బొమ్మలు

ఒక సాయంత్రం
నన్ను టీ తాగుతూఉంది

పక్కనే ఇద్దరు సీనియర్ సిటిజెన్లు
ఈ సమాజం మారదని
రోడ్డు మీద ఊశారు

వాహనాల బరువుతో
నడుం వంగిన రోడ్డు
ఊతకర్ర కోసం చూస్తోంది

పిల్లల్ని మోసుకెళ్లి
ఇంటికి చేరుస్తున్న స్కూలు వ్యాన్
కిటికీలోంచి
తొంగి చూస్తున్న పసికంట్లో
రేపటి ఉదయపు దిగులు
ఆడుకుంటోంది

టీవీ లో
మంత్రివర్గ సమావేశం వివరాలు
రొమ్మువిరుచుకుంటున్నాయి

పోతున్న ప్రాణాలను
హడావిడిగా మోసుకెళ్తున్న
అంబులెన్స్ అరుపు చెవుల్ని పిండుతోంది

కూరగాయల ధరలు మండుతున్నాయని
ఒకాయన ఉడికి పోతున్నాడు
గిట్టుబాటు ధర లేదని
ఒక రైతు వేదన తో తగలబడుతున్నాడు

సూర్యుడు బాధ గా వెళ్లి పోతున్నాడు

గిన్నె లో టీ మరుగుతోంది
బోర్లించిన
గ్లాసు నిండా బొమ్మలు
ఆడుతున్నాయ్.

సుంకర‍ గోపాలయ్య

సుంకర గోపాలయ్య: కాకినాడ, పిఠాపురం రాజా కళాశాలో తెలుగు శాఖాధిప‍తి. సొంత ఊరు నెల్లూరు. రాధేయ కవిత పురస్కార నిర్వాహకులు. కొన్ని పిల్లల కవితా సంకలనాలకు సంపాదకత్వం వహించారు.

29 comments

 • చాలా చాలా అద్భుతంగా వుంది కవిత………. సమాజం ని ఉద్దెశించి మీ రచన అమోఘం………… మీరు మరెన్నో రాయాలని కోరుకుంటున్నాము……….

 • వాహనాల బరువు తో నడుం వంగిన రోడ్డు ఊతకర్ర కోసం చూస్తోంది…..సూపర్ సర్ చాలా బాగుంది చాలా చాలా బాగుంది…

 • ‘నన్ను టీ తాగుతూ ఉంది’ అంటూ ప్రారంభించుటలోనే
  ప్రత్యేకత కొట్టొచ్చినట్టు కనిపిస్తుంది …. ప్రాతఃకాలం ప్రత్యేక కవితతో మమ్ములను అలరించిన సుంకర గోపాలయ్య గారికి హృదయపూర్వక కృతజ్ఞతలు

  అల్లాడి వేణుగోపాల్

 • బాగుంది..సమాజ దర్పణం అనేలా కవి ఉన్నట్లు వుంది

 • నిజమే మిత్రమా మనం ఎంత యాంత్రికంగా మారం అంటే మన కంటి ముందు అన్నీ కనిపిస్తుంటాయి.కానీ అవి అన్నీ మన ముందు సజీవ చిత్రాలు అయిన రోజు సార్థకత .ఒక వైపు ధరల మండుతున్నాయి మరోవైపు రైతుకు గిట్టు బాటు ధర లేదు ఈ రెండు సందర్భాల నడుమ ప్రభుత్వం విఫలం అయింది
  మంచి కవిత మిత్రమా

 • స్కూలు వ్యాను కిటీకీ లోనుండి చూసే పిల్లవాడి కళ్ళ లో దిగులు పదప్రయోగం బాగుంది సర్ !రహదారి నేపధ్యంలో సాగిన అదమైన కవిత గోపాల్ సర్ !

 • మీ కైత అద్భుతమని నా చెవులు గుసగుసలాడుతున్నాయి

 • నిత్యా. జీవితాన్ని నూతన కోణంలో ఎలా చూడాలో బాగా చపరు సార్ .

 • తొంగిచూస్తున్న పసికంట్లో రేపటి దిగులు..బాగారసారు..

 • చాలా బాగుంది అన్నా కవిత..
  వాహనాల బరువు తో నడుం వంగిన రోడ్డు ఊతకర్ర కోసం చూస్తోంది

 • సాయం సమస్యల్లాంటివే ఈ సాయంత్రం బొమ్మలు కూడా… గిన్నెలో మరిగే టీలా!

Categories

Your Header Sidebar area is currently empty. Hurry up and add some widgets.