అయినా నవలోక నిర్మాతలమే!

అక్కగా చెల్లిగా..భార్యగా తల్లిగా..
కొత్తగా పాత్ర మారినా…వ్యధలన్నీ పాతవేగా!
అడుగడుగున ముప్పులతో..కుళ్ళుతున్న శరీరాలు!
అల్లుకున్న ఆశలన్నీ ఆంక్షల గడియారాలు!

శైశవం నుండి చితికి చేరే వరకూ..
కాలం కరాళ సంకెళ్ళలో…నలిగిపోయే…
పరాయి బతుకుల వాళ్ళం!
సంసారమనే కత్తి సాముపై
కుత్తుకలుంచి నృత్యం చేసేవాళ్ళం!

మనసువాకిలి తెరిచేలోపే..
ఊహలపడవ మునుగుతుంటే..
రకరకాలరంగుల్లో..రకరకాలవేషాల్లో..
రక్కసి కోరలచుట్టూ..మట్టుపెట్టిన
మసిపూతలం!
కాలనాగుల బుసలను గుండె గుప్పిట దాచినోళ్ళం!

కాలకంఠునికంటే ముందే.,
కాలకూటం మింగినోళ్ళం!

పగలంతా పరిభ్రమించే…భూగోళం శ్రామికులం!

భూమ్యాకర్షణకు లొంగే…
రాతిరి మర బొమ్మలం!
తరతరాల అంతరాలలో…
తరుముతున్న భయాలకు బెదిరి,
ఎటుచూడాలో ..తెలియక,
ఎటూ….చూడలేక,
నోరిప్పి చెప్పలేక,
నిరంతరమూ..

చెమట చినుకుల్లో…
తడుస్తున్న వాళ్ళం!

అయినా మనం
నవలోకపు నిర్మాతలం!

డాక్టర్ ఉమా గాంధీ

డాక్టర్ ఉమా గాంధీ: కవయిత్రి, రచయిత. ఆంధ్ర యూనివర్సిటీలో చదువుకున్నారు. విశాఖపట్నం జిల్లా భీముని పట్నంలో జన్మించిన ఉమా గాంధీ ప్రస్తుతం శివాజిపాలెం జివిఎంసీ ప్రాథమిక పాఠశాల ప్రధానోపాధ్యాయురాలుగా పని చేస్తున్నారు. చాల కవితలు రాశారు. మంచి ఉపాధ్యాయురాలుగా పలు గౌరవాలు పొందారు.

30 comments

 • నారీ లోకానికి స్ఫూర్తి దాయకం మీ కవితలు​, రచనలు.ఉపాద్యాయురాలుగా విద్యార్థుల కు విద్యాదాత, ఉపాధ్యాయ లోకానికి మార్గ దర్శి.

 • హృదయానికి హత్తుకునేలా, సరళమైన పదాలతో చక్కగా వుంది.అభినందనలు.💐💐💐💐

 • నిస్పృహలతో నలుగుతున్న మహిళా లోకానికి
  ఉ : ఉత్తేజ
  మ : మంత్రం మీ కవితలు

 • Too good….. Kavita chaalaa baagundi umaa…..nee chakkani chukkani ni abhivarninchina abhinetri…..aadhunika kavayitri….neeku women’s day subhaakaankshalu

 • Good evening madam Garu మీ రచన అడవాళ్లు పడుచున్న బాధలు ఇబ్బందులు చాలా సరళంగా వివరించారు.

 • అద్భుతంగా ఉంది మీ కవిత. స్త్రీ ఖచ్చితంగా నవ లోకం నిర్మ్మతే. ఏ పాత్ర లో ఉంటే ఆ పాత్రకు ప్రాణం పోస్తుంది. సమాజంలో మార్పు రావాలి.మనది వేదభూమి. ఎక్కడైతే స్త్త్రీలు పూజింప బడతారో అక్కడ దేవలు పూజింప బడతారు. సమాజంలో మార్పు రావాలని కోరుతూ……….రమణమూర్తి m.v

 • డాక్టర్ ఉమా గాంధీ గారు గొప్ప రచయిత్రి. వారి పెన్నుకీ రెండు వైపులా పదునే. ఎలాంటి భావాన్నైనా మంచి కవితారూపంలో మన ముందు ఆవిష్కరించగలరు. వారు త్వరలో వెలువరించే రాధామాధవీయం గేయసంపుటి కోసం ఎదురుచూస్తున్నాం.
  పల్లి నల్లనయ్య

 • మీ ప్రతీ కవిత చూసి మరియు చదివి చాలా ఆనందించి ఆస్వాదిస్తాం. మీ కవితలు భావి భారత తరాలకు స్ఫూర్తి దాయకం మరియు భావ వ్యక్తీకరణ సందేశములు. మానవ జీవితం ఒక రంగుల మయం.ఈ రంగుల ప్రపంచంలో అత్యధిక సంఖ్యలో ప్రజలు అందరూ కాలానుగుణంగా నడవాలని ప్రయత్నిస్తుంటారు.

  ఈ రంగుల ప్రపంచంలో, మీరు స్త్రీ జాతికి ఒక స్పూర్తితో మరియు మీ కవితలతో ఉద్యమిస్తున్నారు..

  మీరు ఇలాంటి కవితా సందేశాలతో మరిన్నీ సందేశాత్మక కవితలు మీ నుండి వెలువడతాయని కోరుకొంటూ….

  మీ,

 • మీ ప్రతీ కవిత చూసి మరియు చదివి చాలా ఆనందించి ఆస్వాదిస్తాం. మీ కవితలు భావి భారత తరాలకు స్ఫూర్తి దాయకం మరియు భావ వ్యక్తీకరణ సందేశములు. మానవ జీవితం ఒక రంగుల మయం.ఈ రంగుల ప్రపంచంలో అత్యధిక సంఖ్యలో ప్రజలు అందరూ కాలానుగుణంగా నడవాలని ప్రయత్నిస్తుంటారు.

  ఈ రంగుల ప్రపంచంలో, మీరు స్త్రీ జాతికి ఒక స్పూర్తితో మరియు మీ కవితలతో ఉద్యమిస్తున్నారు..

  మీరు ఇలాంటి కవితా సందేశాలతో మరిన్నీ సందేశాత్మక కవితలు మీ నుండి వెలువడతాయని కోరుకొంటూ….

  మీ,

 • “చెమట చినుకుల్లో…
  తడుస్తున్న వాళ్ళం!

  అయినా మనం
  నవలోకపు నిర్మాతలం!”

  నిజమే . బాగారాసారు

 • మీ కవిత్వం ఆద్యంతం హృదయానికి హత్తుకునేట్టు,మహిళ లోకాన్ని తట్టిలేపి,మీ సరళమైన పదాలతో పధ నిర్దేశనం చేసేట్టు,భావోద్వేగాలని,నవ భారత నిర్మాణానికి పురికొల్పేటట్టు, విద్యార్థి లోకానికి ,స్ఫూ ర్తి ప్రదాత అయి ,దిశా నిర్దేశనం చేసేట్టు,కవ కవితా లోకకాన్ని రంజింపచేసేట్టు,అన్నిటికీ మించి,పుక్కిపోయిన పురుషాహంకార భావ జాలాగ్ని పై విరుచుకుకు పడిన ఉప్పెన లాగా మారి,మానవతా విలువల్నిఅవపోసన పట్టించేటట్టు, ప్రేమమృత సొరభాల ,నిత్య నూతన ప్రపంచం వైపు పరుగులు తీయించేట్టు, ఉంది.ఇంకా ఏమి చెప్పమంటారు.?ధన్య వాదాలు.

 • బాగుంది చాలా…మహిళ జీవితాన్ని కళ్ళకు కట్టినట్లు గా కవిత్వంతో ముందుంచిన అభివ్యక్తి‌…అభినందనలు..
  👏👏👏👏👏👏

Categories

Your Header Sidebar area is currently empty. Hurry up and add some widgets.