చొక్కా పాట

Thomas Hood

(విలియం హుడ్ (1799 మే 23 – !845 మే 3) ఆంగ్ల కవి, వ్యంగ్య రచయిత.  నిట్టూర్పుల వంతెన (బ్రిడ్జ్ అఫ్ సైస్), చొక్కాపాట (ది సాంగ్ అఫ్ ది షర్ట్) వంటి పద్యాల సుప్రసిద్ధులయ్యారు. అనారోగ్యం వల్ల 45 ఏట మరణించారు…)  

పని…పని…పని
పట్టుతప్పిపోతున్న చేతివేళ్ళతో
భారంగా మూతపడే కనురెప్పలతో
చిరిగిన దుస్తులు ధరించి
చేతిలో సూదీ దారంతో
ఓ మహిళ
దారిద్య్రం.. ఆకలి… మాలిన్యంలో
అదేపనిగా చొక్కా కుడుతునే వుంది
దుఃఖపు గొంతుతో
చొక్కా పాటను పాడుతుంది

పని…పని…పని
కోడి కూసింది మొదలు
ఆకాశంలో చుక్కలు పొడిచే దాకా
ఆత్మ లేని దేహంతో
టర్కీ బానిసలా
ఈ క్రిస్టియన్ మహిళ
అదేపనిగా పనిచేస్తుంది

పని…పని…పని
ఆమె మెదడు మొద్దుబారే వరకు
ఆమె కళ్ళు మసకబారే వరకు
కాలరు…చేతులు…జేబులు కుడుతుంది
కుడుతూ కుడుతూ కూర్చున్నచోటనే
బొత్తాలపై నిద్రలోకి జారుకుంటుంది
నిద్రలో సైతం బొత్తాలు కుడుతునే వుంటుంది

“నాయినలారా…
మీరు తొడుక్కుంటున్నవి
మేము కుట్టే చొక్కాలను కాదు
మా బతుకులను
దారిద్య్రం… ఆకలి … మాలిన్యంలో
మేము కుడుతున్నవి
మీ చొక్కాల రూపంలోని
మా పేత వస్త్రాలను

“మరణమంటే భయం లేదు నాకు
అయినా మరణం గూర్చి ఇప్పుడు
నేనెందుకు ఆలోచిస్తున్నాను
మరణం ఎలా వుంటుంది
మరణం నా ఆకారంలో వుంటుందా?
పదే పదే ఆకలితో నకనకలాడే
ఎముకుల గూడులాంటి
నా దేహంలా వుంటుందా!
భగవంతుడా! నేను కొని తినే రొట్టు కంటే
నా రక్తమాంసాలే చవక

“పని…పని…పని
అంతంకాని పని
కుక్కి మంచం…మాడిన రొట్టె
గుడ్డపీలికలు…కారిన పైకప్పు
తడిసిన నేల…విరిగిన కుర్చీ
నా పనికి ప్రతిఫలాలు
నేను బతికున్నానన్నట్టు
ఖాళీ గోడపై అప్పుడప్పుడు
నా నీడ పడుతుంటుంది

“పని…పని…పని
ప్రతిక్షణం పని
నేరస్థుడికి పడే శిక్షలాంటి పని
మెదడు మొద్దుబారేంత వరకు
చేతివేళ్ళు పట్టు తప్పేంతవరకు
మనసు జబ్బు పడేంతవరకు

“డిసెంబర్ మాసపు మసక వెలుతురులో
పని…పని…పని
బయట కాసింత వెలుతురు
వెచ్చదనం వచ్చినప్పుడు
పని…పని…పని
గోడపైన గూటిలోని
అప్పుడే పుట్టిన స్వాలో పక్షులు
తమ వీపుతో వెలుతురును చూపిస్తాయి
తమ కూతలతో నాకు వసంతాన్ని వినిపిస్తాయి

“నా నెత్తిపై ఆకాశంతో
నా కాళ్ళ కింద పచ్చగడ్డితో
గతంలోలా ఓ గంటసేపు
కౌస్లిప్ ప్రిమ్ రోజ్ పువ్వుల
పరిమళాలను పీల్చుదామంటే
ఆ సమయం ఖరీదు సైతం ఇప్పుడు
నాకొక పూట భోజనంతో సమానం

“నా బతుకులో
విశ్రాంతి లేదు… ప్రేమ లేదు.. ఆశ లేదు
వున్న కాసింత సమయం
దుఃఖించడానికే సరిపోతుంది
ఆ ఏడుపే నా మనసుకు కాస్త ఉపశమనాన్నిస్తుంది
ఉప్పు సముద్రంలాంటి నా కన్నీరు
నా కళ్ళలోనే ఇంకిపోవాలి
లేదంటే కళ్ళు మసకబారి
సూదీ దారంతో నేను చేస్తున్న
పనిని ఆటంకపరుస్తుంది”

అలసిన చేతివేళ్ళతో
భారంగా మూతపడే కనురెప్పలతో
ఒంటిపై చిరిగిన బట్టలతో
చేతిలో సూదీ దారంతో
ఓ మహిళ
దారిద్య్రం.. ఆకలి…మాలిన్యంలో
అదేపనిగా కుడుతునే వుంది
ఎప్పటికైనా…
ధనవంతుల చెవిని చేరేనా!
దుఃఖపు గొంతుతో పాడిన
ఆమె చొక్కా పాట!!

ఇంగ్లీషు మూలం:

  The Song of the Shirt)

With fingers weary and worn,
With eyelids heavy and red,
A woman sat in unwomanly rags,
Plying her needle and thread—
Stitch! stitch! stitch!
In poverty, hunger, and dirt,
And still with a voice of dolorous pitch
She sang the “Song of the Shirt.”

“Work! work! work!
While the cock is crowing aloof!
And work—work—work,
Till the stars shine through the roof!
It’s O! to be a slave
Along with the barbarous Turk,
Where woman has never a soul to save,
If this is Christian work!

“Work—work—work,
Till the brain begins to swim;
Work—work—work,
Till the eyes are heavy and dim!
Seam, and gusset, and band,
Band, and gusset, and seam,
Till over the buttons I fall asleep,
And sew them on in a dream!

“O, men, with sisters dear!
O, men, with mothers and wives!
It is not linen you’re wearing out,
But human creatures’ lives!
Stitch—stitch—stitch,
In poverty, hunger and dirt,
Sewing at once, with a double thread,
A Shroud as well as a Shirt.

“But why do I talk of death?
That phantom of grisly bone,
I hardly fear his terrible shape,
It seems so like my own—
It seems so like my own,
Because of the fasts I keep;
Oh, God! that bread should be so dear.
And flesh and blood so cheap!

              
“Work—work—work!
My labour never flags;
And what are its wages? A bed of straw,
A crust of bread—and rags.
That shattered roof—this naked floor—
A table—a broken chair—
And a wall so blank, my shadow I thank
For sometimes falling there!

“Work—work—work!
From weary chime to chime,
Work—work—work,
As prisoners work for crime!
Band, and gusset, and seam,
Seam, and gusset, and band,
Till the heart is sick, and the brain benumbed,
As well as the weary hand.

“Work—work—work,
In the dull December light,
And work—work—work,
When the weather is warm and bright—
While underneath the eaves
The brooding swallows cling
As if to show me their sunny backs
And twit me with the spring.

“O! but to breathe the breath
Of the cowslip and primrose sweet—
With the sky above my head,
And the grass beneath my feet;
For only one short hour
To feel as I used to feel,
Before I knew the woes of want
And the walk that costs a meal!

“O! but for one short hour!
A respite however brief!
No blesse d leisure for Love or hope,
But only time for grief!
A little weeping would ease my heart,
But in their briny bed
My tears must stop, for every drop
Hinders needle and thread!”

With fingers weary and worn,
With eyelids heavy and red,
A woman sat in unwomanly rags,
Plying her needle and thread—
Stitch! stitch! stitch!
In poverty, hunger, and dirt,
And still with a voice of dolorous pitch,—
Would that its tone could reach the Rich!—
She sang this “Song of the Shirt!”

– Thomas Hood

మొయిద శ్రీనివాస రావు

4 comments

  • మొయిదా, థ్యాంక్యూ. ఇంతకన్నా ఏం చెప్పను. మీ కృషి వెలకట్టలేనిది.

    • శ్రీరామ్ నాకు నచ్చిన కవితను తెలుగులోకి అనువాదం చేసానంతే. ధన్యవాదాలు.

  • ఈ కవితకు మంచి చిత్రాలను జతచేసిన హెచ్చార్కే గారికి…పత్రికా నిర్వాహకులకు ధన్యవాదాలు.

Categories

Your Header Sidebar area is currently empty. Hurry up and add some widgets.