లేఖ

ప్రియాతి ప్రియమైన
పూజ్యులైన
శ్రీయుత గౌరవనీయులైన
సంబోధనతో మొదలయ్యే
ఆప్యాయతాక్షరాలతో  కూడిన వాక్యాల
పరంపర
ఆద్యంతం మళ్ళీ మళ్ళీ
చదువుకోవాలన్పిస్తుంది

ఆరాటపడే మనసు లోంచి
ఉద్భవించే అక్షరాలు
కలంలోంచి కాలంలోకి
ప్రవహిస్తూ
ఎదుటిమనసుని తాకుతుంది

ప్రేమయో
బాధ్యతయో
హెచ్చరికయో
సందేశమో
సంశయమే లేకుండా
ఆ దరికి చేర్చగల శక్తి

దూరం ఎంతైనా
దగ్గరయ్యే
దారి చూపగలిగే దిక్సూచి

పేరా
పేరా పేర్చి
కూర్చి
బంధాలు బాంధవ్యాలు
నిలపగలిగే వంతెన

సమస్య
సంగతేంటో తేల్చే
వారధి

మారుమూలలో
దోపిడీని
ఎండగట్టే దిశగా
అక్షర రూపకల్పన హేతువుతో
విశదీకరణ
ఉద్యమ నిర్మాణ క్రియాశీల కార్యకర్త

గిరిప్రసాద్ చెలమల్లు

గిరిప్రసాద్ చెలమల్లు: పుట్టింది సూర్యాపేట 1968 లో. పెరిగింది నాగార్జునసాగర్. ప్రస్తుత నివాసం హైదరాబాద్. విద్య ఇండస్ట్రియల్ ఇంజనీరింగ్ అండ్ మేనేజ్ మెంట్ లో పోస్టుగ్రాడ్యుయేషన్. ఉద్యోగం ప్రైవేట్ ఆర్గనైజేషన్ లో. కవితలు వ్రాస్తుంటారు. వివిధ పత్రికల్లో ప్రచురితం.

Add comment

Categories

Your Header Sidebar area is currently empty. Hurry up and add some widgets.