ఉనికి

నా భావాలు రూపాన్ని అద్దుకుని
నీవుగా మారి ఎదుట నుంచోడం
ఎంత బాగుందో..

అనేకానేక నేనులు బయల్డేరి
నీచుట్టు నుంచుంటాం
నీ మాట కోసం నీ చూపు కోసం..

కాలం అక్కడే నడకను మర్చిపోతుంది..

నువు పంపే
హడవుడి సంక్షిప్త లేఖలు వెన్నెల రోజుల్లో
సుదీర్ఘ లేఖలు కృష్ణపక్షంలో
నన్ను నాకే మాయంచేస్తాయి..

నీ ఉనికిని ప్రశ్నించే ధైర్యం
నేనయితే చేయను కాని
ఈ బాధ మాత్రం
సందేహంలో పడేస్తుంది

మర్చిపోయాననుకున్న జ్ఞాపకాలు
లోపల వెచ్చగా చలిమంట వేసుకుని
కాచుకుంటాయి..

నువ్వెక్కడున్నావో తెలియని క్షణాన
ఒక గాఢమైన శ్వాస
దేహమంతా నిండుతుంది

ఆ ఒక్క క్షణమే నా ఉనికికి బలమైన పునాది

జి. విమలాప్రసాద్

జి. విమలా ప్రసాద్: వృత్తి ఆంధ్రప్రదేశ్ రవాణాశాఖలో గెజిటెడ్ ఆఫీసర్..అభిరుచి సాహిత్యాదులు. జన్మస్ఠలం తూర్పుగోదావరి కోనసీమ. నివాసం విశాఖపట్నం. కవితా, తెలుగు తల్లి (కెనడా), మాలిక (ఆన్ లైన్) పత్రికలలో కొన్ని రచనలు వచ్చాయి.

8 comments

Categories

Your Header Sidebar area is currently empty. Hurry up and add some widgets.