పోయేదేమీ లేదు!

ఆకాశంలో నున్న వేదాంతిని
బతుకు పాయల నడుస్తున్న సంసారినీ
నడి బజారు కి రప్పించి
తుదకి వోటరు గా మార్చి
పింఛనీ యిప్పిస్తోంది
ప్రతిభ గల ప్రభుత్వం
రండి
మనుషులారా
ఓటరు కండి
పోయేదేమీ లేదు
రేపటి బతుకు తప్ప!
పొయ్యి దగ్గర చతికిలబడిన ఆశయం
చరిత్ర ని మంట పెట్టి కాచుకుంటోంది
ఒకడెవడో లెక్కకు మిక్కిలి
పడవకెక్కిస్తున్నాడు ఆశ మూతికి రాసి
ఎక్కండి ఎపుడైనా పోవలసిందే కదా
ఎప్పుడో గ్యారెంటీ చెరిపేసుకున్నాం
జనగణమన అధినాయక జయహే
భారత భాగ్య విధాతా
సెల్యూట్
భారత్ మాతాకీ జయ్!

పొన్నంగిపల్లి శ్రీనివాస రావ్

3 comments

  • చాలా బాగుంది అండీ. వేదన వ్యంగ్యం బాగా వ్యక్తమయ్యాయి

  • ప్రజాస్వామ్య వ్యవస్థలో రాజకీయం పరిచిన పన్నాగ ముసుగు.. ఎన్ని విచిత్రాలకైనా ఎగబడుతుంది.వల విసిరినవాడే.. చివరకు ఏదో ఒకరోజు .. ఓటర్ల గేలానికి చిక్కకపోడు.. అప్పటిదాకే.. ఈ పద్మవ్యూహం.. ఆ తర్వాత.. శూన్యమవుతుంది.. ఈ పదవీ వ్యామోహం..

Categories

Your Header Sidebar area is currently empty. Hurry up and add some widgets.