నిష్ఫల నివేదన
Futile Lament

‘రస్తా’ మేరకు ఇది కుంచెం కొత్త ప్రయోగం. ఒక సమకాలీన తెలుగు కవి తాజా కవితను ఇంగ్లీషు చేసి ప్రచురించడం. ఒకరకంగా దీన్నొక వర్క్ షాప్ గా కూడా వాడుకుందాం. కవితను స్వయంగా కవే చేసినా సరే, మంచి అనువాదకునితో చేయించి పంపినా సరే. స్వయంగా చేసుకునే వారు తమ దగ్గర్లోని ఆంగ్ల భాషా ప్రవీణులతో సరి చూయించుకు పంపాలి. (మా ఇంగ్లీషు పరిజ్ఞానం మీద ఆధారపడొద్దు 🙂 )

మొదట, సుప్రసిద్ధ అనువాదకులు ఎలనాగ తమ సొంత కవితకు ఆయనే చేసిన ఇంగ్లీషు అనువాదం ఈ క్రింద. దాని కింద తెలుగు కవితనూ చదవండి. కవిత్వం మీదా, అనువాదం మీదా వ్యాఖ్యానించండి…. ఎడిటర్.

 

Futile Lament

These delicate damsels
dropping down like withered buds
are baits to cruel mad machetes.
Their soft bodies have no sheathes
Supple stems are they,
suitable for hacking by swords.
Their safety is but a chimera
Cheap are their lives
in the fair of free seduction.
For the fault of offering flawless friendship
wild beasts unleash onslaught on them
No stoppage to the frenetic rage of beasts
for it is utterly unattainable
Law, security agencies are silent witnesses
to the torture on maids by baddies
Restraint is always an ornament to rulers
Merciless is the regime despite much bloodshed

My little lassies!
Many people are around you;
yet you are orphans!
Sound of shrieks
is not a new sorrow here
No solution to old woes either,
even in distant horizon

No infantry here to mitigate
your poignant piteous pleas
Nor to avert gory end
to your untainted hopes;
nothing to dispel your despondency

Forgive us sisters,
for we are incompetent.
Shameless, feckless prophets we are,
for we can offer you no emancipation

నిష్ఫల నివేదన

వాడిన మొగ్గల మాదిరి  వడివడిగా
నేల రాలుతున్న ఈ సుకుమారులు
ఉన్మాదమే ఊపిరైన
కరకు కటారులకు ఎరలు
కవచం కరువైన వీళ్ల సున్నితదేహాలు
కత్తివేటులకు అనువైన
మెత్తని వృక్షకాండాలు
రక్షణ అనేది వీళ్లకు
ఎడారిలోని మరీచిక
స్వేచ్ఛా విమోహవిపణిలో
వీళ్ల ప్రాణాలు మరీ చవక
అమలిన స్నేహాన్ని అందించిన పాపానికి
అనుభవించాలి రాక్షస దాడి
క్రూరమృగాల విశృంఖల విహారానికి
అడ్డుకట్ట అనే ధ్యాస
లొటపిట పెదవులకోసం
బక్కచిక్కిన నక్క పడే ఆశ
అబలలమీద అడవిమెకాల బలప్రదర్శనకు
రక్షణ న్యాయ యంత్రాంగాలే
నిశ్శబ్ద నిర్దాక్షిణ్య సాక్షులు
సంవిధానానికి సంయమనం
ఎప్పుడూ ఒక భూషణమే
ఎంత రక్తతర్పణం జరిగినా
దాని హృదయం పాషాణమే
అందరూ చుట్టూ వున్నా
అనాథలుగా మిగిలిపోతున్న
చిట్టి తల్లుల్లారా!
ఆర్తరావాల ఆవర్తనమన్నది
ఇక్కడ కొత్త విషాదమేం కాదు
పాత విచారాలకు పరిష్కారమన్నది
కనుచూపు మేరలో కనిపించదిక్కడ

మీ దీన అభ్యర్థనలకు
మీ దయనీయ కంపిత స్వరాలకు
స్పందించి ఆపన్న హస్తమందించడానికి
మీ వినిర్మల ఆశాంకురాలు
రక్తసిక్తం కాకుండా ఆపడానికి
మీ దైన్యాన్ని రూపుమాపడానికి
ఇక్కడ ఏ సైన్యమూ లేదు

క్షమించండి తల్లుల్లారా!
మేం అశక్తులం
విముక్తిని మీకు ప్రసాదించలేని
నిరర్థక లజ్జావిహీన ప్రవక్తలం

‘సజలనయనాల కోసం కవితా సంపుటి (2010) 
‘అనేక కవితా సంకలనం 

ఎలనాగ

ఎలనాగ: అసలుపేరు డాక్టర్ నాగరాజు సురేంద్ర. పుట్టింది కరీంనగర్ జిల్లాలోని ఎలగందులలో, 1953. చిన్నపిల్లల డాక్టరు కాని, ప్రాక్టీసు చెయ్యటం లేదు. రాష్ట్రప్రభుత్వ వైద్య ఆరోగ్యశాఖలో పని చేసి, డెప్యూటీ కమిషనర్ స్థాయి హోదాలో 2012 లో పదవీ విరమణ.
ఇప్పటి వరకు 24 పుస్తకాలు రాశారు. పన్నెండు స్వతంత్ర రచనలు, 12 అనువాదాలు. అనువాదాల్లో 8 ఇంగ్లిష్ నుండి తెలుగులోకి, 4 తెలుగునుండి ఇంగ్లిష్ లోకి. తెలుగులో వచనకవితా సంపుటులు, ఛందోబద్ధ పద్యాల సంపుటి, ప్రయోగపద్యాల సంపుటులు, గేయాల సంపుటి, భాష గురించిన వ్యాసాల సంపుటులు, ప్రాణిక గళ్లనుడికట్ల పుస్తకం.
లాటిన్ అమెరికన్ కథలు, ఆఫ్రికన్ కథలు, ప్రపంచదేశాల కథలు, సోమర్సెట్ మామ్ కథలు - తెలుగు చేశారు. కవిత్వాన్ని ఇంగ్లిష్ నుండి తెలుగు లోకి, తెలుగునుండి నుండి ఇంగ్లిష్ లోకి అనువదించారు. వట్టికోట ఆళ్వారు స్వామి రచించిన ‘జైలు లోపల’ ను Inside the Prison పేరుతో, పవన్ కుమార్ వర్మ రాసిన Ghalib: The Man The Times ను ‘గాలిబ్ - నాటి కాలం’ శీర్షికతో ఆంగ్లంలోకి అనువదించారు. శాస్త్రీయ సంగీతం మీద స్వయంగా రాసిన తెలుగు కవితలను Memorable Melody Makers and Other Poems on Music పేరిట అనువదించి, ప్రచురించారు. తెలంగాణ సాహిత్య అకాడమి వారు ప్రచురించిన Astitva - Short Fiction from Telangana కు సహసంపాదకత్వం వహించారు. Indian Literature, Muse India, Episteme మొదలైన ప్రింట్/ వెబ్ పత్రికల్లో వీరి అనువాద కవిత్వం అచ్చయింది.

3 comments

  • కుంచెం కొత్త ప్రయోగం చేసిన….కవిత, బాగుంది,అనువాదం, బాగుంది .సర్👌కాకుంటే,ఇంగ్లీష్ కవిత,నాలాంటి వారు చదువుకోవడం.. కష్టం అనిపించింది.. Eg. poignant ,mitigate, ఇలా కొన్ని పదాల అర్ధాలకు.వెతుకు కున్నా!ప్రచురించిన, మీకు,రచయిత కు.ధన్యవాదాలు. సర్💐👌👍!

  • చిక్కటి కవితకు చక్కగా అనువాదం చేసారు సార్

  • పద్మ గారూ, నా కవిత & అనువాదం మీకు నచ్చినందుకు సంతోషం, కృతఙ్ఞతలు. సందర్భాన్ని బట్టి అట్లాంటి పదాలను వాడాల్సి వస్తుందొక్కక్కప్పుడు.

    రవీందర్ గారూ!
    Thank you, for your nice comment.

Categories

Your Header Sidebar area is currently empty. Hurry up and add some widgets.