నన్నే వెతుక్కుంటూ

ఈవినింగ్ వాక్ చేసి ఇంటికి వచ్చేసరికి బయట ఆరుగురు మనుషులు. కొంచెం తెలిసీ తెలియనట్లు ఉన్నారు. వీళ్ళ వేషాలు చూస్తుంటే వాళ్ళంతా నా కోసమేవేచి ఉన్నట్లుగా ఉన్నారు. ఖాకీ యూనిఫాం వేసుకున్న ఒక వ్యక్తి అప్పుడే ఆటో ఆపి దిగి నా దగ్గరకు వచ్చాడు. ‘నమస్తే సార్’ అంటూ. ‘ఏం కావాలి? ఎవరుమీరంతా?’ అని అడిగాను.

‘నువ్వు చేసిన ద్రోహానికి బలైన వాళ్ళం.’అన్నారంతా కోరస్ గా. ‘నేనా? ద్రోహం ఏం చేశాను? నేనేం చిట్ ఫండ్ కానీ ఫైనాన్స్ కంపెనీ గాని పెట్టి మిమ్మల్ని అందరినీ మోసం చేయలేదు. అసలు మీరంతా ఎవరో కూడా నాకు తెలియదు.’ అన్నాను. ‘నా పేరు ఆటో కుమార్. చిన్నదాని కాలేజీ ఫీజు కట్టాలని’ పెద్దాడికిబర్త్డే గిఫ్ట్ గా సెల్ ఫోన్ కొనాలని అనుకుంటే నువ్వు ఏం చేశావు? లారీ కేసి ఆటో కొట్టించావు. మరి నా ఫ్యామిలీకి నువ్వు డబ్బులు ఇస్తావా చెప్పు?’అన్నాడు. ఒక్కసారిగా ఉలిక్కి పడ్డాను నేను. నేనే రాసిన ‘రిస్క్’ కథలోని ఆటో కుమారేమో అనుకున్నా. అయినా ఇలా ఎలాగా? అనుకున్నంత లో ఒక బామ్మ ‘అబ్బాయి నేను సమోసా తినకుండానే చంపేస్తావా? ఏం ధర్మం నీది?’ అంది.

నా ఆలోచనంతా ‘వీళ్లంతా ఎలా బయటకు వచ్చి కూర్చున్నారు? ఎక్కడ పోగయ్యారు?’ అనే. పక్కనే గడ్డం రుద్దుకుంటూ ఒకతను నిలబడ్డాడు. ‘నువ్వు..?’అనగానే ‘నేను మునిస్వామిని లెండి. నేనేమీ దోషిని కాదు. నా విషయంలో మీరు ఏం చేయలేదు. మున్సిపాలిటీ రోడ్ల గురించి, నా భార్య అమాయకత్వంగురించి సరిగ్గానే చెప్పారు లేండి.’ అన్నాడు. ‘హమ్మ బ్రతికి పోయాను’ అనుకుంటుండగా, ఓ ముసలామె లేచి నుంచుంది. ‘నువ్వెవరమ్మా?’ అంటే నీ‘ఊరేగింపు దేవత’ లో కాశవ్వని బాబు. మా బూషిగాడి తన్నుల నుంచి కాపాడతావ్ అనుకుంటే, మళ్ళీ వాడి కాడికే పంపించావు’ అంది. నేను ‘భర్త వెనకే భార్యకదా’ అన్నాను. ‘ఏం ధర్మం బాబు? పెళ్ళాన్ని తాగి తన్న మని ఏ ధర్మం చెప్పింది?’ అని అంది.

నాకు ఇంకా తికమక గానే ఉంది. ‘వీళ్లంతా ఎలా కలుసుకున్నారు? ఎలా సాధ్యం?’ అని ఆలోచిస్తూనే ఉన్నాను. దూరంగా ఒక టక్ చేసుకున్న వ్యక్తి, అయితే బహుశా ప్రిన్సిపాల్ అయి ఉంటాడు- ‘ఎందుకు సార్ స్టాఫ్ మెంబర్ల ముందు నా పరువు తీశారు’ అంటున్నాడు. ‘నేనేం చేశాను? కలెక్టర్ కదా అలామాట్లాడింది?’ అసహనం గా ఉంది. నాకు చికాకు పెరుగుతోంది. తల తిరుగుతున్నట్లుగా ఉంది. ఇంటి ముందు ఇలాంటి రచ్చ నాకు ఇష్టం లేదు. ‘అవును కానీ నేను జింక్ పైపులు అమ్మడం ఎప్పుడు చూసావు భాయ్?’ అంటున్నాడు ఇంకొకతను. ‘కొంపతీసి నువ్వు ముత్యాలు కాదు కదా’అన్నాను.  ’నేనే ముత్యాలునే’అన్నాడు చాలా రఫ్ గా.

దూరంగా చీకటి మలుపులో ఐదు అడుగుల ఎత్తులో రెండు కళ్లు మెరుస్తూన్నై. ఉలిక్కిపడ్డాను. జాగ్రత్తగా మళ్ళీ చూశాను. గజ్జల దండ మెళ్ళో వేసుకున్న పిల్లినిచంకలో పెట్టుకుని అంజి

డాక్టర్ విజయ్ కోగంటి

విజయ్ కోగంటి పేరుతో 1993 నుండి కవితా వ్యాసంగం. అనేక దిన, వార, మాస, పత్రికలు, ఆన్ లైన్ పత్రికలలో ప్రచురణలు. 2012 లో ‘కూలుతున్న ఇల్లు’ కవితకు నవ్య-నాటా బహుమతి. తెలుగు, ఇంగ్లీషుల్లో కవిత, కథారచనతో పాటు అనువాదాలు, సమీక్షలు, సాహిత్య బోధన ప్రధాన వ్యాసంగాలు. ’ఇలా రువ్వుదామా రంగులు’ (2017) మొదటి కవితా సంపుటి. స్వయం ప్రతిపత్తి గల ప్రభుత్వ మహిళా కళాశాలలో ఆంగ్ల శాఖాధ్యక్షుడు
drvijaykoganti@gmail.com

M: 8801823244

2 comments

  • Beautiful Vijay. I don’t know why but it gave me a glimpse of ‘Six Characters in Search of an Author ‘

    • అవును రాహుల్. లూగీ పిరాండలోని చదివినప్పటినుంచీ అలాటి ప్రయోగం చేయాలని కోరిక. థాంక్యూ

Categories

Your Header Sidebar area is currently empty. Hurry up and add some widgets.