పక్షి గూడు
తనిష్టం
తన నైపుణ్యం
తన కళాత్మకత
భౌగోళిక నైసర్గిక నిర్ణయం తనదే
గాలి నీరు మంట
గూడుని చెదరనీయని చోటు ఎన్నిక
స్థిర నివాసం కాకపోయినా
తనదైన శైలిలో
పుల్లపుల్ల ఏరి కూర్చి
నిర్మాణం
ప్రాంతంలో
తన వనరులు తరిగితే
వలస
జంకు లేకుండా
మరోచోట మళ్ళీ గూడు
తనే నిర్మాత
స్వేఛ్ఛని కోల్పోదు
ఆకాంక్షని వదులుకోదు
మనిషి గూడు
ఆంక్షల నడుమ
కులం మతం పైత్యం
వాస్తు ఒక్కోడి
>ఒక్కో తరహా తీర్పు
మనిషి మెదడు
మూఢనమ్మకాల్లో మునక
వాడ వాదులాటల్లో
తన ప్రమేయం లేకుండానే
ఎవ్వడో కూర్చిన నమూనా
ఏ మూలన కూర్చోవాలో వండుకోవాలో
ఏ దిక్కున పడుకోవాలో
ఏవేవి ఎక్కడెక్కడ పెట్టుకోవాలో
ఎవ్వడో చెబితే మనిషి మరో ఆలోచన లేకుండా
శిరసావహింపు
ఎవరు గొప్ప?
మెదడు లేదనుకున్న పక్షియా?!
మెదడున్నా పరాధీనంలో నడిచే మనిషా ?!
మనిషిని శాసించే మనిషి వున్న సమాజమా ?!
Add comment