మెకానికల్ ఇంజనీరింగ్

అక్కడ తలలు లేని సూత్రాలు
ప్రాణం లేని సమీకరణాలు
ఎందుకు పుట్టాయో తెలియని
ప్రమేయాలు
జీవితాలను లోతుగా అధ్యయనం
చేస్తుంటాయి

మధ్య మధ్యలో వేరే ప్రపంచపు
విద్యుత్తు, కంప్యూటర్ అవశేషాలు
పైపైన యుద్దం అని పూర్తిగా
మెదడుని తినేస్తుంటాయి

ప్రయోగాలు జరగని
ప్రయోగశాలలు ఒంటరిగా
చీకటిలో నానిపోతూ
మూలన ఎక్కడో పడి ఉంటాయి

కనపడని మడ్డి చేతులు
కనపడేలా గర్వపడుతుంటాయి
కాలేజీ దాటినపుడు
గేర్ బాక్స్ ను వెతకలేక
ఆ చేతులు నలుగురి ముఖాలను
దీనంగా తడుముతుంటాయి

మేమంతా లోహపు కొండలను
వెతుకుతూ పుస్తకమనే పంజరంలో
కరిగిపోతున్న లోహపు కొవ్వొత్తులం

సాయి భరత్

సాయి భరత్: కృష్ణా జిల్లా జగ్గయ్యపేట నివాసి. ఇటీవలే మెకానికల్ ఇంజనీరింగ్ పట్టభద్రులయ్యారు. కవిత్వం, పాటలు రాయడం తన హాబీ అంటారు.

1 comment

Categories

Your Header Sidebar area is currently empty. Hurry up and add some widgets.