శ్రామికుడు చరిత్ర చదివితే

బెర్తోల్‍ బ్రెహ్ట్‍

థేమ్స్ ఏడు ద్వారాలను నిర్మించిందెవరు?
చరిత్ర పుటలన్నీ
రాజుల పేర్లుతోనే నిండిపోయాయి
రాజులెప్పుడైనా రాళ్ళెత్తారా?
పదే పదే ధ్వంసమయిన
బాబిలోన్ నగరాన్ని పునర్నిర్మించిందెవరు?
ధగధగ మెరిసే లైమా గృహాలలో…
కట్టిన వారు ఒక్క పూటైనా వున్నారా?
చైనాగోడ పూర్తయిన సాయంత్రానికే
తాపీ పనివారు ఎటుపోయారు?
రోమ్ సామ్రాజ్యంలో
గెలుపు చిహ్నాలను నిర్మించిందెవరు?
సీజర్ గెలుపు ఎవరిపైన?
పాటలో బతికే బైజాంటియన్ సామ్రాజ్యంలో
వున్నవన్నీ రాజప్రసాదాలేనా?
రాత్రికి రాత్రే నీట మునిగిన
అట్లాంటిక్ నగరంలో మరణించినవారు
తమ బానిసలకై ఏడ్చారా?

ఒంటిగానే యువరాజు అలెంగ్జాండరు
భారతావనిని జయించాడా?
గాల్స్ ప్రాంతాన్ని జయించిన
సీజర్ సైన్యంలో ఒక్క వంటవాడైనా లేడా?
ఓడల సమూహం నీట మునిగినదని
పిలిప్ ఆఫ్ స్పెయిన్ ఏడుపేనా
వేరెవరి కన్నీళ్ళు లేవా?
ఏడు సంవత్సరాల యుద్దంలో
ఫ్రెడరిక్ ది గ్రేట్‍ తో పాటు
వేరెవరైనా గెలిచారా?

చరిత్రలో ప్రతి గెలుపు వెనుక
మనం నిత్యం కొనియాడే
గొప్పవ్యక్తుల వెనుక
ఎవరి శ్రమ దాగి వుంది?

సవాలక్ష నివేదికలు
సవాలక్ష సందేహాలు

(మూలం:   ‘A worker reads history’ – Bertolt Brecht)

మొయిద శ్రీనివాస రావు

1 comment

Categories

Your Header Sidebar area is currently empty. Hurry up and add some widgets.