దేవుడిని చూశాను

గుళ్ళల్లో దేవుడున్నాడంటే అన్ని గుళ్ళూ తిరిగాను
గొంతు పోయేదాకా పిలిచాను..!
నిరాశతో వెనుదిరిగిన నాకు మెట్లమీద
అయ్యా ఆకలి అంటూ దీనంగా అర్ధిస్తున్న గొంతొకటి వినపడింది…
ఆ వేదనా భరితమైన గొంతులో దేవుడిని చూశాను!

పెద్దపెద్ద మేడల్లో, మిద్దెల్లో, ఘనంగా చెప్పుకునే చారిత్రక కట్టడాల్లో
ఉన్నాడేమోనని అణువణువూ వెతికాను!
ఆశ్చర్యంగా
వాటి పునాదుల కింద పూడ్చబడ్డ అస్థిపంజరాల్లో దేవుడిని చూశాను

ఎడతెగని అన్వేషణలో
నీరసించి కుప్పకూలి పోతే
ముడతలు పడిన చర్మంతో, వణుకుతున్న చేతులు
నోటికి నీటిని అందించాయి
ప్రేమ, దయ కలగలిసిన ఆ కళ్ళల్లో దేవుడిని చూశాను

కాసుల ర‍వికుమార్‍

ప్రభుత్వ ఉపాధ్యాయుడు, కవి,రచయిత, లీడ్ వెల్ఫేర్ సొసైటీ ఫౌండర్; "ముగింపులేని వాక్యం" కవితా సంపుటి రచయిత; నర్సంపేట, వరంగల్ రూరల్ జిల్లా సెల్: 9908311580

14 comments

ఇటీవలి వ్యాఖ్యలు

Categories

Your Header Sidebar area is currently empty. Hurry up and add some widgets.