ఆగని పాట

రెండు పారాసెటమాల్ ఇవ్వండిఅంటుండగాఆరు టాబ్లెట్లుప్రిస్క్రిప్షన్ ఇస్తూ అడుగుతోంది ఆవిడ.

ఎక్కడో బాగా పరిచయమైన గొంతుక! పక్కకి తిరిగి చూశాను. నా చెయ్యి పట్టుకున్న పాపను చూస్తూ నవ్వుతోంది. నెరిసిన చెంపలు. ముడతలు పడ్డ పెద్ద కాటుక కళ్ళు. స్టిక్కర్ పెట్టుకున్న నిర్మలమైన ముఖంపొడవైన కాయ పారు మనిషి. యాభై ఏళ్ళు దాటి ఉండవచ్చు. ముఖం బాగా తెలిసినట్లు అనిపిస్తోందిఅవునుఆమే.

బాగున్నారా, మీరు రుక్మిణీ మేడమ్ కదా?’

అవునుమీరు?…’ అంటూ నా ముఖం లోకి చూస్తూ గుర్తు పట్టినట్టుగానువ్వే, నువ్వే కదా? ఎంతపెద్దవాడివయ్యావు? మీ పాపనా?’

అవునన్నాను. ‘ఏం పేరుఅంటూ ముద్దు చేసింది. ఆమెలో అదే ఉత్సాహం, అదే సహనం. ఆశ్చర్యం అనిపించింది.

వెంకట్రావు గారు బాగున్నారా?’ అనగానేఇంకెక్కడి వెంకట్రావు? తాగి తాగి పోయాడు.’ నవ్వుతూనేచెప్పింది.

అయ్యో యిల్లేనా?’అన్నాను.

లేదు. ప్రస్తుతం అద్దె ఇల్లు. వెంకట్రావు  ఇంటి బంధం కూడా తెంచి పోయాడు.’ అంది.

కస్టమర్స్ ఎక్కువవడంతో పక్కకి నడిచి అక్కడ ఉన్న బల్ల మీద కూర్చున్నాం.

మీకు కష్టం కదా? ఇప్పుడు ఎక్కడ మీ జాబ్?’ అన్నా. ‘ఇక్కడే ఐదేళ్ల నుంచి. ఇక్కడి బ్యాంకులోనే.’

పెద్దాడు కోడలు స్టేట్స్ వెళ్లిపోయారు. ఐదేళ్లకు ఒకసారి వస్తారు. అప్పుడప్పుడు డబ్బులు పంపుతారు వాళ్ళకో ఇల్లు కొని పెట్టమని.’ అని వేదాంతిలాగా నవ్వింది.

మీ చిన్నబ్బాయి సూర్యం?’ అన్నాను. ‘వాడూ అంతే. వాళ్ళ నాన్న లాగే! యాక్సిడెంట్ లో కాలు విరిగిందిమంచాన పడ్డాడు.’

పెళ్ళీ అదీ…’ అంటే, ‘లేదు. వాడి తాగుడుకు తిరుగుళ్లకు నాలాగే ఇంకో ఆడది బలి కాకూడదని నేనే చేయలేదు.’ అంటూ పాపను దగ్గరికి తీసుకుని నాతోఏం ఉద్యోగం చేస్తున్నావ్?’ అంది.

లెక్చరర్ గా ఇక్కడే’.

‘దాదాపు పాతికేళ్ళయింది కదూ నిన్ను చూసి. బుద్ధిమంతుడిలా చదువుకునే వాడివి. మా ఇంటి పైన నీకు అద్దెకిచ్చిన రూము చూసినప్పుడల్లా గుర్తొస్తావు. నీ లాంటి కొడుకుంటే ఎంత బాగుండేది?’ అంది.

ఆమె అభిమానాన్ని ప్రత్యక్షంగా చూసిన నాకు కళ్ళ నీళ్ళు తిరిగాయి. ‘అవును, మీ వంటింటి నేస్తం ఎలాఉంది?’ అన్నాను నవ్వుతూ.

సారి నా వైపు ప్రశ్నార్థకంగా చూసింది. వెంటనే పక్కుమని నవ్వి అదా, నా రేడియోనా? దానికి నాలాగే బుద్ధి లేదు. ఎన్ని సార్లు కింద పడినా నాలా వాగుతూ పాడుతూనే ఉంటుంది.’ ఇద్దరం కాసేపునవ్వుకున్నాం.

పాపని జాగ్రత్తగా పెంచు. భూమిలాగా జీవితపు బరువంతా మోయాల్సింది మేమే.’ నవ్వుతూ లేచినిలబడింది. ‘నిన్ను కలవడం చాలా సంతోషం , ఓసారి మీ ఆవిడని తీసుకొని రాఅంటూ షేక్ హాండ్ ఇచ్చివెళ్లిపోయింది నడి సముద్రంలో ఎన్ని తుపానులు వచ్చినా భయపడని నావ లాగా…!

డాక్టర్ విజయ్ కోగంటి

విజయ్ కోగంటి పేరుతో 1993 నుండి కవితా వ్యాసంగం. అనేక దిన, వార, మాస, పత్రికలు, ఆన్ లైన్ పత్రికలలో ప్రచురణలు. 2012 లో ‘కూలుతున్న ఇల్లు’ కవితకు నవ్య-నాటా బహుమతి. తెలుగు, ఇంగ్లీషుల్లో కవిత, కథారచనతో పాటు అనువాదాలు, సమీక్షలు, సాహిత్య బోధన ప్రధాన వ్యాసంగాలు. ’ఇలా రువ్వుదామా రంగులు’ (2017) మొదటి కవితా సంపుటి. స్వయం ప్రతిపత్తి గల ప్రభుత్వ మహిళా కళాశాలలో ఆంగ్ల శాఖాధ్యక్షుడు
drvijaykoganti@gmail.com

M: 8801823244

2 comments

  • కవిత్వం లాగా అర్థం చేసుకోవల్సినదంతా రాయకుండా వదిలేసి రాసిన సుపరిచిత జీవితాన్ని సింపుల్ గా బలే రాసారు. ఈ టెక్నిక్ అద్భుతంగా ఉంది

Categories

Your Header Sidebar area is currently empty. Hurry up and add some widgets.