కార్యనిర్వహణ శాస్త్రాలకు
ఆద్యుడు చాణక్యుడు

Before you start some work, always ask yourself three questions – Why am I doing it? What the results might be? And Will I be successful? Only when you think deeply and find satisfactory answers to these questions, go ahead.

                                                                                                                       -Chanakya

రోజుల్లో కార్యాలయాల్లో నిత్య వ్యవహారాలు చక్కదిద్దడానికే సతమతమైపోయే మేనేజర్లకు చాణక్యుడు ఎన్నో ఉపాయాలు ఉపదేశించాడు. ఎప్పుడు ఏమి చేసి, ఎలా చేసి వినియోగదారులను సంతృప్తి పరచాలి అన్న విషయాన్ని చాణక్యుడు ఇలా చెప్తాడు. ఏనుగును మీరు వేసవి కాలంలో పట్టుకోవచ్చు. విపరీతమైన నీటి కొరత ఉండటంతో ఏనుగులు దట్టమైన అడవిలోంచి నీటిని వెతుక్కుంటూ బయటికొస్తాయి.‘ ‘మార్కెటింగ్ మేనేజ్మెంట్అంతా వాక్యాల్లో నిక్షిప్తమై ఉంది. మార్కెట్ స్థితిగతులను అంచనా వేసి, వినియోగదారుల అవసరాలు తీర్చగలిగినవాడే వ్యాపారంలో విజయాన్ని సాధించగలడు. ప్రముఖ బ్రాండ్లన్నింటినీ ప్రజలు పక్కనపెట్టి పతంజలి‘  దుకాణాలవైపు పరుగెత్తడానికి  కారణం ఇదే. ప్రజల భావోద్వేగాలతో వ్యాపారాన్ని నిర్మించి, దానిని విజయవంతంగా నిర్వహించడం మామూలు విషయం కాదు. మీరు ఒక్క క్షణం పతంజలి దుకాణం దగ్గర నిలబడి పరిశీలించండి. మేరీ బిస్కెట్లివ్వండిఅనగానే పతంజలి బ్రాండ్ మేరీ బిస్కెట్లిస్తారు. వినియోగదారుడు ఆనందంగా తీసుకెళతాడు. కోల్గేట్ టూత్ పేస్టు ఇవ్వండి అనగానే పతంజలి బ్రాండ్ దంతకాంతిఇస్తారు. ఎందుకంటే కష్టమర్ కి పతంజలి బ్రాండ్ల పేర్లు తెలీదు. కానీ రసాయనాలు వాడని ఉత్పత్తులు వినియోగించాలని మాత్రం తెలుసు. నిరక్షర భారతంలో ఇదే నిజమైన మార్కెటింగ్ టెక్నిక్. దీనితో పెద్ద పెద్ద కార్పొరేట్ సంస్థల వేల కోట్ల టర్నోవర్లకు కూడా ముప్పు ముంచుకొచ్చింది. అవి పతంజలి బ్రాండ్ పవర్ ని అంగీకరించాల్సి వచ్చింది. మొదట్లో కొంచెం మేకపోతు గాంభీర్యం  చూపించినా ఎఫ్.ఎం.సి.జి. కంపెనీలన్నీ కూడా ఏదో విధంగా పతంజలితో వాణిజ్య సంబంధాలు పెట్టుకోవాలని ఉవ్విళ్ళూరుతున్నాయి. ఆవు పాలతో బిస్కెట్లు, ఆవు పేడతో అగరబత్తులు, అన్ని రకాల పెద్ద కంపెనీల సబ్బులకు ప్రత్యామ్నాయ సబ్బులుఇలా ప్రతి ఉత్పత్తికి మన దేశంలోనే వెలసిన చైనా కంపెనీ లాగా, పెద్ద కంపెనీల ప్రతి ఉత్పత్తికి మీకు రసాయన రహిత ఉత్పత్తి పతంజలి దుకాణాల్లో దొరుకుతుంది. ప్రజల మనసులతో, అవసరాలతో ఆడే ఇటువంటి భావోద్వేగాల క్రీడే నిజమైన మార్కెటింగ్ టెక్నిక్ అని చాణక్యుడు ఏనాడో చెప్పాడు.  

ఇటీవలి వరకు  కార్పొరేట్ మార్కెటింగ్ వ్యూహాలన్నీ నగరజీవుల అవసరాల చుట్టూ తిరిగేవి.  బ్యాంకులు, ఇన్సూరెన్స్ కంపెనీలు,  టెలిఫోన్ కంపెనీలు, సౌందర్య సాధనాల ఉత్పత్తి సంస్థలుఇవన్నీ కూడా ఇప్పుడు పల్లెల వైపు చూస్తూ కొత్త మార్కెట్లను కొల్లగొట్టాలని ప్రయత్నిస్తున్నాయి. చాణక్యుడు గ్రామీణ ప్రాంతాల కొనుగోలు శక్తిని ఏనాడో పసిగట్టాడు. ఇక్కడ నాకు గోద్రేజ్ కంపెనీ అధిపతి ఆడి గోద్రేజ్ తన కెరీర్ తొలి నాళ్ళలో జరిగినట్టు చెప్పిన సంఘటన గుర్తుకొస్తోంది. ఎం.బి.. పాస్ అవగానే చక్కగా టై కట్టుకుని  మార్కెటింగ్ ఉద్యోగానికి ఆడి గోద్రేజ్ వెళ్ళగానే ఒక ఎడ్లబండిలో అన్ని రకాల గోడ్రేజ్ సబ్బులు వేసుకుని, చుట్టుపక్కల పల్లెటూళ్ళకు వెళ్ళి అమ్ముకు రమ్మన్నారు. కొత్త ఉద్యోగంలో నూతనోత్సాహంతో చేరడానికి వచ్చిన ఆడి గోద్రేజ్ కి మాట వినగానే మతిపోయినంత పని అయింది. విధంగా పని చేశాం కాబట్టే ఈరోజు నేను కంపెనీ చైర్మన్ కాగలిగానుఅంటారు ఆడి గోద్రెజ్.  

మానవ వనరుల మేనేజర్లకు (HR Managers) కూడా చాణక్యుడు ఎన్నో విలువైన సలహాలిచ్చాడు. ఉద్యోగుల ఎంపిక, బదిలీలు, ప్రమోషన్లు, ఇన్సెంటివ్ లు వంటి ఎన్నో అంశాలను చాణక్యుడు తన అర్థశాస్త్రంలో ప్రస్తావించాడు. ప్రతి ఉప శాఖను నిర్వహించడానికి దానిలో ప్రత్యేక కృషి చేసిన వారినే నియమించాలని చాణక్యుడు ఆనాడే చెప్పాడు. అంటే రిక్రూట్ మెంట్ కి ప్రత్యేకంగా రిక్రూటర్ నే నియమించాలి. ప్రమోషన్లు, ఇన్సెంటివ్ లు నిర్వహించడానికి కాంపెన్సేషన్ మరియు బెనిఫిట్స్ మేనేజర్లనే నియమించాలని చాణక్యుడు అర్థశాస్త్రంలో విశదీకరించాడు. ఈనాడు అన్ని కంపెనీలు ఇదే విధానాలను అనుసరించడం మనం చూస్తూనే ఉన్నాం. అలాగే ఉద్యోగుల శిక్షణా శాఖలో ట్రైనింగ్ మరియు డెవలప్ మెంట్ మేనేజర్, ఉద్యోగులతో యాజమాన్యం తరఫున సత్సంబంధాలు నెరపడానికి ఎంప్లాయీ రిలేషన్స్ మేనేజర్ – ఇవన్నీ కూడా చాణక్యుడు తన అర్థశాస్త్రమనే గ్రంథంలో విపులంగా వివరించాడు. మనం ఈ రోజు కంపెనీలలో చూస్తున్న పదవులన్నీ చాణక్యుడు వేల సంవత్సరాల క్రితమే ప్రస్తావించాడు. ఏ పదవి నిర్వహించే వారికైనా అపరిమిత అధికారాలివ్వరాదని చాణక్యుడంటాడు. పరిమితి లేని అధికారం అపరిమితమైన అవినీతికి దారి తీస్తుందని చాణక్యుడి నిశ్చితాభిప్రాయం.

అభివృద్ధిని చాణక్యుడు నాలుగు దశలుగా నిర్వచించాడు. మొదటిదశలో  లక్ష్యాన్ని ఛేదించాలి. రెండో దశలో నిలకడగా ఉండాలి. మూడో దశలో నిలకడగా ఉన్న ప్రగతిని ముందుకు తీసుకెళ్ళాలి. నాలుగో దశలో ప్రగతి ఫలాలను భాగస్వాములందరితో పంచుకోవాలి. సంస్థను నిర్మించగానే కార్పొరేట్ నాయకుడి పని అయిపోదు. నిజానికి సంస్థ నిర్మాణం తర్వాతే అసలు పని ప్రారంభమవుతుంది. మార్కెట్ పెట్టుబడిని పెంచి అతి పెద్ద కంపెనీగా అవతరించడంలో చిత్తశుద్ధితో కృషి చేయాలి. సంస్థ ఆర్ధిక విజయాలను భాగస్వాములతో, సమాజంతో పంచుకోవాలి. సామాజిక బాధ్యతలను (Corporate Social Responsibility – CSR) నిర్వహించడం ద్వారా కంపెనీ సాధించిన సత్ఫలితాలను ప్రజలకు చేరువ చేయాలి.

ఏ మేనేజ్-మెంట్ పుస్తకమైనా కంపెనీని ఎలా నిర్వహించాలో నేర్పుతుంది. అవన్నీ చక్కెర మాత్రలలాగా చక్కగా ఉంటాయి. అవి కేవలం పాఠ్య పుస్తకాలు. వాటిలో అనుభవ సారం శూన్యం. అర్థశాస్త్రం మాత్రం నిలకడైన ప్రగతితో ఒక సంస్థను ఎలా నిర్మించాలో తెలియచేస్తుంది. పునాది నుంచి సంస్థను ఎలా పటిష్టం చేయాలో కూడా అర్థశాస్త్రం వివరిస్తుంది. పది ఏనుగుల్ని పోగేయాలంటే నీ దగ్గర ఒక్క ఏనుగుంటే చాలు. ఏనుగు ఒంటరిగా జీవించలేదు. అది ఎప్పుడూ తన జాతి గుంపు కోసం ఎదురుచూస్తుంటుంది. దీన్ని మీరు డబ్బు సంపాదించే నైపుణ్యంతో పోల్చవచ్చు. ముందు కొంత డబ్బు సంపాదించాలి. అప్పుడు ఆ డబ్బు మరింత డబ్బును కూడబెడుతుంది. ఇక్కడ నాకో సంఘటన గుర్తుకొస్తోంది.  ఆంధ్రా బ్యాంక్, ఎల్.ఐ.సి. వంటి విశ్వ విఖ్యాత సంస్థలను స్థాపించిన స్వర్గీయ భోగరాజు పట్టాభి సీతారామయ్య గారు కటిక పేదరికంలో మగ్గుతూ చదువు కొనసాగించారు. తన ఇంటి ఎదురుగా ఇద్దరు వైశ్యులు డబ్బును ఎలా పంచుకోవాలా అని పోట్లాడుకుంటుంటే, వారి మధ్య సయోధ్య కుదిర్చి ఆ డబ్బు నా దగ్గర దాచి పెట్టండి, మీకు అవసరమైనప్పుడు తీసుకోండి అని ఒక పత్రం రాసి ఇచ్చారు. ఆ ఆలోచనే తర్వాత ఆంధ్రా బ్యాంకు స్థాపనకు దారి తీసింది. తెలుగువాడి వ్యాపార దక్షత ఏమిటో లోకానికి చాటింది. ఆ తర్వాత ఆయన ఎన్నో సంస్థలు స్థాపించి దిగ్విజయంగా నిర్వహించారు. భోగరాజు ఆర్ధిక, రాజకీయ ప్రతిభను గుర్తించిన గాంధీజీ ఆయన్ని కాంగ్రెస్ పార్టీకి తొలి అధ్యక్షుడిగా నియమించారు.   నేటి పెట్టుబడి సలహాదారుల ఆలోచనా మూలాలు సైతం మూడు వేల ఏళ్ళ క్రితం రాసిన చాణక్యుని అర్థశాస్త్రంలో ఉన్నాయి.

ప్రవర్తనా నైపుణ్యాలను (Behavioral Skills) గురించి కూడా చాణక్యుడు తన అర్థశాస్త్రంలో ప్రస్తావించాడు. ఎవరైనా నీకు ఖరీదైన బహుమతి ఇస్తుంటే జాగ్రత్త; అతడు నీనుంచి ఇంకా అధికంగా ఆశిస్తున్నాడన్నమాటఅంటాడు చాణక్యుడు. నీకు హాని చేసే అనవసరమైన కబుర్లతో కాలాన్ని హరించకు. కోపాన్ని నియంత్రించుకో; లేకపోతే అది నిన్ను నియంత్రిస్తుంది. గురువులను, పెద్దలను కలవడానికి వెళ్ళినపుడు ఒట్టి చేతులతో వెళ్ళకు. ఫలాలు కానీ, మిఠాయిలు కానీ తీసుకెళ్ళు. పిల్లల్ని నువ్వు చక్కగా క్రమశిక్షణతో పెంచితే; భవిష్యత్తులో వాళ్ళు నిన్ను చక్కగా చూసుకుంటారు. నీతో ఉండని డబ్బును అతిగా సంపాదించడానికి అవినీతి పనులు చేయకు. నీ గురించి ఎప్పుడూ విమర్శనాత్మకంగా ఆలోచించు. నీ నిత్య వ్యవహారాలను విమర్శనాత్మకంగా విశ్లేషించుకో. ఈ రోజు వరకు ఏమి సాధించావు; రేపు ఏమి సాధించాలి అనే దృష్టితో విశ్లేషించుకుంటే నీ లక్ష్యాలలో స్పష్టత వస్తుంది. లక్ష్యశుద్ధి ఏర్పడుతుంది. లక్ష్యసిద్ధి కలుగుతుంది. ఇటువంటి వేలాది ఆణిముత్యాల్లాంటి జీవన నైపుణ్యాలను  (Life Skills) చాణక్యుడు తన అర్థశాస్త్రంలో విశదీకరించాడు. విస్తృతంగా చర్చించాడు. వాటిని అనుసరించడమే మానవ జాతి ప్రగతికి అచ్చమైన  రాచమార్గం.

చల్లా రామ ఫణి

చల్లా రామ ఫణి - వృత్తిరీత్యా కార్పొరేట్ ట్రైనర్. ప్రవృత్తి రీత్యా కవి, రచయిత. కొన్నాళ్ళు గుమస్తాగా, కొన్నాళ్ళు పాత్రికేయుడుగా, ఓ సంవత్సరం పైగా మారిషస్ లో తెలుగు వారికి తెలుగు బోధన, ఫార్మా రంగంలో మానవ వనరుల శాఖలోనే గత రెండు దశాబ్దాలుగా ఉద్యోగం. ప్రస్తుతం కార్పొరేట్ ట్రైనర్ గా స్థిరపడ్డట్టే అనిపిస్తోంది. తొలి కవితల సంకలనం 'త్రిశంకు నరకం' కు ఆంధ్ర మహిళా సభ వారి 'దేవులపల్లి కృష్ణశాస్త్రి పురస్కారం' అందింది. డెలాయిట్ మానవ వనరుల శాఖ డైరెక్టర్ ఎస్.వి.నాథన్ ముందుమాటతో అంగ్లంలో ‘Access Success… Infinite’ అనే వ్యాసాల సంకలనం 2017లో వెలువడింది. అమెజాన్ లో ఈ పుస్తకం అందరికీ అందుబాటులో ఉంది.

1 comment

Categories

Your Header Sidebar area is currently empty. Hurry up and add some widgets.