ఎవరో
ఏ దిక్కునుండి
వచ్చారో
నేను పరధ్యానంలో ఉండగా
ఎదురుగా
ముఖంనిండా
ప్రశ్నల పుస్తకం పరచుకుని
కంగారుగా లేరు
జవాబుకోసం ఆశగా
ఒక్క ప్రశ్నకైనా
ఒక ప్రశ్న
నేనెవరిని
మనిషిని!
ఏ మనిషి
తెల్లబోయాను
పులుముకున్న రంగుల్లో
ఏ మనిషని చెప్పలేక
నా దుర్గతికి తలదించుకున్నా
మళ్ళీ ప్రశ్న రాలి పడలే
నిష్క్రమించారు
ఇది సమాజం కాదని
సర్ అబ్స్ట్రాక్ట్ కావొచ్చునేమో, అసంపూర్ణమనిపించింది.
Ok sir. Thank you for response