తనలో ఆకలి ఆవురావురు మంటూంటే, ఆబగా ఎసరు కాగుతూంటే, గడబిడగా నీళ్లలోని బియ్యం గింజలను, తన కుడి అర చేతితో పిసుకుతూంటే, ఛటుక్కున ఆ చెయ్యి జివ్వుమనగా, గబగబా ఆ కడుగు నీళ్లు ఎరుపెక్కగా, గమ్మున లాగి ఆ చేతిని చూడగా, అక్కడ గాయం, ఆ చెంతనే కొనతేరిన బొడిగె రాయి … కాన రాగా, బిగ్గరగా భీతి కేక పెట్టక, బిక్కపోక, తిరిగి పని చే పెట్టేశాడు, అతడు, తిండి ఆబన.
(బొడిగె రాళ్ళు = బియ్యములోని రాళ్ళు)
***
Simply nice story
మంచి కథ నిచ్చారు. ధన్యవాదాలు.
కథ చిన్నదైనా బోలెడు విషయం ఉన్నది. బాగుంది.
కథ చాలా బాగుంది. మీకు, రచయితకు అభినందనలు.
super