‘ఆంధ్రప్రదేశ్ కార్పొరేషన్
ఆఫ్ ఇండియా లిమిటెడ్’

ఇది ప్ర’జల’భాగస్వామ్యం తో
నడపబడుచున్న ఏకైక కంపెనీ
ప్రజలందరూ ఈక్విటీ వాటాదారులు
ఎమ్మెల్యేలు అధీకృతులు
అధినేత సీఈఓ
ప్రస్తుతం డిబెంచరుల విడుదల చేయుచున్నది
భూమి పెట్టుబడి గా
మున్నెన్నడూ లేని భారీ లాభములు కూర్చుకొను
ఏకైక కంపెనీ
తన ఆస్తి అప్పుల పట్టీని త్వరలో ప్రకటించును
(సీబీఎన్-ఆంధ్ర ఖ్యాతి, ఏనాడు లలో తదుపరి అన్నిదేశవాళీ పత్రికలలో చూడవచ్చును)
దీని బ్రాంచీలు వేరే రాష్ట్రములలోకూడా వ్యాపించి
ఇప్పుడు జాతీయ కంపెనీ గా నమోదు చేసుకొన్నది
వ్యాపారాజకీయం లక్ష్యంగా పనిచేస్తున్న అగ్రగామిసంస్థ
అంబేద్కర్ చెప్పని రాజ్యాంగాన్ని కనిపెట్టి
అమలు పరుస్తున్న దమ్మున్న సంస్థ
దీని డివిడెండ్లు అంతర్జాలమార్జాల ప్రముఖులకు, విదేశీ సంస్థలకు
అందుబాటులో నుండును

(ఇది కేవలము కంపెనీ విదేశీత్వబాహుళ్యము ప్రకటించుటయే కాని వేరుకాదు. సందేహాస్పదులకు సమాధానములు transparency అనబరగు వేరు స్థలము లో వేరు రేట్లకు ఉచితముగా లభించును.)

ఏవిధముగానైననూ లాభములు బడయుట దీని ప్రత్యేకత
దీని బ్రేక్-ఈవెన్ రిపోర్ట్ గమనించిన
దేశములో నున్న అనేక వ్యాపారాజకీయలాభాపేక్ష గల కంపెనీలు
‘అయిదేళ్ళ కుర్చీ’అనే దీని అధీకృత షేర్లను
కోట్ల ముఖవిలువకు కొనుగోలుచేయ తహతహలాడుచున్నవి
దేశ రాజధాని దీని ప్రభావముచే
‘బుల్’లి తెరపై’బేర్’మనునో
లేక
‘ఆంధ్రప్రదేశ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా లిమిటెడ్’ లిక్విడిటీ ప్రకటించునో
ఎన్నికల వాతావరణ శాఖ కొద్ది దినములలో ప్రకటించును
ఈక్విటీ వాటాదారులారా
కాయో పండో దొరకబుచ్చుకొన క్యూలలో నిలబడుడి
దొరికిన వారికి దొరికినంత భాగ్యము!

పొన్నంగిపల్లి శ్రీనివాస రావ్

1 comment

  • ఏమిటీ కవిత ? ఆర్ధిక శాస్త్రం పరీక్షకు హాజరయ్యే విద్యార్థికి బెత్తం పట్టుకుని చెప్తున్న పాఠం లా లేదూ ? ఇక మేష్టారి సంగతి నన్నడగొద్దు..ఆయన తెలుగులో నవ్వుతాడు. నవ్విస్తాడు. కవిత్వం కూడానండోయ్….

Categories

Your Header Sidebar area is currently empty. Hurry up and add some widgets.