- రస్తా లో రచయితలం… ఎడిటర్లతో సహా అందరం… ఎలాంటి గర్వం లేని వాళ్ళం. మీరు మీ కాలాన్ని వెచ్చించి ఇక్కడికి వొచ్చి మమ్మల్ని చదవడం మాకు మహా భాగ్యం.
- చదివిన తరువాత సందేహపడక పత్రికలో రచన(ల) మీద మీ అభిప్రాయాల్ని… అనుకూల ప్రతికూల అభిప్రాయాలన్నిటిని… మీ కామెంట్లుగా చెబితే మేము అమందానంద కందళిత హృదయారవిందులమయ్యెదము.
- మీ వ్యాఖ్యల్ని.. అదేనండీ,.. కామెంట్లని ఫేస్ బుక్ వద్ద వుంచినా వుంచకపోయినా (ఇలా అన్నానని జుకర్ బర్గ్ సారుకు చెప్పకండేం…)… వాటిని రస్తా పత్రికలో నమోదు చేయాలని మరీ మరీ విన్నపం.
- వ్యాఖ్యల్లో ‘స్పామ్’ లను, ‘అబ్యూజ్’ ని నివారించడం కోసం వ్యాఖ్యల మీద ఎడిటర్ల ‘మోడరేషన్’ తప్పనిసరి అవుతోంది. అంటే, మీరు వ్యాఖ్య రాసి, మీ ఇ-మెయిల్ ఐడీ అదీ ఇచ్చేయగానే వ్యాఖ్య ‘అచ్చు’లో కన్పించదు. మా ముగ్గురిలో ఒకరం దాన్ని చూసి అప్రూవ్ చేశాకే కనిపిస్తుంది. వెంటనే కన్పించలేదని మీరు చింతించవలదు. 🙂
- మరో మాట. పత్రికలో వొచ్చిన రచనల మీద లేదా మీరు బయటి ప్రపంచంలో చూసిన జీవిత విశేషాల మీద సంపాదకునికి లేఖలు రాస్తే మేము చాలంజాల సంతోషించెదము. వాటిని తదుపరి పత్రికలో అచ్చొత్తెదము కూడా.
6.. సరే.. మీ నుంచి జనరల్ సూచనల్ని, కోపతాపాలను కూడా మాకు రాయొచ్చు. ఓకేనా… ?!
Ok sir…a very good piece of ఇన్ఫర్మేషన్
Thank you
Good work.
తప్పకుండా సార్ …మంచి సూచనలు