతమే పూర్తిగా సరైనది’ అనీ; ‘ఆ సిద్ధాంతం పూర్తిగా తప్పయినది’ అనీ; తేల్చడం సరైనదే అంటారా?
మీరు, నలుపూ – తెలుపుల్లో తక్కువ – ఎక్కువ తేడాల గురించి చెప్పారు. రంగుల్లో అయితే, ఆ తక్కువ – ఎక్కువ తేడాలు తప్పకుండా వుంటాయి. బరువుల్లో అయితే, పొడుగుల్లో అయితే, ఒకే రకం వస్తువుల్లో ఆ తేడాలు కూడా ఉంటాయి. అంతే కాదు; ‘మనుషుల్లో మంచీ ఉంటుంది – చెడ్డా ఉంటుంది’ అంటారు. ఈ తేడాలు కొందరి విషయంలోనే గానీ, ప్రతి మనిషీ, ‘మంచి-చెడ్డలు కలిసి’ వుండరు. మనిషి, తన భావాల్ని బట్టీ, తన ఆచరణని బట్టీ, పూర్తిగా ‘మంచి’ గానో, పూర్తిగా ‘చెడ్డ’ గానో ఉండవచ్చు. మీరు సిద్ధాంతం మాట ఎత్తారు. ఉదాహరణకి, ‘కుల విధానం’ ఉందనుకోండీ. అందులో, మంచి-చెడ్డలు కలిసి ఉన్నాయా? అది పూర్తిగా చెడ్డదే అవుతుందా, కొంత మంచిది కూడా అవుతుందా? అది పూర్తిగా చెడ్డే. అలాగే, వడ్డీ-లాభాల్ని సంపాదించే సిద్ధాంతాన్ని చూడండి! ఆ ఆదాయాలు, ఇతరుల శ్రమల్ని దోచడం ద్వారా వచ్చేవే అని తేలింది. అప్పుడు, ఆ విధానం పూర్తిగా చెడ్డదే. ఆ ‘శ్రమ దోపిడీ జరగరాదు, దాన్ని తీసివెయ్యాలి’ అని చెప్పే విధానం పూర్తిగా మంచిది అవుతుందా, కాదా? మధ్య రకం విధానాలేవీ లేవు. మానవ సమాజంలో జరుగుతున్నవి చెడ్డ సంబంధాలే. కాబట్టి, అవి మారిపోతేనే అవి ‘మంచి సంబంధాలు’ అవుతాయి. అలా జరగకపోతే, ‘చెడ్డా – మంచీ’ కలిసి ఎలా ఉంటాయి? రంగుల్లో రక రకాల స్తాయిలు ఉన్నట్టు, సమాజ విషయాలు అలా ఉంటాయ

కే. సత్యపాల్ రెడ్డి, నల్గొండ
మీకు నేను రాసే మూడో ఉత్తరం ఇది. మొదటి ఉత్తరంలో ఎన్నో ప్రశ్నలు అడిగాను. రెండో ఉత్తరం కార్డే. ఈ మూడో ఉత్తరానికైనా జవాబు ఇస్తారో, లేదో తెలీదు.
మీ మొదటి ఉత్తరాలు రెండూ అందలేదు. మూడో ఉత్తరం వల్లే ఆ విషయాలు తెలిశాయి. ఇప్పుడు, అందరికీ ఫోన్లు ఉన్నాయి. కాబట్టి, మీరు మూడో ఉత్తరంలో కూడా ఫోన్ నంబరు ఇవ్వలేదు. మీ మూడో ఉత్తరం, ఈ శీర్షిక కోసం రాసినదే. పర్శనల్ విషయంతో రాసినది కాదు. కొంత మంది, ఫోన్ నంబర్లు లేకుండా రాస్తారు. స్వయంగా మాట్లాడడం వల్ల ఒకరి గురించి ఒకరికి తెలుస్తుంది. ఉత్తరాలు, అనవసరం అని కాదు. ఫోన్ నంబరు కూడా వుంటే, ఒక సారి మాట్లాడడమూ ఉంటుంది. అవసరం అయితే, ఉత్తరమూ ఉంటుంది.

ఉదయ భాస్కర్, శానోసే, కాలిఫోర్నియా
మీరు, సినిమా పరిశ్రమలో వున్న డబ్బు గురించి ‘సితార’ పత్రికలో రాసిన వ్యాసం చదివాను. అప్పట్నించీ నన్నొక ప్రశ్న పట్టుకుంది. అమెరికాలో నేనొక సాఫ్ట్ వేర్ ఇంజినీరుని. ప్రోగ్రాములు రాసి, వేరే వాళ్ళ ప్రోగ్రాముల్లో తప్పులు పట్టుకోవడం నా ఉద్యోగం. రోజుకి ఎనిమిదీ, పది గంటలు పని చేస్తాను. జీతం మాత్రం కుప్పలు తెప్పలుగా ఇస్తారు. నెల జీతం అనీ, ఏడాది బోనస్ అనీ, ఆర్నెల్ల స్టాకులనీ, రక రకాల రూపాల్లో చాలా జీతం ఇస్తారు. నేను చేసే ఎనిమిదీ, పది గంటల పనికి అంత “విలువ” ఎలా వస్తోందీ? నా ‘అదనపు శ్రమ’ కూడా నాకే వచ్చేస్తోందా? నా ‘అదనపు శ్రమ విలువ’ పెట్టుబడిదారుడికి పోవడం లేదా? దాన్ని పొందకపోతే, ఈ పెట్టుబడిదారుడు నన్ను పనిలో ఎందుకు పెట్టుకుంటాడు? నాకే కాదు, ఈ సాఫ్ట్వేర్ ఉద్యోగుల్లో చాలా మందికి అంతంత జీతాలు ఎలా ఇస్తున్నారూ? ఇదంతా మా శ్రమే అంటే, నమ్మ బుద్ధి కావడం లేదు. మీరు వివరంగా చెబుతారా?
దీనికి, మొదట చిన్న జవాబు చాలు. (1) మీ ‘అదనపు విలువ’ మీకే వస్తూ వుండవచ్చు. లేదా, (2) మీ కంపెనీలోనే, తమ అదనపు విలువల్ని పోగొట్టుకునే వాళ్ళ నించీ, కొంత చిన్న భాగం మీకూ, పెద్ద భాగం పరిశ్రమ యజమానికీ అందుతూ వుండవచ్చు. ఒక వేళ, 1వ అంశమే జరుగుతుంది – అనుకుందాం. ఒక సాఫ్ట్వేర్ కార్మికుడు (బహుశా మీరు) రాసే ప్రోగ్రాముల్ని ఇతర కంపెనీలు కొంటాయి. వాటికి చాలా డిమాండ్ ఉండవచ్చు. ఆ డిమాండ్ ఎందుకు ఉంటుందంటే, ఆ ప్రోగ్రాముల్ని కొని, తమ కంపెనీలో వాడే వాళ్ళ పాత ఉద్యోగుల్ని అనేక మందిని తగ్గించి వేసే లాంటి ప్రోగ్రామ్‌ మీది అయివుంటుంది. ఇటువంటి కారణమే ఇప్పుడు అనేక ప్రోగ్రాముల వల్ల ఉంటుంది. మీరు రాసే, రాయగలిగే ప్రోగ్రాములకు సాంకేతికంగా కొత్తదనం వుంటే, మీకు డబ్బు కొల్లలే. మీరు అలా రాయకూడదని కాదు. రాయకూడని సాంకేతికతలూ వుంటాయి. ఈ జవాబు చాలు లెండి.

రంగనాయకమ్మ

Add comment

Categories

Your Header Sidebar area is currently empty. Hurry up and add some widgets.