కొత్త తరం

స్నానం చేసి పేపర్ చదువుతున్నాను 

పొద్దున్నే సలీం ఫోన్ 

ఇంట్లోనే ఉన్నావా?’ 

అవును‘ 

మన శోభన్బాబును హాస్పిటల్లో చేర్చారు. బాగోలేదు.’ 

అయ్యో అలాగా !ఎక్కడ ? హాస్పిటల్ ? రమేష్ లోన? నేను ఒక గంట లో ఉంటాను

తయారై గబగబా బయలుదేరాను.

సత్తిరాజు నా చిన్నప్పటి నుంచి మంచి స్నేహితుడు.

చాలా సరదాగా ఉండేవాడుశోభన్ బాబు లాగా ముఖం మీద వంకి జుట్టుతో ఉండేసరికి జూనియర్ శోభన్ అని ఆటపట్టించే వాళ్ళం మేమంతా. చాలా కష్టపడి పైకొచ్చిన వాడు కష్టం విలువ తెలిసిన వాడు కావడంతో పైసా పైసా కూడబెట్టి ఒక చిన్న ఇల్లు కొనుక్కున్నాడువాడికున్న కంప్లైంట్ అంతా ఒక్కటే. వాడి కొడుకు తన మాట వినడం లేదని

చాలా కాలం తర్వాత పుట్టడంతో అడిగింది కాదనకుండా కొనిచ్చాడు.  

ఫ్యాన్సీ బైక్మేక్ నోట్ బుక్ . ఆపిల్ ఫోన్.

బెంగళూరులో పెద్ద కాలేజీలో డొనేషన్ కట్టి ఎంబీఏ సీటు. ఒక్కగానొక్క కొడుకు అంటుండే తన భార్య మాట ఎప్పుడూ చెప్పేవాడు

***.

ఏమైందోఅనుకుంటూ హాస్పిటల్ రిసెప్షన్ లో అడిగాను. సి యు లో ఉన్నాడుబయటనుంచి చూడాల్సిందేడాక్టర్ 11 గంటలకు వస్తాడు. మాట్లాడొచ్చు

సలీం మందులు కొనుక్కుని  రావడానికి వెళ్ళాడు

***

సత్తి రాజు భార్య దిగులుగా కూర్చుని ఉంది.’ ఏమైందిఅని అడిగాను.

ఎప్పటి లాగే అవినాష్ ఫ్రెండ్స్ తో తిరిగి రాత్రి 11 గంటలకు వచ్చాడు. ఆయన మందలించాడు. చెంప మీద కొట్టి మెట్ల పైకి వెళ్ళకుండా అడ్డంగా నిలబడ్డారుఅవినాష్ సంగతి తెలిసిందే కదా. సమాధానం చెప్పలేదు

తప్పుకో డాడీఅంటూ విసురుగా నెట్టి పైకెళ్లిపోయాడు. కింద పడ్డ ఆయన తలకి గట్టు కొట్టుకుంది. వెంటనే మూర్చపోయాడు

వీణ్లి లేపితే లేవలేదు. మా తమ్ముడికి ఫోన్ చేసి వేరే ఆస్పత్రికి తీసుకెళ్లామువాళ్ళు ఇక్కడ చేర్చమన్నారు.

 పొద్దున్నే సలీం వాకింగ్ వచ్చి కనుక్కొని మీకు ఫోన్ చేశాడుఅని ఏడవసాగింది.

నాకు నోట మాట రాలేదు. ‘ఇప్పటి తరం అంతా ఇంతేనాఅనుకుంటూడాక్టర్ ఏమన్నాడుఅని అడిగాను 

కోమా నుంచి బయటికి రావడానికి రెండు రోజులు పడుతుందట లేకపోతే పరిస్థితి చెప్పలేమన్నారు‘.

అవినాష్ ఎక్కడున్నాడు? ఇప్పుడు 12 అవుతోంది ?’అంటుండగా అవినాష్ అతని స్నేహితులు వచ్చారు 

ట్రెండీ హెయిర్ స్టైల్కింద పెదవి కింద పెంచిన గడ్డంకూలింగ్ గ్లాసులు.  ‘ఎలా ఉంది మమ్మీ?’ అని ఏమి జరిగినట్టుగా అడిగాడు

అవినాష్ ఏంటిది ?’అని చనువుతో అడిగాను. ‘ ఏమైంది అంకుల్? కిందపడ్డాడు. రికవర్ అవుతున్నాడు. ఇప్పుడు కాకపోతే నెక్స్ట్ వీక్. దేశంలో హాస్పిటల్స్ ఏమయిన గొడ్డు పోయాయా? ఇక్కడ కాకపోతే ఇంకో చోట!’ బదులిచ్చిన అవినాష్ ని చూసి నాకేం మాట్లాడాలో తెలియట్లేదు. తరం మారుతోందని మాత్రమే అనిపిస్తోంది.

డాక్టర్ విజయ్ కోగంటి

విజయ్ కోగంటి పేరుతో 1993 నుండి కవితా వ్యాసంగం. అనేక దిన, వార, మాస, పత్రికలు, ఆన్ లైన్ పత్రికలలో ప్రచురణలు. 2012 లో ‘కూలుతున్న ఇల్లు’ కవితకు నవ్య-నాటా బహుమతి. తెలుగు, ఇంగ్లీషుల్లో కవిత, కథారచనతో పాటు అనువాదాలు, సమీక్షలు, సాహిత్య బోధన ప్రధాన వ్యాసంగాలు. ’ఇలా రువ్వుదామా రంగులు’ (2017) మొదటి కవితా సంపుటి. స్వయం ప్రతిపత్తి గల ప్రభుత్వ మహిళా కళాశాలలో ఆంగ్ల శాఖాధ్యక్షుడు
drvijaykoganti@gmail.com

M: 8801823244

Add comment

Categories

Your Header Sidebar area is currently empty. Hurry up and add some widgets.