పాతకొత్తల మేలుకలయిక…

“Poetry analysis is the process of investigating a poem’s form, content, structural semiotics and history in an informed way, with the aim of heightening one’s own and others’ understanding and appreciation of the work… “

ఈ శీర్షిక రాయడానికి ముందు చాలా చర్చే చేశారు హెచ్చార్కె. ప్రాచీన, ముందు తరం కవుల కవిత్వం తో, ఆధునిక కవుల కవిత్వాన్ని పోల్చి చర్చించాల్సిన అవసరం పై మాట్లాడుకున్నాము. ఈ తరహా వ్యాసాలు  ఎంతవరకు అవసరం? ఎలా ప్రెజెంట్ చేయాలి? ఎంత లోతుగా అధ్యయనం చేయాలి?ఆధునిక కవులు తీసుకొంటున్న వస్తువు ను పోలిన వస్తువును ముందు తరాల వాళ్ళు కానీ, ప్రాచీన కవులు కానీ వాటిని ముట్టుకున్నారా?  అనే విషయాలపై చర్చించడానికి నాకు పూర్తి స్వేచ్ఛను ఇచ్చారు. విస్తృతమైన విషయమనీ,చాల అధ్యయనం అవసరమని ఇద్దరం అనుకొన్నాం. ఈ విధమైన కంపేరేటివ్ స్టడీ వ్యాసాలు, ముందు తరాల కవులకు అవసరం. ఈ శీర్షిక ద్వారా ఒక రకంగా కవిత్వపు లక్షణాలను మరింత లోతుగా నాతో పాటు, పాఠకులకు కూడా అధ్యయనం చేసి,చేయించే  యోచన. నా ఈ తొలి ప్రయత్నం అందరికీ చేరువవుతుందని ఆశిస్తున్నాను.

గ్రీకు ట్రాజెడీ లను పరిశీలించి అరిస్టాటిల్  వాటి లక్షణాలను చెప్పడం, లిరికల్ బాల్లడ్స్ పైన వర్డ్స్ వర్త్ పీఠిక రాయడం తో సాహిత్య విమర్శ, సాహిత్య లక్షణాలను విశ్లేషించడం అనే ప్రక్రియ విదేశీ సాహిత్యం లో మొదలైంది. తెలుగు లో మాత్రం నన్నయ్య శకం నుండి ఈ రకమైన విశ్లేషణ, పరిశీలన అములులోకి వచ్చాయి.

కవిత్వాన్ని పరిశీలించడానికి, అధ్యయనం చేయడానికి, కంపేరేటివ్ స్టడీ చేయడానికి, కాలాన్ని బట్టి, నన్నయ్య ముందు నుండి 17 వ శతాబ్దం వరకు ఉన్న కవులను ప్రాచీన కవులని, గురుజాడ ముందు నుంచి 1980 వరకు ఆధునిక తొలి తరం కవులని, 1980 నుండి ఇప్పటి వరకు ఆధునిక మలి తరం వర్ధమాన కవులు అని మూడు రకాలుగా పరిగణనలోకి తీసుకోవాలని భావించాను. పై మూడు తరాల్లో ఒక్కో తరం కవిత్వాన్ని ఒక్కో రకంగా అర్థం చేసుకొన్నా, ఆయా కాలాల నాటి అలంకారికులు ఒక్కో రకంగా అర్థాన్ని చెపుతూ వచ్చారు. కానీ,ఆధునిక కవులు అభివ్యక్తి వేరు, వాళ్ళు కవిత చుట్టూ అల్లే సంవిధానం భిన్నంగా ఉంది. సాహిత్యం ప్రయోజనాన్ని ఆశించేదిగా ఉండాలను కొంటున్నారు. ప్రాచీన కాల కవులు భౌతిక జగత్తు కంటే, కవి అంతర్ లోక అనుభవాలకు ప్రాధాన్యత నిస్తూ వచ్చారు. ఆధునిక కవులు మాత్రం, అందుకు భిన్నంగా, బహిర్ జగత్తు కు చెందిన లౌకిక తత్వం, హిత చింతన ప్రధానంగా భావిస్తున్నారు. రాజరికపు పంచన పడిన కవిత్వం, రాను రాను ప్రజల మధ్య నేరుగా చేరి,వారిలో ఒకటవుతూ వచ్చింది.  నిరంకుశ రాజరిక అహంకారాన్ని, అక్షరాలతో నలిపేస్తూ, సమాజాన్ని చైతన్య పరుస్తూ తమ సాహిత్యాన్ని అందించారు.

ఈ శీర్షిక లో ప్రత్యేకత: ఒకే అంశాన్ని ప్రాచీన కవులు ఎలా వర్ణించారు? తొలి తరం ఆధునిక కవులు ఎలా చెప్పుకొచ్చారు? ప్రస్తుత మలితరం ఆధునిక కవులు ఎలా వ్యక్తీకరిస్తునారు? అన్న దిశగా ఈ శీర్షిక కొనసాగించాలని భావించాం. ఈ విషయం చెప్పగానే,హెచ్చార్కె గారు ఈ శీర్షిక కు “పువ్వులు –మొగ్గలు “ అనే టైటిల్ సూచించారు. ఆ క్రమం లో ఇవాళ మొదటగా….ఆయా కాలాల్లో కవులు”సమాజ చైతన్య ధోరణులు”  అనే అంశం పై ఏ శైలి లో, ఏ వస్తువు ప్రాధాన్యతగా రాసారు? ఎలాంటి అభివ్యక్తి తో చెపుతూ వచ్చారు? ఈ రూపం లో ఎంత తీవ్రత చూపుతూ వచ్చారని రాస్తున్నాను. విశేషమైన విస్తృతి ఉన్న ఈ విషయం పైన నా ఈ రచనను చదివి అభిప్రాయాలు చెపుతారని భావిస్తున్నాను. ఒకే అంశాన్ని, అంటే.. ఉద్యమాత్మక అస్తిత్వ వాదాలు, భావ కవిత్వం, దళిత వాదం,స్త్రీ వాదం, మైనారిటీ వాదం, సమాజ చైతన్య ధోరణులు, భాషా ఉద్యమం, ఇలాంటి ఎన్నో అంశాలపై,…..  నన్నయ్య ముందు నుండి ఆ తర్వాతా.. ఇప్పటివరకూ.. జంధ్యాల పాపయ్య శాస్త్రి,జాషువా, తిలక్, కాళోజి, శేషేంద్ర శర్మ, నాయని సుబ్బారావు, అనంత సోమ సుందర్, దాశరధి, శ్రీ శ్రీ, శివ సాగర్,  వరవరరావు, అనామధేయుడు, మో, అజంతా, డా.సి. నారాయణరెడ్డి, కె.వి. రమణారెడ్డి,సావిత్రి, రేవతి దేవి, నగ్నముని, నిఖిలేశ్వర్, దేవీప్రియ, హెచ్చార్కే, శివారెడ్డి, కుందుర్తి, బోయి. భీమన్న, పురిపండా, రెంటాల, శిష్టా, పఠాభి, చెరబండరాజు, జ్వాలా ముఖి, భైరవయ్య, ఓల్గా, జయప్రభ, కొండేపూడి నిర్మల, ఎస్. జయ, పాటిబండ్ల రజని, కొలకులూరి ఇనాక్, జయధీర్ తిరుమల రావు, ఖాజా, శిఖామణి, సిద్దార్థ, ఎండ్లూరి సుధాకర్, వాడ్రేవు చిన వీర భద్రుడు, వాడ్రేవు వీరలక్ష్మి దేవి, పాపినేని శివశంకర్, లక్ష్మీనరసయ్య గుంటూరు, త్రిపురనేని శ్రీనివాస్, మద్దూరి నగేష్ బాబు, పైడి తెరేష్ బాబు, కృష్ణుడు, అద్దేపల్లి ప్రభు, అఫ్సర్, యాకూబ్, నారాయణ స్వామి వెంకట యోగి, వంశీకృష్ణ, సురేంద్ర రాజు అంబటి, వజ్ఝల శివకుమార్, కాంతి నల్లూరి, బొల్లోజు బాబా, శివలంక రాజేశ్వరి దేవి, శిలాలోలిత, తెన్నేటి సూరి, శ్రీదివ్య శివకుమార్, కుప్పిలి పద్మ, క్రాంతి శ్రీనివాసరావు, ప్రసేన్, సీతారాం, శిఖామణి, జ్యోతి పాలకుర్తి,జ్వలిత దెంచనాల, ఇందిరా భైరి, బసవరాజు వేణుగోపాల్, అబ్దుల్ రజాహుస్సేన్, అరణ్య కృష్ణ, వంశీ క్రిష్ణ, అరుణ్ సాగర్, ఆశారాజు, అవని శ్రీ సురేష్, పల్లి పట్టు, వనపట్ల సుబ్బయ్య, హరిహర, వాహెద్ అబ్దుల్ ,షాజహానా, స్కై బాబా, బండారి రాజ్ కుమార్, పుష్యమి సాగర్, తండ్ల హరీష్ గౌడ్, బండ్ల మాధవరావు, పాయల మురళీ కృష్ణ, దేవయ్య, ఇజ్రా శాస్త్రి, గాజోజు నాగభూషణం, కరీముల్లా, కుతుబుద్దీన్ సయ్యద్, గిరిప్రసాద్ చెల్లమలు, శ్రీరామోజు హరగోపాల్,జగద్ధాత్రి, శ్రీనివాస్ వాసుదేవ్, జ్యోతి కాంచి, జ్యోతి నండూరి,వైష్ణవి శ్రీ, స్వప్న మేకల, రామసుబ్బమ్మ, కార్తీక రాజు,సొన్నాయిల కృష్ణవేణి అనామిక, నిధిశ్రీ, ప్రీతి నోవెలిన్ నోముల, రాదిక కేశవదాసు, లాస్యప్రియ కుప్పా, పుట్టి గిరిధర్, మోహనకృష్ణ అనంతోజు, నాగభూషణం దాసరి, పాషా షేక్, పోర్షియా దేవి, విరించి విరివింటి….   రేణుక అయోల, విజయలక్ష్మి పండిట్, ఇబ్రహీం నిర్గుణ్, గుర్రం సీతారాములు, సుగం కుమార్, కటుకోజ్వల ఆనందా చారి, కటుకోజ్వల రమేష్, నంద కిషోర్, కట్టా శ్రీనివాస్, సిద్దార్థ కట్ట, అరుణాంక్ లతా, ఇండస్ మార్టిన్, కొడిదెల మమత, మునాసు వెంకట్, నారాయణ శర్మ, అరుణ నారద భట్ల, అరుణ గోగులమంద, మెర్సీ మార్గరెట్, శ్రీనివాస్ సూఫీ, నరేష్ కుమార్ సూఫీ, శరత్ చంద్ర, విజయ్ చంద్ర, నాగిళ్ళ రమేష్, షేక్ పీర్ల మహమూద్, తగుళ్ళ గోపాల్, కాశీ రాజు, వనజ తాతినేని, కార్తీక్ నాయక్, అనిల్ డాని, శ్రీరాం పుప్పల, ఫణి మాధవి కన్నోజు, సుభాషిణి తోట, మెట్టా నాగేశ్వర రావు, సరసిజ పెనుగొండ, పెనుగొండ బసవేశ్వర్, అన్వీక్ష నీలం, రాజారం తూముచర్ల, వెంకట కృష్ణ, సి.వి.సురేష్, పెద్దోజు నరేష్, లావణ్య సైదీశ్వర్, మానస చామర్తి, సుధా మోదుగు, జయశ్రీ నాయుడు, సత్యవాణి, ఇస్లామత్ నాయక్, రవీందర్ విలాసాగరం, రజిత కొండసాని, కళ్యాణి కుంజ, కృష్ణ గుగులోత్, యామిని రెడ్డి,పెద్దోజు నరేష్, కాసుల రవి కుమార్, రాజేశ్వరి రామాయణం, గీత వెల్లంకి, ఝాన్సీ, వరుణ శ్రీ, సమ్మెట విజయ, జ్యోతి కందిమళ్ళ, మానస మానస, విల్సన్ కుమార్ రపు, బాల సుధాకర్ మౌళి, పలమనేరు బాలాజీ, లక్ష్మి శ్రీ, నవీన్ కుమార్, లక్ష్మి వసంత, గండికోట వారిజ, ఎజ్రా శాస్త్రి, పల్లి పట్టు, రామస్వామి,అన్నవరం దేవేందర్, కపిల రాం కుమార్, తుల్లుమల్లి విల్సన్ సుధాకర్, నాగరాజు రామస్వామి,రామ్మోహన్ తుమ్మురి, యశస్వి సతీష్, మౌనశ్రి మల్లిక్, పసునూరి రవీందర్, వడ్లకొండ దయాకర్, గట్టు రాధికా మోహన్,రమాదేవి బాలబోయిన, సర్వ మంగళ, కళ్యాణి శాస్త్రి,లీల రెడ్డి, శేషు కొర్లపాటి, నిర్మల నందిగామ, కన్నెగంటి వెంకటయ్య,పోతగాని, బేకారీలు భాస్కర్, నామా పురుషోత్తం, వురిమళ్ళ సునంద, ……ఇంకా అనేక వర్ధమాన రచయతలు, రచయిత్రులు (ఏవైనా కొన్ని పేర్లు మిస్ అయినవి కూడా తర్వాత పరిగణనలోకి తీసుకొని) ఒక్కో అంశాన్ని ఒక్కో కవి ఎలా చెప్తూ వస్తున్నారు? శైలి ఎలాంటిది? వస్తువు ఏమి తీసుకొన్నారు? అనే కోణం లో నాకున్న విస్తృతి మేరకు సాహితీ ప్రియులకు ఒక తులనాత్మక పరిశోధక ఫలితాన్ని అందించాలని భావించాను.

సి వి సురేష్

సి.వి. సురేష్: కడప జిల్లా ప్రొద్దుటూరు స్వగ్రామం. పూర్తి పేరు చెన్నూరు వంకదార సురేష్, వృత్తి రీత్యా న్యాయవాది, కవిత్వం, అనువాదాలు, విశ్లేషణలు రాస్తున్నారు. సాహిత్యాన్ని ఎక్కువగా ప్రేమించే మనస్తత్వం ఉన్న ఈయన తెలుగు కవుల కవిత్వాన్ని ఆంగ్లం లోకి అనువాదం చేస్తున్నారు సురేష్ ఆంధ్ర భూమి, డెక్కన్ క్రానికల్ పత్రిక కు స్టాఫ్ రిపోర్టర్ గా కూడా పని చేసారు.

49 comments

 • అన్నా, పెద్ద పని జేస్తున్నావు. అనితరసాధ్యమైన కృషికి తెర తీస్తున్నావు. అసామాన్య మైన వ్యాస పరంపరకి వీలవగల శీర్షిక. స్వాగతం. సుస్వాగతం.

  ఈ ఇంట్రో లోనే మీ భాష, వాక్య నిర్మాణం, ప్రెసెంటేషన్ చాలా ఫ్రెష్ గా అనిపించింది. దట్ మీన్స్.

  యు ఆర్ రెడీ విత్ బంచ్ ఆఫ్ ఫ్లవర్స్. గుడ్ లక్.

  • చాలా సంతోషం మీ స్పందన కు…I will try my best ఆన్నా…

 • “పాత కొత్త తరాల మేలు కలయిక” ఈ శీర్షిక వర్తమాన కవులకుసాహిత్యాంశాల పరంగా విస్తృత ప్రయోజనం ఇవ్వగలదని ఆరంభ భాగమే భరోసానిస్తోంది. ఈ శీర్షికను ప్రారంభించినందుకు హెచ్చార్కే సర్ కూ.. రస్తా మేగజైన్ కూ ధన్యవాదాలు.
  సురేష్ సర్.. మీ సాహిత్య ప్రయాణంలో మరో సోపానం రస్తా. ఇప్పటికే అనేక శీర్షికలు నిర్వహించటం.. కవిత్వం, అనుసృజనా, విశ్లేషణల ద్వారా మీ సాహితీ కృషి అందరికీ తెలిసిందే. ఆరంభ భాగంలోనే ఇంట్రో గా మీరందించిన సమాచారం ఈ శీర్షిక ఎలా ఉండబోతోంది అనే దానిపై మాలో అంచనాలు పెంచేసింది. చాలా ఆసక్తిని క్రియేట్ చేస్తోంది. పరిశోధనాత్మక వ్యాసాల్లా, ఎన్నో సాహిత్య విశేషాలు మోసుకురాబోతున్నాయి అనిపిస్తోంది. హృదయపూర్వక శుభాకాంక్షలు సర్. 💐తర్వాత భాగాల కోసం శ్రద్ధగా ఎదురుచూస్తాం..

  • మీ అభిప్రాయాలను మీ స్పందన ను ఆమూల్య0గా భావిస్తాను.. ధన్యవాదాలు

 • గొప్ప విందును ప్రకటించారు. ఆస్వాదించేందుకు మేము సిద్దం. రేపటి తరానికి మీరిచ్చే సాహతీవిందు మార్గదర్శకంగా ఆకర్షిస్తుందని ఆశిస్తున్నా

  • ….మీ అత్మీయ ప్రోత్సహానికి ధన్యవాదాలు

 • ఒక బృహత్ కార్యానికి శ్రీకారం చుట్టారు సర్..ఇది సమాజానికి ఎంత ఉపయోగపడుతుందో మాలాంటి వారికి చాలా ఉపయోగపడుతుంది కూడా..ఇంత మంచి ఆలోచన చేసిన హెచ్చార్కే సర్ కి మీకు కృతజ్ఞతలు. ..ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తూ ఉంటాం సర్..అభినందనలు సర్..

 • ఒక మహత్తరమైన బృహత్ కార్యానికి శ్రీకారం చుట్టారు సర్..దీనివల్ల నాలాంటి వారికే కాదు సమాజానికి మేలు జరుగుతుంది..ఇంత మంచి ఆలోచన చేసిన హెచ్చార్కే సర్ కి మీకు కృతజ్ఞతలు..నిర్విఘ్నంగా ఈ శీర్షికను పూర్తిిిిిిిిిిిచెయ్యాలని మనస్పూర్తిగా కోరుకుంటూ అభినందనలు సర్..

  • చాలా స0తోషం మీ. ఆత్మీయ స్పందనకు

 • మొదటగా హార్ధిక శుభాకాంక్షలు సర్..మీ ప్రయాణంలో మరో మైలురాయి..విస్తృత అధ్యయనం అవసరమైన కంటెంట్ ని వ్యవస్థీకృత విధానంలో నిర్వహించబోతున్నారు..మీరు తీసుకున్న సౌకర్యాత్మక విభజన మీ constructive అప్రోచ్ ని చూపుతూ ఆసక్తికరంగా ఉంది..Eager to see the tools you consider to narrate the selected content..l know..This is not simple task to deal but have confidence in your dedicativative efforts..Awaiting for literary feast CV sir..
  Thankyou very much to HRK garu for this interesting task in Rashta..

  • Rajeswari Ramayanam ఎక్సక్టలీ రాజేశ్వరి జీ.. మీరన్నట్లు ఇది డిఫికల్ట్టాస్క్….మీ అత్మీయ ప్రోత్సహానికి ధన్యవాదాలు

 • ముందుగా మీ ఓపికకు హాట్సాఫ్ …మీ కృషికి సలాం..పాత,కొత్త కవులను,సాహిత్యాన్ని ఎంత లోతుగానో అధ్యయనం,పరిశీలన చేస్తే గాని ఇలా రాసేందుకు వీలు కలుగుతుంది…మీ అమూల్యమైన సమయాన్ని ఎంతగానో కేటాయించవలసి వస్తుంది…చాలా పెద్ద పని…దీనికి సహకరిస్తూన్న వి’జయ గారికి నమస్సులు….ఇప్పటికే మన కవిసంగమం మీ అనువాద కవితలు,కవులపరిచయాలు విశ్లేషణలతో ఎంతో పఠనాభిరుచిని పెంచుతోంది..రస్తా అందరికీ చక్కని రస్తా చూపిస్తుందని ఆశిస్తూ…మీకు మరోసారి అభినందనలు..హెచ్చార్కే గారికి నమస్సులు

 • చాలా పెద్ద పనిని చేపట్టిన మీకు హెచ్చార్కె మాస్టర్ కు ముందస్తు అభినందనలు. తర్వాతి తరానికి మీ ఈ పరిశోధన ఎంతో ఉపకరిస్తుంది. ఇప్పటికే సంగం సాహిత్యాన్ని.. సూఫీ కవిత్వసారాన్ని.. తెనుగుఆంగ్ల రచయితల కవిత్వాన్ని అనువదిస్తూ ఇతర భారతీయ భాష ల కవులను మీదైన శైలిలో వర్థమాన కవులకు పరిచయం చేస్తున్నారు. రాసే వారికి ప్రోత్సాహకరం గా కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. మీ బహుముఖీన ప్రతిభ మరియు విస్తార సేవలు తెనుగు సాహిత్యాన్ని మరింత సుసంపన్నం చేస్తాయని ఈ కార్యక్రమంద్వారా మరిన్ని యువ కలాలు పదును తేరతాయని తెనుగు భాష కు అజరామరాత్వం సిధ్ధిస్తుందని సంకల్పం కలుగుతోంది. ఖచ్చితంగా మరిన్ని కవిమొగ్గలు కవయిత్రి పువ్వు లు తమ తమ సౌరభ కవనాలతో ముందుకు వచ్చి మీ తులనాత్మక అధ్యయనానికి పాత్రులౌతారని ఆశిస్తూ .. సర్వేశ్వరుని కృప అపారంగా మీమీద ప్రసరించని ఆశీస్సులు

 • మొదటగా హార్ధిక శుభాకాంక్షలు సర్..మీ ప్రయాణంలో మరో మైలురాయి..విస్తృత అధ్యయనం అవసరమైన కంటెంట్ ని వ్యవస్థీకృత విధానంలో నిర్వహించబోతున్నారు..మీరు తీసుకున్న సౌకర్యాత్మక విభజన మీ constructive అప్రోచ్ ని చూపుతూ ఆసక్తికరంగా ఉంది..Eager to see the tools you consider to narrate the selected content..l know..This is not simple task to deal but have confidence in your dedicative efforts..Awaiting for literary feast CV sir..
  Thankyou very much to HRK garu for this interesting task in Rashta..

 • సురేష్ గారు మొదటగా మీ ధైర్యాన్ని అభినందిస్తున్నాను🙏🙏 మీరు ఎంచుకున్న విషయం “”పాత కొత్తల మేల్కయిక”అన్నది సముద్రాన్ని వడబోయడం లాంటిది. వడబోసి అందులో ఉన్న సమస్త జలచరాల అనాటమి చేసి అందించటం లాంటిది.బ్లూ వేల్ లాంటి అతి పెద్ద జీవం మొదలుకొని మైక్రోస్కోప్ లో మాత్రమే కనిపించే అతి సూక్ష్మ జలచరాల వరకు వివరణ ఇవ్వటం లాంటి బృహత్తర కార్యం. మీ ఈ కార్యం సిద్దిస్తే , మీరు, సమగ్ర ఆంధ్ర సాహిత్యం రాసిన పింగళి లక్ష్మీకాంత కవిగానో మరో ఆరుద్ర గానో సాహితీ చరిత్రలో సుస్థిర స్థానం సంపాయించగలరు.మీకు విజయం వరిస్తుంది అన్న నమ్మకం నాకుంది.ఎందుకంటే మీరు జగ మొండి కనుక😊😊మీకు జయహోలు

  • అన్నా.. ధ న్యో స్మి…
   ఇది నిజానికి సాహసం..మీ అందరూ సహకారాన్ని పోగు చేసుకోని సాగుతూ…

   మీకు అత్మీయ నెనర్లు!!💐💐💐💐

  • మీ అభిప్రాయాలను మీ స్పందన ను ఆమూల్య0గా భావిస్తాను.. ధన్యవాదాలు

 • కొత్త శీర్షిక కు స్వాగతం. పువ్వులు-మొగ్గలు శీర్షిక బాగుంది. అభినందనలు సర్.

 • సివి కుమార్ సార్

  గొప్ప వ్యాసాలు అవగలవు. శుభాకాంక్షలు సార్

 • కొత్తమార్గం వేయడంలో మార్గనిర్దేశనం చేయడంలో మీకు మీరే సాటి సురేష్ గారూ..రస్తా మీతో పాటు మాతో అద్భుతప్రయాణం చేయిస్తుందనడంలో సందేహం లేదు..బాటలో పయనిస్తూ మీ విశ్లేషణలతో మరింత మెరుగైన సాహిత్యానికి మెరుగులు దిద్దుకునే అవకాశం కలిగిస్తున్న రస్తా మాగజైన్ కు నిర్వాహకులకు అభినందనలు..మీకు శుభాభినందనలు ..దూసుకుపోయే మీ సాహితీపిపాసను ఆస్వాదించడానికి సదా సంసిద్దమై మేమిక్కడ చకోర పక్షుల్లా ఎదురుచూస్తున్నాం ..గుడ్ లక్ 💐💐

 • మరో కొత్త శీర్షికకీ మరో కొత్త అలోచనకీ నాంది పలికిన మీ ఈ ప్రయత్నం సఫలీకృతం కావాలని కోరుకుంటూ..మీకూ హెచ్చ్చార్కె గార్కి మనస్ఫూర్తి అభినందనలు.—-మీ వాసుదేవ్

 • చాలా పెద్ద భారాన్ని తలకెత్తుకున్నారు .మీ ఈ ప్రయత్నం సఫలం కావాలని మనస్పూర్తిగా ఆల్ ది బెస్ట్ 💐💐💐

 • చాలా గొప్ప ప్రయత్నంతోపాటు.. అవిశ్రాంతమైన మీ కృషి.. నవతరానికి మార్గదర్శకం కాగలదని భావిస్తున్నాను.నాకు తెలిసినంతవరకు.. వర్తమాన తరానికి రాయటం మీద ఉన్నంత ఆసక్తి.. ప్రాచీన సాహిత్యాన్ని చదవడం మీద దృష్టిని నిలపడంలేదని అవగతమవుతోంది.దీని ఫలితంగానే ఏది ఉత్తమ సాహిత్యం.. ఏదీ కవిత్వం.. ఏది వాచ్యం అనే అంశాలు లోతుగా అర్ధం చేసుకోవడానికి వీలు కలుగుతుంది.ఈ అధ్యయనం మూలంగా భాష మీద పట్టు, అప్పటి కాలమాన సామాజిక అవగాహన రీతుల్ని.. వర్తమాన పరిస్థితులతో పోల్చిచెప్పడానికి.. విమర్శనాత్మక ధోరణిలో అవగతం చేసుకోవడానికి.. మీరు చేస్తున్న ప్రయత్నం.. ఒకింత ప్రేరణను కలిగించి.. ఆధునిక శిల్పారీతుల మీద.. శైలీనిర్మాణ పద్ధతుల మీద మరొకసారి విస్తృతస్థాయిలో చర్చలేపడానికి అవకాశం కల్పిస్తుంది.. ప్రాచీనాలంకారికుల కోణాల్లోని వైవిధ్యపూరితమైన ఎత్తుగడలు.. రూపవిధానాలలోని తులనాత్మక సమకాలీన అధ్యయన పద్ధతులని విడమర్చి విశ్లేషించడానికి అవకాశం కలుగుతుంది.. ఈ కోవలోనే.. అప్పటి దృక్పథాల్లోని ఆలోచనారీతుల్ని.. తీరుతెన్నుల్ని.. ఔపోసన పట్టడానికి.. ఆకళింపు చేసుకోవడానికి ఒక మార్గాన్ని దిశానిర్ధేశం చేసినట్లవుతుంది.. ఈ కార్యసిద్ధి మీ ద్వారా మరోసారి వ్యక్తమయ్యేందుకు దోహదపడుతుంది.. గతంలో వీటిపై ఎన్ని చర్చల్ని జరిపినా.. ప్రామాణికతల్ని సమతూకంతో బేరీజు వేసుకోగలిగినా.. ఇంకా ఎప్పటికప్పుడు ఎంతోకొంత మిగిలిపోతూనే వస్తుంది.. దానికి కొనసాగింపుగా ఇప్పటి మీ ప్రయత్నం.. ప్రయాణం కొత్తపుంతల్ని తోక్కిస్తుందని ఆశిస్తూ.. ఈ పాతకొత్తల మేలుకలయికను బాధ్యతాయుతంగా ఆధునిక తరానికి అందించడం వలన.. ఉపయుక్తమైన ప్రయోజనాన్ని సాధించగలరని కోరుకుంటున్నాను.. అభినందనలు సర్..

 • మంచి ప్రయత్నం సార్
  వివిధ కవులు కవితారీతుల్ని మీ ఈ
  విశ్లేషణల ద్వారా అర్థం చేసుకొని,నేటి
  కవిగణం వారియొక్క కవనశైలలకు మరింత
  మెరుగులద్దుకొనే సువర్ణ అవకాశం కలుగుతుంది
  ఓ రకంగా ఇది శుభపరిణామం, ఇంత చక్కని
  కార్యానికి పూనుకున్న మీకు మనసారా అభినందనలు 💐🌹

 • Wow.. That’s great.. my name included! Thank u so much. Really appreciate ur initiative!

 • పాత కొత్త తరాల లో ఉన్న, గతించిన ధోరణులను నూతన సైద్ధాంతిక వెలుగులో చూడడం ఇది మొదటి సారి కాదు. వెల్చేరు నారాయణ రావు సైద్ధాంతిక గ్రంధం తెలుగులో కవితా విప్లవ స్వరూపాలు, సినారె ఆధునిక కవితా సాంప్రదాయాలు ప్రయోగాలు,జీ.వి. సుబ్రహ్మణ్యం సాహిత్యం లో చర్చనీయాంశాలు, ఆరుద్ర,సి ఆర్ రెడ్డి,సురవరం,రాళ్ళపల్లి లాంటి వాళ్ళు సాంప్రదాయ సాహిత్యం రూప సారాల చర్చ చేశారు. ప్రొఫెసర్ కె. కే రంగనాథాచార్యులు తెలుగు లో తొలి సమాజ కవులు అనే అరుదైన పుస్తకం రాసారు.
  ఇంతటి విలువైన ఇతివృత్తం కాన్వాస్ గా ఈ వ్యాసం మొదలు పెట్టడం నిజంగా కత్తి మీద సాము లాంటిదే. అందునా సాహిత్యం ప్రవృత్తి గా భావించే సురేష్ గారు ఈ ప్రయత్నం చేయడం అభినందనీయం.
  ఇది లోతైన ఇతి వృత్తం తెలుగు లో యుగ విభజన ఏ ఒక్కరూ ఒకే రకంగా చేయలేదు. కనుక ఎవరి యుగ విభజన ఆధారంగా ఈ విశ్లేషణ చేస్తున్నారో దానికి అనువైన ఫుట్ నోట్స్, రిఫరెన్స్ ఇస్తే చదివే వారికి బాగుంటుంది
  ముందుగా శివకవులు తర్వాత నాయక రాజుల యుగం లో పూర్వ లాక్షణిక సాంప్రదాయాలను నిరసించారు.ఆ నిరసన ఏ రూపాల ద్వారా వచ్చిందో చర్చించాలి. ఇక పోతే ఆధునిక కవితా వికాసాలు అస్థిత్వ పాయలు అవి లేవనెత్తిన చర్చలు పువ్వులు- మొగ్గలు లో చర్చకు రావాలి అని అది కష్టతరమైన నూ ఒక ప్రయత్నం మొదలైందని ఆహ్వానిస్తూ…

  • Nirmala Nandigama ఈ శీర్షిక ప్రధానంగా వర్ధమానఆధునిక కవుల కవిత్వ తీరుతెన్నులపైనే ఎక్కువ ఫోకస్.. ప్రాచీన కాలమ్ కవుల సాహిత్య ధోరణుల పై ఔట్ లైన్ స్కెచ్ ఇస్తూ..తొలి తరం వర్ధమాన కవుల కవిత్వ ధోరణులను కాస్త లోతుగా..ఇక వర్ధమాన మలి తరం కవుల కవిత్వ ధోరణులపై విశేషంగా విశ్లేషించడం ఈ శీర్షిక ప్రధానోద్దేశ్యం.
   ప్రాచీన కవుల గురించి పూర్తి విఫులంగా ఇప్పటికే మీరన్నట్లు అనేక గ్రంధాలు వచ్చాయి.. వీటన్నింటిని మనం కొత్తగా రాయగలిగింది నా దగ్గర ఏమీ ఉండదని కూడా తెలుసు.. ఎవరైనా ఆ రిఫరెన్స్ బుక్స్ చదివే..అధ్యయనం చేసి రాయాలి..అందుకే ఆ సాహిత్యం పై అంత లోతుగా రాస్తే కేవలం ప్రాచీన కవుల సాహిత్యం గురించి ఓ 70 ఎపిసోడ్ లు రాయాలి..అందుకే వాళ్ళ సాహిత్యం పై జస్ట్ ఔటలైన్ స్కెచ్ ఇస్తూ.క్రమంగా ప్రస్తుత కవుల కవిత్వ ధోరణులు పై ఎక్కువ కాన్సంట్రేషన్ చేస్తున్న..
   ఇది ఒక సాహసమే..నాకు ఈ ఇతి వృత్తం ఆలోచన వచ్చాక Hechharke గారితో చర్చించాను..
   ఆయన సరే అన్నాక..అనేక బుక్స్ రెఫెర్ చేస్తూ..ప్రోత్సాహం ఇచ్చే సహృదయం ఉన్న వాడ్రేవు వీరలక్ష్మి దేవి గారితో..ఇంకా కొందరి సూచనలు సేకరిస్తూ ప్రయత్నం తొలి అడుగులు వేసాను.. మీరు ఇస్తున్న సూచనలు..సలహాలు ప్రాచీన కవుల కవిత్వ ధోరణులు పై ఎక్కువగా ఉన్నాయి..వీటిని కూడా చదువుతాను.. మీ సహృదయ ప్రొత్సాహానికి ప్రత్యేక నెనర్లు…💐💐💐💐

 • మంచి ప్రయత్నం చేస్తున్నారు.అభినందనలు

 • కవిత్వంపై విమర్శ వస్తే బాగుండు అనుకునే సమయంలో మీరా పనికి పూనుకోవడం బాగుంది.చాలా కష్టమైన పనిని ఇష్టంగా ఎన్నుకోవడంలోనే మీ సంకల్పదార్ఢ్యత తెలుస్తున్నది.అసంఖ్యాకంగా కవిత్వోత్పత్తి జరుగుతున్న ఈనాటి సాహితీసీమకు మీ విశ్లేషణ కరదీపికగా నిలుస్తుంది.అభినందనలు

  • మీ సహృదయ ప్రొత్సాహానికి ప్రత్యేక నెనర్లు…💐💐💐💐

 • ఇంకా చాలా పువ్వులను, చాలా మొగ్గలను మీ లిస్ట్ లో మిస్ చేశారు. ఇలా పేర్లు ఇక్కడ రాసి మీ శీర్షిక పరిధిని మీరే అవమాన పరచుకుంటున్నారు.

  ఒకే ఒక్క సలహా: మీకు తెలిసిన వాళ్ళు, తెలియని వాళ్ళు అని కాకుండా, కవిత్వ ప్రాతిపదిక మీద వ్యాసాలు రాయండి.

  అల్ ది బెస్ట్!

  • ఆ పేర్ల చివర ఆ వాక్యం అందుకే రాసినాను సర్..ఇంకా గుర్తుకు రాని వాళ్ళ పేర్లు కూడా తర్వాత కాలం లో తీసుకొంటాను..అని..

   It’s a matter of forgetting rather than intentional omission..
   ఎలాంటి సైడ్స్ తీసుకోకుండా. Impartial గా పేర్లు తీసుకొని add చేస్తూ పోయానని నేను ఖచ్చితంగా చెప్పగలను..సర్!

   ధన్యవాదాలు మీ స్పందనకు

 • మంచి కార్యక్రమానికి శ్రీకారం చుట్టిన సురేష్ సర్ కు
  హృదయపూర్వక నమస్కారం..
  కాలం మారుతున్నా కొద్ది అన్నింట్లో కూడా తేడాలను గమనిస్తున్నాం. ఇందులో ఏ విషయం మినహాయింపు కాదు.పాత,కొత్త కవుల కవిత్వాన్ని అందులోని తాజాదనాన్ని బయటికి తీసుకురావాలనుకుంటున్న మీకు జయహోలు సర్…

 • సరికొత్త శీర్షికతో ఒక బృహత్ కార్యక్రమానికి తెరతీస్తున్న మీ సాహిత్యాభిలాషకు , విశేష కృషికి
  హార్దికాభినందనలు.గ్రేట్ ఇనిషియేటివ్, కీప్ అప్ ది గుడ్ వర్క్,ఆల్ ది బెస్ట్ సర్.

 • సురేష్ గారు !
  మీ సంకల్పం సదా హర్షనీయం!
  మీ సాధనా సంపత్తి అద్వితీయం!!
  మీలో అద్భుతమైన సకల కళాభిరుచి ఉంది!
  అభిరుచే కాదు అభినివేశం ఉంది !
  మీరు పాడగలరు,ధ్వన్యనుకరణ చేయగలరు,కవిత్వం రాయటమే కాక చక్కని అనువాదాలు చేస్తారు ! –
  ఇప్పుడు ఈ విధంగా కవి పోషకులు కూడా అయ్యారు !-
  Hats off !
  మీతో పాటు హెచ్చార్కె గారికి ధన్యవాదాలు !
  మీ ప్రయత్నం నిర్విఘ్నంగా కొనసాగు గాక !
  అందరి కవిత్వ తత్వాలు – అవి వారి వారి వ్రేలి ముద్రల్లాంటివి. ఎవరి శైలి ప్రత్యేకత వారికే సొంతం !- సర్వ స్వతంత్రమైన కవిత్వమే నిజాలను నిబ్బరంగా వ్యక్తం చేయగలదు !- వాస్తవికమైన,తాత్వికమైన సత్య ధోరణులే సమాజాన్ని సంస్కరించగలవు !- నిజ ప్రగతిని
  అందించగలవు !-
  శాస్త్రీయమైన మనస్తత్వ శాస్త్ర్రవేత్తలు వ్రాసిన కవిత్వం చదవాలన్నది కూడా నా ప్రగాఢమైన ఆకాంక్ష !-
  అలాంటి ప్రత్యేక కవులను,రచయితలను నాకు ఎరుక పరచగలరని హృదయ పూర్వక అభ్యర్ధన !

  • రాధిక …. చాలా స0తోషం గా ఉంది..మీ ఆ త్మీయ స్పందనకు… T h a n k s. A l o t

Categories

Your Header Sidebar area is currently empty. Hurry up and add some widgets.