శాంతీ ద్రోహం

కొవ్వొత్తులు
వీధుల్లో మెరుస్తున్నాయి
గేటెడ్ కమ్యూనిటీలో
మాతాకీ జై లు వినబడుతున్నాయి

నాలుగురోజుల్లో
అంతా గాఢ నిద్రలో

వాడు మాత్రం
క్షణ క్షణం అప్రమత్తతతో

యుద్ధం చెయ్
మైదాన నినాదం

చచ్చేది మనం కానప్పుడు
ఏ నినాదమైనా ఇవ్వొచ్చు

కత్తుల యుద్దం
తుపాకీ యుద్దం
మరఫిరంగుల యుద్దం
కావిప్పుడు
బాత్ రూంలో బాంబ్ దాల్ సక్తా

శాంతి అనివార్యం
వాడికి మనకి తేడా బయల్పడాలి
భూభాగంలో
గూఢచర్యం ఎటో వెళ్ళింది

రెచ్చగొడితే దేశభక్తి
శాంతి కాంక్షిస్తే ద్రోహం

గిరిప్రసాద్ చెలమల్లు

గిరిప్రసాద్ చెలమల్లు: పుట్టింది సూర్యాపేట 1968 లో. పెరిగింది నాగార్జునసాగర్. ప్రస్తుత నివాసం హైదరాబాద్. విద్య ఇండస్ట్రియల్ ఇంజనీరింగ్ అండ్ మేనేజ్ మెంట్ లో పోస్టుగ్రాడ్యుయేషన్. ఉద్యోగం ప్రైవేట్ ఆర్గనైజేషన్ లో. కవితలు వ్రాస్తుంటారు. వివిధ పత్రికల్లో ప్రచురితం.

Add comment

Categories

Your Header Sidebar area is currently empty. Hurry up and add some widgets.