అందరూ పడుకున్నాక నిమ్మలంగా లేచి,
చీకట్లో కూర్చొని కవిత రాయడమంటే భలే ఇష్టం నాకు
పొద్దుగాల అది తిరిగి చదువుకున్నప్పుడు ఎంత ఆనందమేసేదో
(మూడు నెలల తర్వాత)
అందరూ ఇంకా పూర్తిగా పడుకోకముందు,
వాళ్ళ వాళ్ళ జీవితాల్లోకి జారుకొని పరీక్షించుకునేప్పుడు
నిమ్మలంగా లేచి పక్క గదిలో చీకట్లో కూర్చొని రాసుకుంటుంటే
ఎవరైనా వచ్చి లైట్లు వేసి కళాకారుడంటే వీడేరా అనట్టుగా చూడడం భలే ఇష్టం నాకు
అలా చూస్తూ “రేయ్ మేధావి! ఇలా బయపెడ్తావేంట్రా!” అన్నప్పుడు
ఎంత ఆనందమేసేదో
(రెండు నెలల తర్వాత)
అందరూ పడుకొని పూర్తిగా నిద్రపోయిన తర్వాత,
నిమ్మలంగా లేచి పక్క గదిలో నిద్రపోతూ.. పాదాలు,గజ్జల చప్పుళ్ళు
వినగానే లేచి పక్కనున్న పుస్తకంలో రాస్తూ వాళ్ళని పిచ్చోల్లని చేయడం భలే ఇష్టం నాకు
వాళ్ళు చూసి “రేయ్ పిచ్చోడా! చీకట్లో కూర్చొని రాస్తావేంట్రా” అన్నప్పుడు నవ్వొచ్చేది,
ఎంతో ఆనందమేసేది
(ఒక నెల తర్వాత)
అందరూ పడుకున్నాక పక్క గదిలో చీకట్లో కూర్చొని
ఎదో రాస్తూ పక్కనున్న బాటల్,పెన్నుని చప్పుడయ్యేలా ఎత్తేసినప్పుడు
నా మీద నాకే విరక్తి కలిగేది,అయినా అలా చేయడం మానలేను
ఎవరైనా వచ్చి లైటు వేసి “రేయ్ సోంబేరి నీ కతలన్నీ తెలుసు మూసుకొని పడుకో” అన్నప్పుడు
ఎలా ఫీల్ అవ్వాలో తెలిసేది కాదు.
బిత్తిరి ముఖం వేసుకొని చెట్టు చూసి ‘వీడు రాత్రికి చావాలి’ అని అనుకునేవాడ్ని.
In the last verse it is “చుట్టూ” not “చెట్టు”