పంజాబ్ మెకానిక్

రోజు సాయంత్రం సన్నగా వాన మొదలైతే  శంకర్ విలాస్ లో కాఫీ తాగుదామని దూరాను. నా టేబుల్ ముందు కుర్చీ ఖాళీగా వుంది. సన్నగా పొట్టిగా  వున్న వ్యక్తి   హడావుడిగా వచ్చి కూర్చున్నాడు. బాగా నూనె రాసి జుట్టు వెనక్కి దువ్వి వున్నాడు. రుమాలు తీసి ముఖం తుడుచుకుని తల అద్దుకున్నాడు. కాఫీ ఆర్డర్ చేశాడు. నేను పలకరింపుగా నవ్వాను. టేబుల్ మీద కారు తాళం చూసిమారుతీ బండి సార్అన్నాడు

ఎస్టిలోపదేళ్ళయింది.’ 

మంచి బండే సర్ ఎందుకో ఆపేశాడు.’ 

నాకు కొంచెం గర్వంగా అనిపించింది. ‘అవును మంచి మైలేజ్. సీటింగ్ కంఫర్ట్. ఇలాటి వూళ్ళలో భలే కంఫర్ట్.

మీరేంచేస్తారు’.

మెకానిక్ సర్.’ 

అవసరమైతే రావచ్చాఅంటేతప్పకుండా సర్. రండి. నా పేరు జస్విందర్. పంజాబ్ మెకానిక్ అంటే ఏరియాలో ఎవరైనా చెప్తారుఅన్నాడు. చాలా నిదానంగా కంగారు లేకుండా నవ్వుతూ మంచి తెలుగు మాట్లాడే పంజాబీని చూడడం అదే మొదటిసారి. ‘పంజాబ్ మెకానిక్, ఆంధ్రాలో?’ అన్నాను నవ్వుతూ. ‘అదో పెద్ద కథ సర్ అన్నాడుఅదే నవ్వుతో.

తర్వాత ఎపుడో ఏదో అవసరం పడి అతని దగ్గరకెళ్ళాను. ‘ఏంటి సర్. గుర్తున్నానా. ఏం కావాలి సర్అంటూ చెక్ చేసి బయటకన్నా ఏభై రూపాయలు తక్కువకే చేశాడు. నా మిత్రులందరికీ చెప్తూండటంతో అతనికి కొంచెం గిరాకీ పెంచినవాడినయాను.

అతని గరాజ్ లో మూల చాలా పాత నంబర్ లేని వోక్స్ వాగన్ దుమ్ము కొట్టుకుని చాలా మిస్టీరియస్ గా కనిపించేది. రోజు వుండబట్టలేక అడిగేశాను. ‘ఎన్నాళ్ళ కారది. నువ్విక్కడికెప్పుడొచ్చావ్ . నీదేనా లేక ఎవరిదన్నానాఅనడిగాను. నవ్వాడు. మాట్లాడలేదు. కారు బోనెట్ వేసి తుడుస్తూఇరవై యేళ్ళక్రితం మా వోనర్ గారమ్మాయి బెంగుళూరులో చదూతుండేది. ఆమె ఎవరో సౌత్ వాడితో ప్రేమలో పడి పెళ్ళి చేసుకుంది. మా వోనర్ కిష్టం లేదు. కారులో ఇద్దరం బెంగుళూరంతా తిరిగాం. వారిద్దర్నీ పట్టుకోలేక పోయాం. ఎలాగైనా కనిపెట్టి తీసుకు రమ్మని ఆయన పంజాబ్ వెళ్ళిపోయాడు. వెళ్ళి దొరకలేదని చెప్తే చంపేస్తాడు. కుర్ర జంట హాపీగా వుంటే నేనెందుకు డిస్టర్బ్ చేయాలి. తిరిగి తిరిగి నేనూ సౌత్ లోనే మెకానిక్ గా స్థిరపడ్డాను. దాన్లో ఇస్పేర్ పార్టులన్నీ అపుడపుడూ అమ్మేశాను. భోజనం చేసేందుకు నిద్రపోయేందుకు కారు వాడుకుంటానన్నాడు నవ్వుతూ.

బాగుంది ఇంతకీ మీ ఓనర్ గారి అమ్మాయి పేరు చమేలీ జంజన్ వాలానాఅన్నాను నవ్వుతూ. అతను వులిక్కిపడిఅవును సర్ మీకెలా తెలుసుఅన్నాడు.

ఇలాటిదే కధ అప్పట్లో పేపర్ లో చదివాన్లేఅనిమొత్తానికి నీ కారు కధ బాగుందిఅన్నాను.

జస్విందర్ వెతికింది నా కోసమే అని, మా మామగారు పోయిన తన కారు కోసం ప్రయత్నాలు చేసి విసిగి పోయాడని, జస్విందర్ తో చెప్తే బాగుండేదా అని కారెక్కాక అనిపించింది. కానీ కొన్ని కధలు ఎలా మొదలై ఎలా మలుపు తిరుగు తాయో తెలీవు కదా అనుకుంటూ ముందుకొచ్చేశాను

డాక్టర్ విజయ్ కోగంటి

విజయ్ కోగంటి పేరుతో 1993 నుండి కవితా వ్యాసంగం. అనేక దిన, వార, మాస, పత్రికలు, ఆన్ లైన్ పత్రికలలో ప్రచురణలు. 2012 లో ‘కూలుతున్న ఇల్లు’ కవితకు నవ్య-నాటా బహుమతి. తెలుగు, ఇంగ్లీషుల్లో కవిత, కథారచనతో పాటు అనువాదాలు, సమీక్షలు, సాహిత్య బోధన ప్రధాన వ్యాసంగాలు. ’ఇలా రువ్వుదామా రంగులు’ (2017) మొదటి కవితా సంపుటి. స్వయం ప్రతిపత్తి గల ప్రభుత్వ మహిళా కళాశాలలో ఆంగ్ల శాఖాధ్యక్షుడు
drvijaykoganti@gmail.com

M: 8801823244

2 comments

Categories

Your Header Sidebar area is currently empty. Hurry up and add some widgets.