కొన్ని పుస్తకాలూ దొరికే ప్రదేశాలూ!

నా పుస్తకాలను మీ దాకా తీసుకు వొచ్చే ప్రయత్నంలో నేను పెద్దగా సక్సెస్ కాలేదు. ఇదిగో ఇది మరో ప్రయత్నం. ఇది ఏమాత్రం విజయవంతమైనా, ఈ అనుభవాలు ఆధారంగా, ఇక ముందు నా రచనలను మరింత సమర్థంగా మీ వద్దకు చేర్చడానికి ప్రయత్నిస్తాను.

మీలో ప్రతి ఒక్కరి నుంచి ఈ విషయమై సహాయ సహకారాలు కోరుకుంటాను. మార్కెటింగ్ లో మీ సలహా సహాయాలు కోరుకుంటాను. పుస్తక రచనలో, ప్రచురణల్లో కూడా మీ నుంచి సలహా సహాయాలు కోరుకుంటాను. ఈసారి ఈ ప్రకటనలో మచ్చుకు నాలుగు పుస్తకాలను పరిచయం చేస్తాను:

 1. ‘కొంచెం శ్రీశ్రీ కొంచెం అజంతా కొంచెం రంగనాయకమ్మ ఇస్మాయిల్, చలం’… సాహిత్య వ్యాసాలు

నాకు బాగా యిష్టమైన తెలుగు కొందరు కవులూ రచయితలు కేంద్రంగా కొన్ని వ్యాసాలు, రచయితలు కాకుండా నేరుగా సాహిత్యాంశాలు కేంద్రంగామరి కొన్ని వ్యాసాలు. సాహిత్యంలో రాజకీయాలు వొద్దనడం కూడా ఒక సాహిత్య రాజకీయమేనని నిరూపణ,…. స్వేచ్చకు గొప్ప కొలమానం అనదగిన చెలం ఒక కథలో కులం బయాస్ కనిపించి పొందిన ఒక  క్రోధాశ్చర్యం… ఇలాంటి మొహమాట రాహిత్యాలు కూడా ఈ పుస్తకంలో వున్నాయి. మొత్తానికి రొడ్డకొట్టుడు తూనికరాళ్ళ సాహిత్య విమర్శ కాకుండా ఇవాళ్టి జీవితం సాహిత్యం తగిన పాళ్ళలో కలిసి వున్న ఈ పుస్తకం మూసుకున్న మనస్సులు తెరుచుకోడానికి, తెరుచుకున్న మనస్సులు హమ్ కీసీసే కమ్ నహీ అనుకోడానికి పనికొస్తాయని మా గట్టి నమ్మకం.  

 1. ఫేస్బుక్ తో ఐదేళ్లు

విప్లవాలు అవార్డులు దేవుళ్లూ పుస్తకాలు

ఈ పుస్తకంలో అన్నీ నా ఫేస్బుక్ మొదటి ఐదేళ్ళలో రాసిన పోస్టులు. దాదాపు అన్నీ ఏటికి ఎదురీతలే. పైన పుస్తకం వుపశీర్షికలో స్పష్టంగా సూచించినట్టు… నా చదివిన పుస్తకాలు, వుద్యమంలో ఉద్యమేతరంగా పొందిన అనుభవాలలోంచి… నేను ఇతర్లతో పేచీ పడిన సందర్బాలు ఇవన్నీ. ఎప్పుడూ పేచీ కోసం పేచీ పడలేదు గాని, ప్రతిసారీ పాతుకు పోయిన పీఠాల్నే ప్రశ్నించాల్సిన కష్టం వొచ్చింది. దాని వల్ల చాల నొప్పి కలిగినా, తుంపులు తుంపులుగానే అయినా, కొన్ని తప్పనిసరి సత్యాల్ని తడమాల్సి వొచ్చింది. పుస్తకం చదివే నా మితృలను ఈ ‘పోస్ట్’లు ఆలోచింపజేస్తాయనడంలో నాకెలాంటి సందేహం లేదు. మీరు చదివి… నాకే కాదు, లోకానికి కూడా చెప్పాలని విన్నపం.  (అన్నిటితో పాటు ఈ చిన్ని పుస్తకం వివరాలు కూడా కింది ప్రకటనలో వున్నాయి. 🙂 ) 

 1. ‘కనిపించని చెయ్యి’  

(17 నా కథలు + ఒక లూసున్ కథానువాదం)

మన జీవితాల్ని నడిపించే కనిపించని చెయ్యి భగవంతుడేం కాదు. కానప్పుడు మరదేమిటి అనే అన్వేషణ టైటిల్ కథలోనే గాక అన్ని కథల్లో వుంటుంది. దాదాపు అన్నీ ఒక పల్లెటూరి అబ్బాయి కథలే. ఇందులో ఎండ వుంది. ఉంటుందో లేదో తెలీని రాయలసీమ వాన వుంది. ప్రేమ వుంది, కోపం వుంది. ఆశ నిరాశలు వాటి వేర్లను వెదుక్కునే ఆరాటాలున్నాయి. చెప్పాలా ఇవన్నీ ఒక రాయలసీమ రైతు బిడ్డ కథలు. రైతు కథలు, కరువు కథలు, ఫాక్షన్ కథలు బాగానే చదివి వుంటారు. ఇవి ఆ కరువు, ఫాక్షన్ జోలికి పోని రైతు బిడ్డ కథలు. వీలయితే కొని చదివండి, వీటి గురించి రాసి ఇతర్లు చదివేలా చూడండి. (మహా భారతం మీది ప్రేమతో అంకెను 18 చేయాలని చైనా మహాకవి లూసున్ ట్రెండ్ సెట్టర్ కథ ఒకదాన్ని అనువదించి బుక్కు చివర్న చేర్చాను)

 1. సంకేత స్థలం

(2015, 2016 లో నా కవిత్వం) 

ఇంగ్లీషులో ‘రెండెవూ’, తెలుగులో ‘సంకేత స్థలం’. రహస్యంగా కలుసుకోవలసిన వాళ్లు కలుసుకోడానికి నిర్ణయించుకునే స్థలం. ఇద్దరు ప్రేమికులు కావొచ్చు. ఇద్దరు లేదా కొందరు విప్లవకారులు కావొచ్చు. ఇద్దరు లేదా కొందరు మనుషులు కూడా కలుసుకోవాలి. మనుషులు కలుసుకోడానికీ ఎన్నెన్నో అడ్డంకులు. నిషేధాలు. అయినా మనుషులు కలుసుకోవాలి. వాళ్ళు కలుసుకోడానికి, చెడుగు మీద, అప్రేమ మీద కుట్రలు చేయడానికి ఒక స్థలం కావాలి, ఆ స్థలం కవిత్వం కావొచ్చు. ప్రేమ కావొచ్చు. అలాంటి స్థలం కోసం ఒక భావుకుని క్రేవింగ్ ఈ కవిత్వం. తన లాంటి క్రేవింగ్ వున్న ‘వ్యసనపరులు’ చాల మంది కోసం ఈ కవిత్వం. మన క్రేవింగ్ ను నేను ఏ మేరకు వ్యక్తం చేశానో  చదివి చెప్పండి.

 • ఈ పుస్తకాలు షాపులల్లో సరిగ్గా దొరకవేమో. అందుకని, నేరుగా ఈ కింది అడ్రసులకు డబ్బు పంపి తెప్పించుకోవాలని విన్నపం. ఒకటి రెండు రోజులు ఆలస్యం కావొచ్చు గాని, గ్యారంటీగా మీకు పుస్తకాలు అందుతాయి. 
 • పోస్టు కోసం అదనంగా డబ్బు పంపనవసరం లేదు. ఎక్కువ పుస్తకాలు ఆర్డర్ చేస్తే మాకు చాల చాల సంతోషం. నిజానికి అందుకే మీకు కాస్త వైవిధ్యం కనిపించాలనే ఒకే సారి ఏడెనిమిది పుస్తకాలను మార్కెట్ చేయాలని ప్రయత్నిస్తున్నాం. ఇవి అయిపోయే లోగా కొత్తవి వొస్తాయి.
 • ఇండియాలోనైతే ఈ కింది చిరునామాకు రాయండి:

హెచ్చార్కె బుక్స్, ℅ B. Chandrasekhar, House No: 1-8-37/A/1,

Near Aurora cillege, Chikkadpalli, Hyderabad- 20.

చంద్రశేఖర్ గారి ఫోన్ నంబర్లు: 040-48511739 (ల్యాండ్), 8374256278 (మొబైల్)

అమెరికా మిత్రులు ఈ కింది చిరునామాకు రాయొచ్చు.

hrk, c/o Mamatha Kodidela, 229, concord Pl, Pennington, NJ, USA 08534. Phone: 609 647 2863 . అమెరికాలో డబ్బు మమత పేరిట పంపాల్సి వుంటుంది. నాకింకా బ్యాంక్ అక్కౌంటు లేదు.

ఈ మూడు పుస్తకాలతో పాటు కింది నా పుస్తకాలన్నిటి కోసం రెండు చిరునామాలకు రాయొచ్చు.

 1. కనిపించని చెయ్యి (హెచ్చార్కె కథలు) వెల: రూ. 130/- ; డాలర్లు 5/- లేక 10/- మీ యిష్జం.
 2. కొంచెం… కొంచెం… (హెచ్చార్కె సాహిత్య వాసాలు) రూ. 70/- ; డాలర్లు 5/- లేక 10/- మీ యిష్జం.
 3. ప్ర. జ. ( రచయితల సమస్యలపై ప్రశ్నలకు హెచ్చార్కె జవాబులు) రూ. 10/- ; డాలర్లు 5/- లేక 10/- మీ యిష్జం.
 4. ఆకుపచ్చ వెన్నెల (మరో కవితా సంపుటి) వెల: రూ. 100/- ; డాలర్లు 5/- లేక 10/- మీ యిష్జం.
 5. సత్యమేవ రమణీయం (ఆస్కార్ వైల్డ్ నాటకానికి హెచ్చార్కె తెలుగు) రూ. 60/- ; డాలర్లు 5/- లేక 10/- మీ యిష్జం.
 6. .. ఫేస్ బుక్ తో ఐదేళ్లు (వివిధ అంశాలపై ఫేస్ బుక్ లో స్పందనలు ప్రతిస్పందనలు) రూ. 90/- ; డాలర్లు 5/- లేక 10/- మీ యిష్జం.
 7. రగిలే వీలుందని (హెచ్చార్కె కవితా సంపుటి) రూ. 60/- ; డాలర్లు 5/- లేక 10/- మీ యిష్జం.
 8. ఎలకలు మనుషులు (స్టెయిన్ బెక్ నవలకు హెచ్చార్కె అనువాదం) రూ. 60/- ; డాలర్లు 5/- లేక 10/- మీ యిష్జం.

పుస్తకాల ధరల విషయంలో మేము ఖచ్చితంగా వుండం. కాస్త అటు ఇటుగా పంపినా ఫరవాలేదు. 🙂 . మీరు పుస్తకం కొని చదవడం కావాలి మాకు.

 • ఈ విషయంలో ఎలాంటి ఇబ్బంది ఎదురైనా నా మెయిల్ ఐ డి కి రాయండి:

<rastha.hrk@gmail.com>

 • మిత్రులు బి చంద్రశేఖర్ నా పుస్తకాల్ని రాష్ట్రంలో రెగ్యులర్ బుక్ షాప్స్ లోనే కాకుండా ఈ కింది విధంగా మరి పలు చోట్ల వుంచారు. ఇందులో ఏవైనా మీకు దగ్గర్లో వున్నట్లయితే, అక్కడే పుస్తకాలు కొనొచ్చు. మీకు పోస్టు చేసే డబ్బు షాపు వాళ్ళకు పోతుంది.
 • ఈ షాపుల్లో పుస్తకాలు దొరకడం లేదంటే, చంద్రశేఖర్ గారికి గాని, నాకు గాని ఓ ఫోన్ లేదా మెయిల్ కొట్టాలని మనవి.

షాపులు:

1) కె. ప్రవీణ్ కుమార్,

సాయి తేజ బుక్ షాప్,

రోడ్ నం. 12 – ఎన్ బి టి నగర్

బంజారా హిల్స్- హైదరాబాద్

ఫోన్: 9246366112

 1. Praveen Kumar,

Sai Teja Book Shop

Road No .12    – N B T Nagar

Banjarahills     – Hyderabad

Cell . 9246366112

 

2) లిఖిత ప్రెస్,

స్ట్రీట్ నంబర్: 9- ఎస్ బి ఐ కాలనీ,

గాంధీనగర్- హైదరాబాద్

ఫోన్: 9948352008

Likitha Press

St No. 9 – SBI Colony

Gandhinagar – Hyderabad

Cell. 9948352008

 

3) ఎ.వి రెడ్డి,

మూన్ స్పోకెన్ ఇంగ్లీష్, దిల్ సుఖ్ నగర్, హైదరాబాద్

ఫోన్: 8187041458

A.V. Reddy

Moon Spoken English

Dilsukhnagar , Hyderabad.

Cell. 8187041458  & 7396050342

 

4) నాగేశ్వర రావ్, లక్ష్మి సాయి పబ్లికేషన్స్,

హయత్ నగర్, హైదరాబాద్,

ఫోన్: 9848813249

Nageswara Rao

Laxmi Sai Publications

Hayathnagar,  Hyderabad

Cell. 9848813249

 

5) ఆదర్శ్ బుక్ డిపో, యూనివర్సిటీ రోడ్,

కూరగాయల మార్కెట్ దగ్గర,

నల్లకుంట, హైదరాబాద్

ఫోన్: 04027671054, 9849708749

Adarsh Book DepotUniversity road ,

Near vegitable market

Nallakunta , Hyderabad .

Ph . 040. 27671054 –  Cell . 9849708749

 

6) శాంతి బుక్ హౌస్, బజాజ్ ఎలక్ట్రానిక్స్ దగ్గర,

శంకర్ మఠ్ మెయిన్ రోడ్,

నల్లకుంట, హైదరాబాద్

ఫోన్: 9490324386

Santhi Book House

Near Bajaj Electronics ,

Sankarmatt Main Road ,

Nallakunta , Hyderabad .

Cell . 9490324386

 

7) శ్రీ బాలాజీ బుక్ డిపో

యూనివర్సిటీ రోడ్, కూరగాయల మార్కెట్ వద్ద,

నల్లకుంట, హైదరాబాద్

ఫోన్: 040 27613300, 040 27660852, 9676996109, 9676996199

Sri Balaji Book Depot

University road , Near vegitable market

Nallakunta , Hyderabad .

Ph . 040. 27613300 , 040.27660852

Cell . 9676996109 , 9676996199

 

8) శ్రీ ప్రజా బుక్ హౌస్,

మహాత్మ గాంధి బస్ స్టాండ్ (ఎం జి బి ఎస్) ,

ఇమ్లిబన్ బస్ స్టాండ్, హైదరాబాద్

ఫోన్: 040. 24746689, 9849977084 , 9000239677.

Sri Praja Book House

Mahathma Gandhi Bus Stand (MGBS)

Emlibun Bus Stand , Hyderabad .

Ph . 040. 24746689

Cell. 9849977084 , 9000239677.

 

9) నీల్ కమల్ బుక్ లింక్స్,

ఎడ్యుకేషనల్ బుక్ సప్లయర్స్,

సుల్తాన్ బజార్, హైదరాబాద్

ఫోన్స్: 040.24757140 , 24757197.

 

Neelkamal Book Links

Educational Book Suppliers,

Sulthan Bazar, Hyderabad

Ph. 040.24757140 , 24757197.

 1. రచన బుక్ షాప్,

హయత్ నగర్, హైదరాబాద్

ఫోన్: 8328332038.

Rachana Book Shop

Hayathnagar , Hyderabad

Cell. 8328332038.

 

 1. తెలుగు బుక్ హౌస్,

బిగ్ బజారు వద్ద,

కాచిగూడా – హైదరాబాద్

ఫోన్: 9247446497.

Telugu Book House

Near  Big Bazar

Kachiguda – Hyderabad

Cell . 9247446497.

 

 1. స్టార్ డ్రీమ్ బుక్ స్టాల్,

స్పెన్సర్స్ షాపింగ్ మాల్,

ముషీరాబాద్, హైదరాబాద్

ఫోన్: 8686261935

Star Dreams Book Stall

Spensors Shopping Mall

Musheerabad , Hyderabad.

Cell. 8686261935

 

 1. సి.ఎల్.ఎస్. బుక్ షాప్

కలెక్టర్ ఆఫీసు వద్ద,

నాంపల్లి, హైదరాబాద్,

ఫోన్: 9292853294 .

C.L.S Book Shop

Near Collector Office ,

Nampally , Hyderabad .

Cell . 9292853294 .

 

 1. సహచర బుక్ షాప్. సుందరయ్య పార్క్ వద్ద,

బాగ్ లింగం పల్లి, హైదరాబాద్

ఫ్ఫోన్: 9848348173

Sahachara Book Shop

Near Sundaraiah Park

Baghlingampally , Hyderabad .

Cell . 9848348173

 

 1. సెంట్రల్ బుక్ షాప్, అమీర్ పేట్ బ్రాంచ్

గ్రీన్ పార్క్ హోటల్ కు ఎదురు సందు.

ఫోన్స్: 040 . 23203108 , 040. 23400789 .

Central Book Shop

Ameerpet Branch ,

Lane Opp. Green Park Hotel

Ph . 040 . 23203108 , 040. 23400789 .

 

 1. సెంట్రల్ బుక్ షాప్,

ఆబిడ్స్ బ్రాంచ్, స్లేట్ స్కూలు వద్ద,

చాపెల్ రోడ్, హైదరాబాడ్

ఫోన్స్: 040. 23203108 & 040. 66468646 .

Central Book Shop

Abids Branch , Near Slate School

Chapel Road , Hyderabad .

Ph . 040. 23203108 & 040. 66468646 .

 

 1. ఆంధ్రా బుక్ సస్తాల్,

వి స్ట్రీట్

కడప.

ఫోన్: 9849165711 .

Andhra Book Stall

Y V Street

Cell . 9849165711 .

 

 1. లక్ష్మీ నారాయణ

ఆర్ టి సి బస్ స్టాండ్,

అనంతపూర్

ఫోన్: 7396509767

LAKSHMI NARAYAN

R.T.C Bus Stand

ANANTHAPU

Cell . 7396509767

 

 1. రాయల సీమ సాహిత్య సౌరభాలు,

రామ్ ప్రసాద రెడ్డి & అశోక్ వర్ధన్ రెడ్డి

ఫోన్స్: 7075351872    & 9052667668

19) Rayalaseema Sahithya Sowbharalu

Ram Prasad Reddy & Ashok Vardhan Reddy   

Cell -7075351872    & 9052667668

 

 

హెచ్చార్కె

Add comment

Categories

Your Header Sidebar area is currently empty. Hurry up and add some widgets.