అమ్మ

రజోసిక్ మిత్రా: కోల్ కతా

(ఆంగ్లమూలం: రజోసిక్ మిత్రా: కోల్ కతాలో పుట్టి పెరిగి నివసిస్తున్న ఈ యువకవి ఒక సంగీతకారుడే కాక, సినిమా స్క్రిప్టు రచయిత, సాహిత్య విద్యార్థి, సైన్సు అభిమాని, ఛాయాచిత్రకారుడు కూడా. సంగీతానికీ, చిత్రనిర్మాణానికీ సంబంధించిన ప్రాజెక్టులలో పాలు పంచుకుంటుంటాడు.)

అమ్మా, నిన్ను చూస్తే భయమేస్తోంది
నా చుట్టూ పగిలిన నేల, ముక్కలైన ఆత్మలు
నా పొరుగువాళ్లు నేలకు ఉప్పు పట్టించి
నీ భద్రత మీది బెరడును చెక్కిపారేశారు
వాళ్లు మాంసాన్ని కాలుస్తూ
గాలిని మండిస్తూ వెలిగిస్తారు
రాత్రంతా మేల్కొని వుంటారు

అమ్మా, మేం ఒకరినొకరు చంపుకుంటాం
రాత్రిపూట నా పాదాలకింది నేల
కంపించడం నా అనుభవంలోకి వచ్చింది
నాకు అందమైన కొత్తయిల్లు వద్దు!
అదెందుకు నాకు?
ఊడిపోయిన పెయింట్ తో వున్న ఈ గోడలన్నీ
నా వెనకాల గుసగుసలాడుతున్నాయి
పైకప్పులు కూలి నామీద పడుతుంటే
నేను పక్కకు తిరిగి పడుకోవటం తప్ప
ఏమీ చేయలేనని తెలుసు నాకు
అయినా చెప్పు,
పొదలు నోళ్లు తెరిచి
కల్మషం లేని లేడిని ఎందుకు మింగుతాయి?
వేలమంది చనిపోయారు
ప్రతిరోజూ ఇంకెందరో చనిపోతున్నారు
అర్థమైంది నాకు, ప్రక్షాళన జరుగుతోందని
నీ వాతావరణంలో ఉగ్రత్వముంది
ఇంకా చాలామంది చనిపోతారు
భరించలేనంత మృత్యువును
మాకు బోధిస్తావు నువ్వు
నేల, నీళ్లు, తైలం మాకు కాకుండా చేస్తావు
గాలిమీద ఆధారపడి నీళ్లు నిప్పు
మా ఉదయపు చాయ్ లనూ పేపర్లనూ
దుఃఖంలో ముంచుతాయి

కానీ అమ్మా!
కాంతి లేని నీ అంధకారపు కాంక్రీటు తోపుల్లోని
ఒక అమ్మాయిని ప్రేమిస్తున్నాను నేను
మేము తయారు చేసుకున్న తోటల్లో తిరుగుతూ
రేపటిగురించి ఆలోచిస్తాం
ఆమె తెలివి భయంకరం
కానీ కాపురం పెడదాం అంటోంది
నువ్వొప్పుకోవని నేనామెకు చెప్పను
బహుశా మంచి జరగాలని.
ఎర్రని గాలి నా ముఖాన్ని
ఎలా చీలుస్తుందో ఆమెకు చెప్పను

 

Mother

Mother, you scare me.
Cracked soil, broken souls
all around me.
>My neighbours
have salted the ground
and scraped off the bark
of your safety shades.;
they burn and light the wind
burning flesh,
they stay awake, all night.

We kill each other, Mother,
at night I’ve felt the ground shake
beneath my feet.
I don’t want a rosy new villa!
How could that be for me?
All these paintscrap walls whisper
behind me,
and I know
I could only turn on my sides and sleep
when the ceilings come down on me.
Though, tell me,
why do the shrubs open up, swallow
the untainted gazelle?
Thousands dead, more dying
every turn of your day.
I get it,
cleansing is in motion.
There’s rage in your atmosphere
more will die and you’ll teach us
death
more than we can bear.
You’ll strip us of soil,
drink and oil.
Water and fire will ride on air
and bring sadness to our morning
tea and paper.

But Mother, I’ve fallen in love
with a girl in your dull and bleak concrete groves.
We walk down the parks we’ve made
and think of tomorrow;
she’s frightfully wise
but she’d say  – “We’ll make a home.”
I don’t tell her
you’ll not have us
may be, for the best.
I don’t tell her
how the rd wind
would rip my face.

ఎలనాగ

ఎలనాగ: అసలుపేరు డాక్టర్ నాగరాజు సురేంద్ర. పుట్టింది కరీంనగర్ జిల్లాలోని ఎలగందులలో, 1953. చిన్నపిల్లల డాక్టరు కాని, ప్రాక్టీసు చెయ్యటం లేదు. రాష్ట్రప్రభుత్వ వైద్య ఆరోగ్యశాఖలో పని చేసి, డెప్యూటీ కమిషనర్ స్థాయి హోదాలో 2012 లో పదవీ విరమణ.
ఇప్పటి వరకు 24 పుస్తకాలు రాశారు. పన్నెండు స్వతంత్ర రచనలు, 12 అనువాదాలు. అనువాదాల్లో 8 ఇంగ్లిష్ నుండి తెలుగులోకి, 4 తెలుగునుండి ఇంగ్లిష్ లోకి. తెలుగులో వచనకవితా సంపుటులు, ఛందోబద్ధ పద్యాల సంపుటి, ప్రయోగపద్యాల సంపుటులు, గేయాల సంపుటి, భాష గురించిన వ్యాసాల సంపుటులు, ప్రాణిక గళ్లనుడికట్ల పుస్తకం.
లాటిన్ అమెరికన్ కథలు, ఆఫ్రికన్ కథలు, ప్రపంచదేశాల కథలు, సోమర్సెట్ మామ్ కథలు - తెలుగు చేశారు. కవిత్వాన్ని ఇంగ్లిష్ నుండి తెలుగు లోకి, తెలుగునుండి నుండి ఇంగ్లిష్ లోకి అనువదించారు. వట్టికోట ఆళ్వారు స్వామి రచించిన ‘జైలు లోపల’ ను Inside the Prison పేరుతో, పవన్ కుమార్ వర్మ రాసిన Ghalib: The Man The Times ను ‘గాలిబ్ - నాటి కాలం’ శీర్షికతో ఆంగ్లంలోకి అనువదించారు. శాస్త్రీయ సంగీతం మీద స్వయంగా రాసిన తెలుగు కవితలను Memorable Melody Makers and Other Poems on Music పేరిట అనువదించి, ప్రచురించారు. తెలంగాణ సాహిత్య అకాడమి వారు ప్రచురించిన Astitva - Short Fiction from Telangana కు సహసంపాదకత్వం వహించారు. Indian Literature, Muse India, Episteme మొదలైన ప్రింట్/ వెబ్ పత్రికల్లో వీరి అనువాద కవిత్వం అచ్చయింది.

4 comments

Categories

Your Header Sidebar area is currently empty. Hurry up and add some widgets.