లడ్డూ కావాలా?! 

మొత్తానికి ఈ పార్టీ దాకా తెచ్చినందుకు హార్టీ కంగ్రాట్స్ రత్నంముగ్గురూ గొంతులు కలిపి పెద్దగా నవ్వారు.

చీర్స్అంటూ తలా ఒక గ్లాస్ అందుకున్నారు.

గోల్డెన్ ఫుడ్ హోటళ్ళ స్థాపనలో నాలుగో హొటల్ ప్రారంభ సమావేశం అయాక ఫౌండర్స్ మీటింగ్ జోరుగా జరుగుతోంది. 

అసలు మన ప్రయాణం చాలా గమ్మత్తుగా మొదలైంది. అప్పుల ఊబిలొ కూరుకుని ఏం చేయాలో తెలియకుండా తిరుగుతున్నప్పుడు కలిశాడు అయూబ్. ప్రజలంతా ఎలా చిరుతిళ్ళకు బానిసలౌతున్నారో చెప్పి బాధపడ్డాడు. వారికి కావాల్సిన సరైన పోషకాహారం ఎలా దొరకచ్చో చెప్పినప్పుడు  నాకీ ఐడియా వచ్చింది. అన్నాడు దాసు. 

అది సరే ఇంత చాలెంజింగ్ వ్యవహారాన్ని ప్రజల్లోకితీసికెళ్ళడం, ఇంత పెద్ద బిజినెస్, ఇంత తక్కువ కాలం లో ఎలా?’ రత్నం ఉత్కంఠ గా అడిగాడు.

ఏముంది? జనానికి తిండి మీద ఆరోగ్యం మీద విపరీతమైన ప్రేమలు కదా. వాట్సాప్ లో వచ్చినవన్నీ నమ్మడం, ఫార్వర్డ్ లు కొట్టడం జనానికి బాగ అలవాటయాయి కదా. అదే మనకి ప్లస్ పాయింట్. అందుకే ఆరోగ్యమే మహాభాగ్యం అనే గ్రూప్ క్రియేట్ చేశాం ముందుగా. రోజూ తినే తిండి ఎలా వారి ఆరోగ్యాన్ని, భవిష్యత్తును నాశనం చేస్తోందో పాపులర్ చేశాము. ఎలాటి ఫుడ్ వారిని మళ్ళీ ఆరోగ్యవంతుల్ని చేస్తుందో ఎక్కడ దొరుకుతుందో చెప్పాము. ఒక ఏంగ్జయిటీ సృష్టించాము. విడతలు విడతలు గా అన్ని చోట్లా దుకాణాలు తెరిచాము. మూడు నెలల్లో మొత్తం దుకాణాల్లో మన సరుకులకు డిమాండ్. ఇళ్ళలో వంటలు చేసుకోలేని వారికి ఇదుగో ఈ గోల్డెన్ ఫుడ్ హోటళ్ళు.  మన అయూబ్ ఉపన్యాసాలు యూ ట్యూబ్ లొ అదరగొట్టాయి. జనం వెర్రెత్తి పోతున్నారు. కంగ్రాట్స్ అయూబ్. అన్నాడు.

థాంక్స్ అన్నా. మొత్తానికి నాకో దారి చూపించావు.

నీకేంటి. అందరికీ అందరికీ నిశ్చింత.నవ్వుతూ ఇంకో రౌండ్ కి ఆర్డరిచ్చారు.

పక్క టేబుల్ దగ్గర రాగిలడ్డు, కొర్రల పుళిహొర ఆర్డరిస్తున్న భారీ దంపతులను చూస్తూ, ‘నీక్కూడా ఒక రాగి లడ్డు కావాలాకన్ను గీటుతున్నాడు దాసు.   

 

– డా.విజయ్ కోగంటి

డాక్టర్ విజయ్ కోగంటి

విజయ్ కోగంటి పేరుతో 1993 నుండి కవితా వ్యాసంగం. అనేక దిన, వార, మాస, పత్రికలు, ఆన్ లైన్ పత్రికలలో ప్రచురణలు. 2012 లో ‘కూలుతున్న ఇల్లు’ కవితకు నవ్య-నాటా బహుమతి. తెలుగు, ఇంగ్లీషుల్లో కవిత, కథారచనతో పాటు అనువాదాలు, సమీక్షలు, సాహిత్య బోధన ప్రధాన వ్యాసంగాలు. ’ఇలా రువ్వుదామా రంగులు’ (2017) మొదటి కవితా సంపుటి. స్వయం ప్రతిపత్తి గల ప్రభుత్వ మహిళా కళాశాలలో ఆంగ్ల శాఖాధ్యక్షుడు
drvijaykoganti@gmail.com

M: 8801823244

4 comments

Categories

Your Header Sidebar area is currently empty. Hurry up and add some widgets.