కమ్యూనికేషన్ స్కిల్స్ – విజయానికి విటమిన్ పిల్స్

కమ్యూనికేషన్ స్కిల్స్ అని మనం తరచూ తెగ ఉటంకిస్తూ ఉంటాంవ్యక్తిత్వ వికాస నిపుణులకుఉద్యోగాలిచ్చేవారికి  మాట నాలుక మీద నాట్యం చేస్తుంటుందిఇదే వారి వ్యాపార విజయానికి తారక మంత్రంఅబ్బేవాడికి కమ్యూనికేషన్ స్కిల్స్ లేవండీఉద్యోగం కొంచెం కష్టమే అని నాలుక చప్పరించేస్తారుదానితో మనంచప్పబడిపోతాంఇన్ని మార్కులొచ్చినా ఇంకా మనకేమిటో లేదంటాడేమిట్రా బాబూ అని దిగాలు పడిపోతాంఅదేనైపుణ్యాలకున్న శక్తిఅదే కమ్యూనికేషన్ స్కిల్స్ మహత్మ్యంఅతిగా ఉన్నా ప్రమాదమేఅతి తక్కువగా ఉన్నా ప్రమాదమేసమతుల్యతనియంత్రణ సాధించడమే నిజమైన కమ్యూనికేషన్ స్కిల్ఎక్కడ తక్కువ మాట్లాడాలోఎక్కడ ఎక్కువ మాట్లాడాలో తెలిసి మసలుకోవడమే కమ్యూనికేషన్ స్కిల్కేవల జ్ఞానం ఉంటే సరిపోదుఅదినలుగురికీ పంచగలిగే కమ్యూనికేషన్ స్కిల్స్ ఉండాలి నైపుణ్యాలను సానుకూల వైఖరితోనలుగురినీప్రభావితం చేసే విధంగా  వినియోగించడం అభ్యసించాలినిరంతర అధ్యయనం చేయాలిఅభ్యాసము కూసు విద్యఅననే అన్నారు  కదా!

Communication is a skill which will thrill you, if you use it with skill; otherwise it will kill you! 

మాటే మనుషుల మధ్య రణానికీమరణానికీ కూడా కారణమవుతుందినైపుణ్యంతో సంభాషిస్తేఅనుకున్న పనులైపోతూఉత్సాహం  కలుగుతుంటుందిభలే చేశాం అనిపిస్తుంటుందిసంభాషణా నైపుణ్యం మన వ్యక్తిత్వాన్ని ప్రతిఫలిస్తూ ఉంటుందిమన సంభాషణా నైపుణ్యమే మన విజయాల స్థాయినిశీలాన్ని ప్రతిబింబిస్తూఉంటుందిఅందుకేనోరు మంచిదైతే ఊరు మంచిదవుతుందంటారు పెద్దలుఊరేమిటిప్రపంచమేమంచిదవుతుందిఅందుకే వేమనసజ్జనుండు పల్కు చల్లగాను అంటాడుసజ్జనుడైనవాడు చల్లగా పలకాలిసౌమ్యంగా మాట్లాడాలిఎందుకు?  పనులన్నీ మనకు కావలసినట్టు చక్కబెట్టుకోవడానికి

Communication is nothing but dissemination of information to get the things done either in workplace or in daily life.

మనం ఒక కంపెనీలో మేనేజర్ అయితే  సరస సంభాషణా నిపుణ చాతుర్య విద్య చక్కగాఅక్కరకొస్తుందిఒక పనిని చక్కబెట్టే మామూలు మేనేజర్ స్థాయి నుండి మనల్ని నాయకత్వ స్థాయికితీసుకెళుతుందినాయకత్వం కావాలంటేసంభాషణా నైపుణ్యంతో పాటుఅనితర సాధ్యమైన ఓర్పుసిబ్బందినిపర్యవేక్షించడంలో సుశిక్షితమైన నేర్పు ఉండాలిఇవి లేనప్పుడు కేవలం మేనేజర్ గానే మిగిలిపోతారు!  మేనేజర్ అంటే కేవలం నియమ నిబంధనలు పాటిస్తూసిబ్బందిని పర్యవేక్షించేవాడు మాత్రమేమరి నాయకుడుఅవసరమైతే సానుకూల చొరవ తీసుకునిసిబ్బంది నిర్వహణకుసంక్షేమానికి అడ్డంకిగా ఉన్న నియమ నిబంధనల బంధనాలనుసునాయాసంగా ఛట్ ఫట్ మంటూ తెంపేస్తాడుఅటువంటి వాడే  సంస్థలోనైనాఏదేశంలోనైనా  నాయకుడవుతా డుఇటువంటి నాయకత్వానికి అద్భుతమైన తిరుగులేని పునాది  కమ్యూనికేషన్ స్కిల్స్  అంటే నిపుణ సంభాషణం!  

మాట – విజయానికి రాచబాట

మాట మనిషికి చిరునామామాట మనిషిని పట్టిస్తుందిమాట మనిషికిఉనికినిస్తుందిఉన్నతినిస్తుందిఉన్నస్థానాన్నుంచి ఉన్నత స్థానానికి తీసుకెళుతుంది. మాట మనిషి జాతకాన్ని మార్చేస్తుందిమాట మనిషిని పాతాళానికి తొక్కేస్తుంది.ఆకాశానికి ఎత్తేస్తుందిలోకం చుట్టిన వీరుణ్ణి చేస్తుందిఅటువంటి మాట మనిషి సంభాషణా నైపుణ్యానికి, (Conversational Skills) సమాచార వితరణకు  (dissemination of information) ఆయువు పట్టుఆటపట్టువిజయానికి తొలి మెట్టువిజయశిఖరాలు చేర్చే విహంగం!

సమాచారాన్ని నైపుణ్యంతో ఎదుటివారికి నొప్పింపకతా నొవ్వక అన్నట్టు  తెలియచేయడానికి మాట ఒక్కటే రాచబాటమహోన్నత విజయాలుఅనితర సాధ్యమైన జీవన సాఫల్య శిఖరాలు  అధిరోహించిన వారు మాటల రెక్కలవిమానాన్నే వాహనంగా చేసుకుని చరిత్ర సృష్టించారుఅందుకే నిర్ద్వంద్వంగా అందరూ చెప్పే మాట  ఒక్కటేవ్యక్తిగత  జీవితంలోనైనావృత్తిగత జీవితంలోనైనా విజయం సాధించాలంటే ‘కమ్యూనికేషన్ స్కిల్స్అనివార్యంమరి ఇలా మాట్లాడే నైపుణ్యాన్ని ఎలా సొంతం చేసుకోవాలిఎలా నేర్చుకోవాలి?

సానుకూలవైఖరి – సంభాషణాచాతురి

మీ సమాచార వితరణా నైపుణ్యం మీ వైఖరిని తెలియచేస్తుందిమీ సానుకూల వైఖరిని మాటల్లో పట్టిస్తుందిఅందుకే మీ వైఖరికమ్యూనికేషన్ స్కిల్ సమాంతరంగామీ విజయాల రైలుకు పట్టాల్లా పని చేస్తాయిఇవి రెండూపాలూ నీళ్ళలా కలవకపోతే మీకు విజయం ఆమడ దూరంలో ఉంటుందిఅపజయం ఎప్పుడూ పలకరిస్తూనేఉంటుందిమీ మాట మీ వైఖరికి వెన్నుదన్నుగా నిలుస్తుందిమీ మాటలో మీ వైఖరి తెలుస్తుందిఉదాహరణకుమీ నాన్నగారు ఇంట్లో ఉన్నారా?‘ అని పిల్లవాణ్ణి అడిగితే,‘ఉన్నారండీరండికూర్చోండి ‘ అంటాడు!‘మీ అయ్యఇంట్లో ఉన్నాడేరాఅంటే, ‘ఉన్నాడ్రారా కూర్చోఅంటాడు. మనం  విధంగా పలకరిస్తే, ఎదుటివారు కూడా అదేవిధంగా స్పందిస్తారుసానుకూల వైఖరికిసంభాషణా చాతురికి  సంబంధమేమిటో చూద్దాం!

  1. సానుకూలసమాచార వితరణా వైఖరి (Positive Communication)
  2. చొరవతీసుకునేందుకు దోహదం చేసే సంభాషణా వైఖరి (Proactive Communication)
  3. ఉత్పాదకసంభాషణా వైఖరి (Productive Communication)
  4. సాఫల్యసంభాషణా వైఖరి (Progressive Communication)

మీరు మాట్లాడే వైఖరి సానుకూలంగా ఉంటే ఎదుటివారు కూడా సానుకూలంగానే స్పందిస్తారుఅలా మీరు మాట్లాడగలిగితే అది మీరు ఒక పని కావడానికి చొరవ తీసుకునే సంభాషణా వైఖరి అవుతుందిఎప్పుడైతే చొరవ తీసుకుని పని అయ్యేలా మీ సంభాషణా చాతురిని ఉపయోగించారోఅప్పుడు అది మీ ఉత్పాదక సంభాషణావైఖరిని ప్రతిఫలిస్తుందిఅంటే ఒక వస్తువును ఉత్పత్తి చేయడానికి గానీసేవలను అందచేయడానికి గానీ మీరుమీ సంభాషణా  చాతుర్య వైఖరిని వినియోగిస్తున్నారన్నమాటఎప్పుడైతే మీ సంభాషణా చాతుర్యం ఉత్పాదకవైఖరికి తోడయ్యిందోఅంటే ఒక పని జరిగేందుకు దోహదం చేసిందోఅప్పుడు అది మీ సాఫల్య సంభాషణా వైఖరినిప్రతిబింబిస్తుందిఒక పనిని సానుకూలంగా పూర్తి చేయడంలో మీ సంభాషణా నైపుణ్య వినియోగ ప్రతిభను నలుదిశలా చాటుతుందిఇదే  ‘కమ్యూనికేషన్ స్కిల్స్మనం సాధించామనడానికి విస్పష్ట నిదర్శనంఅప్పుడు మీకువ్యక్తిగత జీవితంలోనువృత్తిగత  జీవితంలోను డిమాండ్  పెరుగుతుందిమీరు చేరే విజయ తీరాలకు అంతులేని వారధి ఏర్పడుతుందిమీరు గమనించారో లేదో గానీపైన attitude అని ఉండాల్సిన చోట ‘కమ్యూనికేషన్’ అని మార్చాను. అంటేమీ సానుకూల వైఖరిమీ సంభాషణా చాతురి సమానార్ధకాలుఅంటే రెండింటికీ  ఒకటే అర్ధంఏది సరిగా  లేకపోయినా జరిగే అనర్ధం వల్ల వృత్తిగత జీవితమే కాకవ్యక్తిగత జీవితం కూడా ప్రమాదంలోపడుతుంది.  మరి పరిష్కారం పద్యాన్ని మననం చేసుకుంటూ ఆచరణలో పెట్టడమే. అప్రస్తుత ప్రసంగాల వీరుల కంటే ఆచరణవాదులే అసాధారణ విజయాన్ని అలవోకగా ఆకర్షిస్తారు. ఆచరణే విజయానికి తారకమంత్రం. ‘అల్పుడెపుడు పలుకుఆడంబరముగానుసజ్జనుండు పలుకు చల్లగానుకంచు మ్రోగునట్లు కనకంబు మ్రోగునావిశ్వదాభిరామవినురవేమ!  ఇదే కమ్యూనికేషన్ స్కిల్స్ సారాంశం!

 

చల్లా రామ ఫణి

చల్లా రామ ఫణి - వృత్తిరీత్యా కార్పొరేట్ ట్రైనర్. ప్రవృత్తి రీత్యా కవి, రచయిత. కొన్నాళ్ళు గుమస్తాగా, కొన్నాళ్ళు పాత్రికేయుడుగా, ఓ సంవత్సరం పైగా మారిషస్ లో తెలుగు వారికి తెలుగు బోధన, ఫార్మా రంగంలో మానవ వనరుల శాఖలోనే గత రెండు దశాబ్దాలుగా ఉద్యోగం. ప్రస్తుతం కార్పొరేట్ ట్రైనర్ గా స్థిరపడ్డట్టే అనిపిస్తోంది. తొలి కవితల సంకలనం 'త్రిశంకు నరకం' కు ఆంధ్ర మహిళా సభ వారి 'దేవులపల్లి కృష్ణశాస్త్రి పురస్కారం' అందింది. డెలాయిట్ మానవ వనరుల శాఖ డైరెక్టర్ ఎస్.వి.నాథన్ ముందుమాటతో అంగ్లంలో ‘Access Success… Infinite’ అనే వ్యాసాల సంకలనం 2017లో వెలువడింది. అమెజాన్ లో ఈ పుస్తకం అందరికీ అందుబాటులో ఉంది.

Add comment

Categories

Your Header Sidebar area is currently empty. Hurry up and add some widgets.