టూరిస్టులా వొద్దు బాబోయ్ అంటారక్కడ!

 

యూరోప్ చూడాలనుకున్న వారు ఖచ్చితంగా చూడవలసిన దేశాలలో నెదర్లాండ్స్ ఒకటి. స్వేచ్చాయుత సామాజిక, రాజకీయ వాతావరణానికి నిలయం ఆ దేశం. అక్కడి ప్రభుత్వం దేని మీద నియంత్రణ వుంచదు. కాని ప్రతివిషయం లోను ప్రజలను జాగరూకులను చేస్తుంది. తన భాద్యతను ఖచ్చితంగా నిర్వరిస్తుంది. ప్రపంచంలో చాలా దేశాలలో నిషేదించిన వాటిని (ఉదా .డ్రగ్స్ , వ్యభిచారం ) అక్కడ అనుమతించినా శాంతి భద్రతల సమస్య ఉత్పన్నం కాదు.
నెదర్లాండ్స్ లో మూడు ప్రధాన నగరాలు వున్నాయి. ఆమ్స్టర్ డామ్, రోటర్ డామ్, హేగ్. ఆమ్స్టర్డామ్ సాంస్కృతిక మరియు పర్యాటక రాజధాని , రొట్టెరడం (రోటర్ డామ్ ) ఆర్థిక రాజధాని , హేగ్ పరిపాలన రాజధాని. అయితే ఆ మూడు నగరాలు దేనికవి ప్రత్యేకం. రోటర్ డాం లో ప్రపంచం లోని ఒకానొక పెద్ద ఆయిల్ కంపెనీ షెల్ ప్రధాన కార్యాలయం వుంది , దానితో పాటు యూనీలీవర్ కూడా ఇక్కడి పరిశ్రమే . ఇక ఆమ్స్టర్డామ్ గురించయితే చెప్పనక్కర లేదు. యూరోప్ లో అన్ని నగరాల కంటే మనకు ఇక్కడే ది బెస్ట్ ‘నైట్ లైఫ్’ దొరుకుతుంది. దానికి తోడు ప్రపంచ ప్రఖ్యాతి గాంచిన చిత్రకారుడు వ్యాంగో పేరుతో వున్న మ్యూజియం చాలా ప్రసిద్ధం. ఇదే కాక RIJKS ఆర్ట్ మ్యూజియం కూడా ఎన్నో అద్భుతమైన కళాఖండాలు నిలయం. హిట్లర్ నుంచి తప్పించుకున్న యూదు బాలిక అన్నే ఫ్రాంక్ ఇల్లు కూడా ఇక్కడ ఒక చూడవలసిన ప్రదేశం. ఇవి కాక మరెన్నో స్థలాలున్నాయి. ప్రపంచ ప్రఖ్యాత బీర్ కంపెనీ హైనెకిన్ మ్యూజియం అందులో ఒకటి.
నెదర్లాండ్స్ వెళ్లే టూరిస్ట్ లందరూ సాధారణంగా వారి యాత్ర ను ఆమ్స్టర్ డామ్ తో మాత్రమే ముగించుకొని పోతారు. చాలా తక్కువమందే మిగతా రెండు నగరాలను (రోటర్ డామ్, హేగ్) చూడటానికి వెళ్తారు. అక్కడ తప్పనిసరిగా చూడవలసిన ప్రదేశాలు లేకపోవడం ఒక కారణం. అకాడమిక్ ఇంట్రెస్ట్ ఉంటే ది హేగ్ కు, వ్యాపారాలలో శ్రద్ధ ఉంటే రోటర్ డామ్ పోతాం మినహా యాత్ర పరంగా పోము .
ఆమ్స్టర్ డామ్ తరువాత చెప్పుకోవలసివస్తే రోటర్ డామ్ కంటే హేగ్ పోవడం మంచిది.
హేగ్ పేరు ప్రతి ఒక్కరు వారి పాఠ్యపుస్తకాలలో చిన్నతనం లోనే చదివేవుంటారు. ఎందుకంటే యెన్నో ఐక్యరాజ్యసమితి సంస్థలు జెనీవా, న్యూ యార్క్ లతో పాటు ఇక్కడ కూడా ఉంటాయి. ప్రపంచానికి నెదర్లాండ్స్ రాజధానిగా ఆమ్స్టర్ డామ్ తెలుసు, నిజానికి ఆ దేశ పార్లమెంట్ తో పాటు అన్ని ప్రభుత్వ కార్యాలయాలు హేగ్ లోనే ఉంటాయి . ఆమ్స్టర్ డామ్ టూరిస్ట్ సిటీ గా మారిపోవడం తో ఒక విధంగా ది హేగ్ నెదర్లాండ్స్ కు అప్రకటిత పరిపాలనా రాజధాని. దానితో పాటు ప్రపంచ దేశాల రాయబార కార్యాలయాలన్నీ కూడా హేగ్ లోనే వున్నాయి. చెప్పాలంటే ప్రపంచం లోని ప్రతి దేశం వాళ్ళను అక్కడ,,, ఐక్యరాజ్యసమితి ప్రధాన సంస్థలలో చూడవచ్చు.
ఎన్నో విభాగాల ప్రధాన కార్యాలయాలు ది హేగ్ లో వున్నా ఇక్కడికి వచ్చే యాత్రికుల సంఖ్య తక్కువ గా ఉంటుంది. సమితి కార్యాలయాలను Academic గా చూడాలనుకున్న వారు ఇంటర్నేషనల్ కోర్ట్ అఫ్ జస్టిస్, ఇంటర్నేషనల్ క్రిమినల్ కోర్ట్… రెండు ది హేగ్ లోనే ఉన్నాయి. ఇంటర్నేషనల్ కోర్ట్ అఫ్ జస్టిస్ ప్రపంచం లోని చాలా దేశాల మధ్య ఏర్పడిన వివాదాలను పరిష్కరిస్తుంది. సందర్శకులు కోర్ట్ ఆవరణం లోని లైబ్రరీలో ఏయే దేశాల మధ్య ఏ వివాదాలు నడుస్తున్నాయో ఓకే ఒక బటన్ మీద క్లిక్ చేసి తెలుసుకోవచ్చు. మన దేశం కూడా పాకిస్తాన్ తో పాటు మరికొన్ని దేశాల మీద దావాలు వేసి కేసులను నడిపిస్తోంది. మేము పోయిన రోజున కాంగో మాజీ ఉపప్రధాని మీద… యుద్ధం లో చిన్న పిల్లలను ఉపయోగించడం గురించి క్రిమినల్ కేసు నడుస్తోంది.
హేగ్ లో చూడవలసిన ఇంకో ప్రదేశం మినియేచర్ ప్రపంచం. దీనినే మాడురోడామ్ అంటారు. అక్కడ మనకు నెదర్లాండ్స్ లోని ప్రముఖ స్థలాలన్ని మినియేచర్ లో కనిపిస్తాయి. వీటికి తోడు మరి కొన్ని పురాతన ప్రార్థన స్థలాలను మనము హేగ్ లో చూడొచ్చు.
ప్రపంచం లోని చాలా దేశాలలో ప్రజలు విదేశీ యాత్రికులు తమ దేశాలకు రావాలని తద్వారా తమ ఆదాయ వనరులు పెరుగుతాయని భావిస్తుంటారు. నెదర్లాండ్స్ వారిని పలకరిస్తే మాత్రం తాము యాత్రికుల బెడద తగ్గించుకోవాలనుకుంటామని, టూరిస్ట్ ల రాకను నియంత్రించాలని తమ ప్రభుత్వాన్ని కోరినట్లు తెలిపారు. దానికి వారు చెప్పే కారణం నెదర్లాడ్స్ లో వ్యభిచారం, డ్రగ్స్ రెండింటి మీద నిషేధం లేదు, నియంత్రణ మాత్రమే వుంది. వేలాది మంది వీటి కోసం వస్తున్నారని ముఖ్యంగా మధ్య ప్రాచ్యదేశాల నుంచి వస్తున్నవారితో ఈ సమస్య అధికమని చెప్పారు.
నెదర్లాండ్స్ లో అందరికి ఎంతో నచ్చే విషయం ఆ దేశం లోని ప్రజలందరూ వయస్సు తో సంబంధం లేకుండా దైనందిక జీవితం లో సైకిల్ ను ఉపయోగించడం. విద్యార్థులు ,ఉద్యోగస్తులు… అందరు తమ అవసరాల కోసం సైకిల్ నే ఉపయోగిస్తారు. ఆర్ధిక వ్యత్యాసాలు లేకుండా సైకిల్ ను వారి జీవితంలో ఒక భాగం గా మార్చుకున్నారు. ఊరి చుట్టూ కాలువ తీసి ఒక ప్రాంతం నుంచి మరో ప్రాంతానికి… బస్సు, మెట్రో లాంటి వాటితో పాటు… వాటర్ బోట్స్ సదుపాయాన్ని కల్పిచుకున్నారు. దీనివలన నగరం లో చాలా తక్కువగా ట్రాఫిక్ జామ్ లు కనిపిస్తాయి.
నెదర్లాండ్స్ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ నుంచి ఈ మూడు నగరాలకు దాదాపుగా సమాన దూరమని చెప్పవచ్చు, కొంచెం ఆమ్స్టర్ డామ్ దగ్గరగా ఉండవచ్చు.

జియెల్ నర్సింహా రెడ్డి

తన గురించి తానే  జియెల్ నర్సింహా రెడ్డి: ఆరేళ్ల క్రితం మేము ( నేను, నా భార్య లక్ష్మి ) తక్కువలో తక్కువ గా ప్రపంచం మొత్తంగా చూడటానికి ఎంత ఖర్చువుతుందో బేరీజు వేశాం. ఐదు లక్షలయితే అమెరికా ఖండం తో సహా  యాభయ్ దేశాలను చూడవచ్చని భావించాం. మొదట సింగపూర్, కాంబోడియా, థాయిలాండ్ లతో మొదలైంది మా ప్రయాణం. ఖర్చు మేమనుకున్నంత కన్న చాలా తక్కువే అయ్యింది. ఇప్పటికి మేము ఆసియా, యూరోప్, ఆఫ్రికాలలో ఇరవై పైగా దేశాలు చూశాం. ఇంకా చూస్తాం. ఈ ప్రయాణాల కథ అందరూ వింటానికి బాగుంటుందని ... మా యాత్రానందాన్ని మీతో పంచుకుంటున్నాం.

2 comments

  • లవ్లీ సిటీ. కొంత భాగం సముద్ర మట్టానికి దిగువన ఉంటుంది.ఓస్టెర్ డాక్ లో ఓడలు నిలిపి ఉంటె ఆ మట్టానికి దిగువన కార్లు పోతుంటాయి. రోడ్ల మీద కార్లు చాల స్వల్పం, సైకిల్ ఎక్కువ.

Categories

Your Header Sidebar area is currently empty. Hurry up and add some widgets.