మతం

మనిషి నిద్రపోయాడు
నిద్దట్లో నడుస్తున్నాడు
జీవన చక్రంలో
ఉరుకులుపరుగులు

మనిషి వెంట
అనునిత్యం వెంటాడుతూ
అవకాశం కోసం
ఆబగా నిరీక్షిస్తుంది

అదొక మత్తు
అలా అలా పాకేస్తుంది
నరనరాన
జీర్ణక్రియలో
వేగం
త్వరణం రెట్టింపు

అందరూ
దాన్ని గ్రంథాల్లో
సారం ఒంటబట్టించుకోరు
సారాన్ని
ఉన్మాదానికి
అన్వయించుకుని
పయనం ఎగుడుదిగుడు దారుల్లో

చివరికి మరణం
చంపో చంపబడో
తెలీని మౌలిక సూత్రాల్లో
మౌనం రాజ్యమేలుతుంటే
శ్మశానమే ముంగిట

గిరిప్రసాద్ చెలమల్లు

గిరిప్రసాద్ చెలమల్లు: పుట్టింది సూర్యాపేట 1968 లో. పెరిగింది నాగార్జునసాగర్. ప్రస్తుత నివాసం హైదరాబాద్. విద్య ఇండస్ట్రియల్ ఇంజనీరింగ్ అండ్ మేనేజ్ మెంట్ లో పోస్టుగ్రాడ్యుయేషన్. ఉద్యోగం ప్రైవేట్ ఆర్గనైజేషన్ లో. కవితలు వ్రాస్తుంటారు. వివిధ పత్రికల్లో ప్రచురితం.

Add comment

ఇటీవలి వ్యాఖ్యలు

Categories

Your Header Sidebar area is currently empty. Hurry up and add some widgets.