నవరసాలొలికించిన
శాసన సభాంగణం

ఆంధ్రప్రదేశ్ లోని వైఎస్ జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం తొలి బడ్జెట్ ప్రవేశపెట్టింది. వారు మొదటి నుంచి చెబుతున్నట్టే అవినీతి రహిత , పారదర్శక పాలనే తమ లక్ష్యమని ఆర్థిక మంత్రి బుగ్గన రాజేంద్రనాధ్ రెడ్డి ప్రకటించారు. గత పాలకులు తమకు అప్పుల ఖజానాను అప్పగించినా, తమ ప్రభుత్వం చేసిన వాగ్దానాలు, ప్రాధాన్యతల మేరకు ఉన్నంతలో బడ్జెట్ కేటాయింపులు చేశామని ఆయన చెప్పుకొచ్చారు. విభజన సమయంలో లక్షా ముప్పై వేల కోట్లుగా ఉన్న అవశేష రాష్ట్ర రుణం 2018 – 19 నాటికి 2 ,58 928 కోట్లకు చేరింది. అంతేకాకుండా వివిధ సంస్థల ద్వారా 10 వేల కోట్ల రుణాలు తీసుకుని గత ప్రభుత్వం ఇతర అవసరాలకు మళ్లించింది. దీనికి అదనంగా మరో పద్దెనిమిది వేల కోట్ల బిల్లులు బకాయిలు ఉన్నాయి. వీటన్నిటికీ తోడు ఫిబ్రవరిలో 2019 – 20 ఓటాన్ అకౌంట్ బడ్జెట్ కింద ఇచ్చిన వాగ్దానాలను నెరవేర్చేందుకు దాదాపు 45 వేల కోట్ల వనరుల అంతరం ఉంది. ఇది యీ ప్రభుత్వానికి సంక్రమించిన భిన్న పరిస్థితి. ముందు నుంచి చెబుతున్నట్లే విద్య, వ్యవసాయాలకు అధిక ప్రాధాన్యం ఇచ్చారు. రైతు భరోసా పథకంలో భాగంగా రైతులకు ఇవ్వబోయే 12,500 రూపాయల పెట్టుబడి సాయం, ధరల స్థిరీకరణ, ఉచిత వ్యవసాయ బోర్లు మొదలైన వాటికి స్పృష్టమైన కేటాయింపులు చేశారు.

సున్నా వడ్డీ దాదాపు శూన్య హస్తమే 

ఇక బడ్జెట్ పై అసెంబ్లీలో జరుగుతున్న చర్చలు వాడీవేడిగా వున్నాయి.  ముఖ్యంగా సున్నా వడ్డీ అంశం సభలో మంటలు రేపింది. రైతులకు సున్నా వడ్డీ పథకం కొత్తదేమి కాదూ, కిరణ్ కుమార్ రెడ్డి ప్రభుత్వం నాటి నుంచే ఉందనీ, దాన్ని తాము కూడా కొనసాగించామని ప్రతిపక్ష  నేత చంద్రబాబు ఆయన పార్టీ సభ్యులు గోల గోల చేస్తున్నారు. వాస్తవానికి తెలుగుదేశం ప్రభుత్వం 2014 నుండి 2019 వరుకు రైతులకు సున్నా వడ్డీ రుణాల కోసం పదకొండు వేల కోట్ల రూపాయలు ఇవ్వాల్సి ఉండగా  కేవలం 630 కోట్లు మాత్రమే ఇచ్చారు. అంటే ఐదు శాతం మాత్రమే. వ్యవసాయ రుణ మాఫీలు కూడా 87 వేల కోట్లు చెల్లించాల్సి ఉండగా కేవలం15 వేల కోట్లు మాత్రమే ఇచ్చి చేతులు దులుపుకొన్నారు. ఐనా, సభలో చంద్రబాబు గారు గొప్పగా అమలు చేసినట్లు, అందుకు గాను జాతీయ స్థాయిలో తనకు గుర్తింపు వచ్చినట్లు చెప్పుకున్నారు. దానికి తోడు ఆయన ఎల్లో మీడియా వంత పాడుతున్నారు.  జరగని దాన్ని కూడా తానే జరిపించినట్టు ప్రచారం చేసుకునే బాబుగారు మరి సున్నా వడ్డీ గురించి ఎందుకు చెప్పుకోనట్టు?. అలాగే అసెంబ్లీలో ప్రభుత్వ ప్రతిపక్ష సభ్యుల తీరును ఒకసారి పరిశీలిస్తే ఒక అనుకూల వాతావరణం గమనించొచ్చు. అదేమిటంటే రూలింగ్ పార్టీ సభ్యులు కానీ సభా పక్ష నేత కానీ మాట్లాడుతుండగా అరిచి గోల చేస్తూ , సభ్యులు మాట్లాడుతుంటే వారికి అడ్డు తగులుతూ గందరగోళ పరిచే పరిస్థితి లేకపోవడం. బహుశా ప్రతిపక్షానికి అతి తక్కువ సభ్యులు ఉండడం, ప్రభుత్వ ఎమ్మెల్యేల్లో ఎక్కువ మంది కొత్తగా ఎన్నికైన వారే అయివుండడం వంటి కారణాలు ఆ పరిస్థితికి దోహదం చేస్తుండొచ్చు. అయితే సభ్యులను రెచ్చగొట్టి ఉసికొల్పేలా మాటలు ఉండడం మాత్రం తగ్గలేదని తెలుస్తోంది. ఇటువంటి సమయంలో ముఖ్యమంత్రి గారు  ప్రతిపక్ష సభ్యులు చేసే రెచ్చగొట్టే వాఖ్యలకు నోరు జారకుండా వుండగలగాలి. అప్పుడే సభా మర్యాదలను కాపాడినట్టవుతుంది. అధికార సభ్యులను రెచ్చగొట్టి వారిచే ఏవో మాటలు అనిపించుకుని ఆ సాకుతో సభ నుండి వెళ్లిపోవాలని ప్రతిపక్ష తెలుగుదేశం పార్టీ ఎత్తుగడ కాబోలు. కాబట్టి ముఖ్యమంత్రి , మంత్రులు అటువంటి మైండ్ గేమ్ లో పావులు కాకుండా జాగ్రత్త పడాలి.

స్పీకర్ తీరు కూడా ఇప్పటి వరుకు బాగానే వుంది. సభను క్రమశిక్షణగా హ్యాండిల్ చేయగలుగుతున్నాడు. ఇదే పద్ధతి కంటిన్యూ అయితే ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ నడవడిక దేశంలో ఒక కొత్త సంప్రదాయాన్ని నెలకొల్పుతుంది. ఇది బడ్జెట్ మాసం. వచ్చే నెల నుండి వరుసగా నెలకొక పథకం ప్రారంభం కాబోతోంది. అవి ప్రజలకు చేరతాయో, వాటి పైన తిరిగి ప్రజల స్పందన ఎలా ఉంటుందో చూద్దాం.

వామపక్షాల ఐక్య స్వరం… ?

కొసమెరుపుగా ఒక మాట చెప్పుకోవాలి. ఇరవైముగ్గురు సభ్యులున్న ప్రతిపక్షం ముఖ్యమంత్రి జగన్ ప్రసంగాన్ని అడుగడుగున అడ్డుకుని అల్లరి చేసింది. అధికార పక్షాన్ని రెచ్చగొట్టింది. అసెంబ్లీ సమావేశాల్ని లైవ్ చూసే వారెవరికైనా తెలిసిపోయే విషయమిది. ఇప్పటి ప్రతిపక్షం ప్రభుత్వ పక్షంగా ఉన్నప్పుడు కనీసం ఒక్క వాయిదా తీర్మానానికి కూడా అనుమతించలేదు. అభివృద్ధి నిధులను ఎన్నికైన ఎమ్మెల్యేల ద్వారా కాకుండా ఓడిన (అప్పటి) పాలక పక్ష నేతల ద్వారా ‘ఖర్చు’ పెట్టించింది. ఆ వాస్తవాల దృష్ట్యా చూస్తే, నేటి పాలకపక్షం ప్రతిపక్షం పట్ల వ్యవహరించిన తీరును శ్లాఘించకతప్పదు. ప్రతిపక్షానికి జవాబిచ్చే సమయంలో… ప్రభుత్వ పక్షం ఇంకాస్త సంయమనంతో వ్యవహరించాల్సిందన్నది నిజమే గాని, నేటి ప్రభుత్వ పక్షం వ్ఫ్యక్తం చేసిన క్రోథం అహేతుకం కాదు. అదేదో మనవ హక్కుల సమస్య అయినట్లు, రాష్ట్రంలో ప్రజాస్వామ్యానికి కొత్తగా ఇవాళే చాల చెరుపు జరిగిపోయినట్టు… ముందుగా సిపిఐ నేత నారాయణ, ఆ పైన విరసం నాయకులు ధ్వజమెత్తడం తప్పక విచిత్రమే.  

నారాయణ, సిపిఐ

  

వంశీ పులి

వంశీ పులి: పూర్తి పేరు పులి. వంశీధర రెడ్డి. స్వస్థలం: కర్నూలు జిల్లా లోని వెల్గోడు గ్రామం.
డిప్లొమా సివిల్ ఇంజనీరింగ్ పూర్తి చేసి,. ప్రస్తుతం కర్నూలులో బీటెక్ ఫైనల్ ఇయర్ చదువుతున్నారు .

Add comment

Categories

Your Header Sidebar area is currently empty. Hurry up and add some widgets.